Gangs of Godavari Review విశ్వక్ సేన్ మ్యాన్ మ్యాన్ షో.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ఎలా ఉందంటే?

Rating: 2.75/5

నటీనటులు: విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, నాజర్, సాయికుమార్, మధునందన్, ప్రవీణ్, గోపరాజు రమణ, ఆయేషా ఖాన్ తదితరులు
రచన, దర్శకత్వం: కృష్ణ చైతన్య
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సినిమాటోగ్రఫి: అనిత్ మాదాడి
ఎడిటింగ్: నవీన్ నూలి
సంగీతం: యువన్ శంకర్ రాజా
బ్యానర్: సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
రిలీజ్ డేట్: 2024-05-31

గోదావరి ప్రాంతంలోని లంక గ్రామాల్లో జరిగిన రాజకీయ ఫ్యాక్షన్ గొడవల్లో తల్లి, తండ్రి గద్దెరాజు (సాయికుమార్) చిన్నతనంలోనే చనిపోవడంతో రత్న (విశ్వక్ సేన్) అనాధగా, బాధ్యతలేని యువకుడిగా, రౌడీగా పెరుగుతాడు. రత్నమాల (అంజలి) సహచర్యంలో దొంగతనాలు, రౌడీయిజం చేస్తూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. ఇక లంక గ్రామాల్లో అప్పటికే నానాజీ (నాజర్), దొరస్వామి రాజు (గోపరాజు రమణ) మధ్య రాజకీయ ఆధిపత్యం కోనసాగతుండటంతో వారి మధ్య రత్న తలదూర్చుతాడు. నానాజీ అండంతో దొరస్వామి రాజుపై ఎమ్మెల్యేగా నెగ్గుతాడు. ఇలాంటి నేపథ్యంలో నానాజీ కూతురు బుజ్జి (నేహా శెట్టి) రత్నం జీవితంలోకి వచ్చి తన దూకుడుకు కళ్లెం వేసే ప్రయత్నం చేస్తుంది.

Gangs of Godavari Review in Telugu  and Rating  Vishwak Sen  Neha Sheety  Anjali brilliant performance

తండ్రి గద్దె రాజును రత్న స్వయంగా ఎందుకు చంపాడు? అనాథగా పెరిగిన రత్నకు రత్నమాల ఏ విధంగా సహకారం అందించింది. బుజ్జి ఏ పరిస్థితుల్లో రత్నం జీవితంలోకి వచ్చింది? చిల్లర దొంగతనాలు చేసుకొనే రత్నకు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకొన్నాడు? దొరస్వామి రాజుపై ఎలా ఎమ్మెల్యేగా గెలిచాడు? ఎమ్మెల్యే రత్నపై దొరస్వామి వర్గం ఎలాంటి కుట్రలు పన్నారు? తన స్నేహితుడు యాదు (గగన్) తనపై ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎలా గెలిచాడు? యాదూ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రత్న పరిస్థితి ఏమిటి? ఇలాంటి వర్గపోరులో రత్న కుటుంబానికి జరిగిన అన్యాయం ఏమిటి? యాదుకు సంబంధించిన కేసులో రత్న జైలుకు వెళ్లిన తర్వాత ఎలాంటి సంఘటనలు చోటు చేసుకొన్నాయి అనే ప్రశ్నలకు సమాధానమే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కథ.

Gangs of Godavari Review in Telugu  and Rating  Vishwak Sen  Neha Sheety  Anjali brilliant performance
ఇక కథ, కథనాల విషయానికి వస్తే.. గోదావరి జిల్లాలోని కొవ్వూరు ప్రాంతంలోని లంక గ్రామాల సాగే కత్తి కట్టే సంప్రదాయంతో సన్నివేశాలు హై ఇంటెన్స్‌తో మొదలు అవుతాయి. అయితే రత్న క్యారెక్టర్ మీద ఎక్కువగా కాన్సంట్రేట్ చేయడంతో కథ,కథనాలు బలహీనంగా అనిపిస్తాయి. సన్నివేశాలు గోదావరి కెరటాల్లా పడుతూ లేస్తుంటాయి. ఇంటర్వెల్‌లో మంచి పవర్‌పుల్ ఎపిసోడ్‌తో సినిమా లేచిందనిపించేలా దర్శకుడు కృష్ణ చైతన్య కమర్షియల్ ఫార్మాట్‌తో డిజైన్ చేసుకోవడం ప్లస్ పాయింట్‌గా అనిపిస్తుంది.
Gangs of Godavari Review in Telugu  and Rating  Vishwak Sen  Neha Sheety  Anjali brilliant performance
ఇక ఇంటర్వెల్ బ్యాంగ్‌ అదిరిపోయిందనే ఫీలింగ్‌ ఉన్న ప్రేక్షకుడికి అదే తీరుతో కథ నడుస్తుంది. అయితే బుజ్జి కోరిక మేరకు రాజీ పడుతూ గోదావరిలో జరిగే మీటింగ్ పాయింట్‌తో మళ్లీ ఓ రేంజ్‌కు సినిమా చేరేలా ఉందనిపిస్తుంది. ఆ తర్వాత జైలులో కూతురుతో రత్నసన్నివేశాలు, క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలు సినిమాను మరింత లేపేలా చేశాయి. అయితే కథలో ఎమోషన్స్ భారీగా ఉన్నప్పటికీ.. ఓ ఫ్లోలో లేకపోవడం వల్ల డైరెక్టర్ టార్గెట్ గురితప్పిందనే ఫీలింగ్ కలుగుతుంది.

ఇక నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. రత్నగా విశ్వక్ సేన్ వన్ మ్యాన్ షోగా చెప్పుకోవచ్చు. యాక్షన్, లవ్, రొమాన్స్, ఎమోషన్స్ కలగలిపి విశ్వరూపం చూపే ప్రయత్నం చేయడం బాగుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్లలో విశ్వక్ చూపించిన పవర్ మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకొనేలా ఉంటుంది. నటుడిగానే కాకుండా మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ కావడానికి రత్నపాత్ర విశ్వక్ సేన్‌కు ఉపయోగపడుతుంది. అయితే నేహా శెట్టి, అంజలి అందరూ ఊహించిన విధంగా గ్లామర్ కొటేడ్ రోల్స్ కాకపోవడం సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్. వారిద్దరూ పెర్ఫార్మెన్స్ ఎక్కువగా స్కోప్ ఉన్న పాత్రలతో ఆకట్టుకొన్నారు. గ్లామర్, రొమాన్స్ సన్నివేశాల్లోను వారిద్దరూ మెప్పించారు. గోపరాజు, నాజర్, సాయికుమార్ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. కానీ గోపరాజు కొత్తగా కనిపించినప్పటికీ.. దొరస్వామి రాజు పాత్ర ఆయన ఇమేజ్‌కు ఎక్కువైనట్టు అనిపించడం వల్ల.. ఆ పాత్రకు సరితూగలేదనే ఫీలింగ్ కలుగుతుంది. మిగితా పాత్రల్లో కనిపించిన వారంతా మెప్పించే ప్రయత్నం చేశారు.

Gangs of Godavari Review in Telugu  and Rating  Vishwak Sen  Neha Sheety  Anjali brilliant performance
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. యువన్ శంకర్ రాజా మ్యూజిక్, అనిత్ మాదాడి సినిమాటోగ్రఫి ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. యాక్షన్ సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పలు సన్నివేశాలను మ్యూజిక్ బాగా ఎలివేట్ చేసిందనే చెప్పాలి. ఇక నవీన్ నూలీ ఎడిటింగ్ బాగుంది. ఒక్కో సన్నివేశం ప్రకారం బాగుందనిపిస్తుంది. ఓవరాల్‌గా కథగా ఎదో మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. వారి బ్యానర్ ప్రతిష్టకు ఏ మాత్రం తీసిపోకుండా ప్రొడక్షన్ వ్యాల్యూస్ కనిపించాయి.

ఫైనల్‌గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా గురించి చెప్పుకోవాలంటే.. విశ్వక్ సేన్ ఆల్ రౌండర్‌గా చూపించడానికి ఆయన క్యారెక్టర్ చుట్టు అల్లుకొన్న కథగా అనిపిస్తుంది. స్టార్ గానే కాకుండా నటుడిగా తన సత్తాను విశ్వక్ చాటుకోవడం ఈ సినిమాకు ప్లస్. కొన్ని సన్నివేశాలు ఓ రేంజ్‌లో డిజైన్ చేయగా.. మరికొన్ని సీన్లు ల్యాగ్‌గా అనిపిస్తాయి. ఫ్యామిలీ ఎమోషన్స్,యాక్షన్ అంశాలు ఉన్న సినిమా అనిచెప్పవచ్చు. మాస్ ఆడియెన్స్, బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు కనెక్ట్ అయితే భారీ విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. పవర్‌పుల్ యాక్షన్ డ్రామా చూడాలనుకొనే వారికి ఈ వారం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫర్‌ఫెక్ట్ ఛాయిస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X