For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Gangster Gangaraju review.. మాస్ ఎలిమెంట్స్‌తో లక్ష్.. యాక్షన్ ఎంటర్‌టైనర్ ఎలా ఉందంటే?

  |

  Rating: 2.5/5

  టాలీవుడ్‌లో వారసుల పరిచయం కొత్తేమీ కాదు. తెలుగు సినిమా పరిశ్రమకు భారీ విజయాలు అందించిన నిర్మాత చదలవాడ కృష్ణమూర్తి కుటుంబం నుంచి తాజాగా గ్యాంగ్‌స్టర్ గంగరాజు చిత్రం ద్వారా హీరోగా లక్ష్ చదలవాడ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందు వచ్చిన టీజర్లు, ట్రైలర్లు మంచి బజ్ క్రియేట్ చేశాయి అయితే ఈ చిత్రంపై విడుదలకు ముందే ఏర్పడిన అంచనాలను అందుకొందా? హీరోగా లక్ష్ ఏమేరకు సక్సెస్ అయ్యాడు? గ్యాంగ్‌స్టర్ గంగరాజు చిత్రం ఎలాంటి అనుభూతిని అందించిందనే విషయాల్లోకి వెళితే..

  Recommended Video

  Sammathame,Chor Bazaar Movie Review | Kiran Abbavaram | Akash Puri *Reviews |FilmiBeat Telugu
  గ్యాంగ్‌స్టర్ గంగరాజు కథ ఇలా..

  గ్యాంగ్‌స్టర్ గంగరాజు కథ ఇలా..


  దేవరలంక గ్రామంలో బాధ్యతలేకుండా అల్లరిగా తిరిగే యువకుడు గంగరాజు. చిన్నతనంలో తల్లి చనిపోవడంతో గారాబంగా పెరుగుతాడు. రైల్వేలో ఉద్యోగం చేసిన తండ్రి రిటైర్మెంట్ కావడంతో డిపార్ట్‌మెంట్ చేత సన్మానం పొందుతాడు. అలా సన్మానం అదుకొన్న తండ్రి సిద్దప్ప అనే గ్యాంగ్‌స్టర్ చేతిలో తీవ్ర అవమానానికి గురికావడాన్ని గంగరాజు తట్టుకోలేకపోతాడు. సిద్దప్పకు తగిన గుణపాఠం నేర్పాలని వెళ్తాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో సిద్దప్ప హత్య తన మీద పడటంతో గంగరాజు గ్యాంగ్‌స్టర్‌గా మారుతాడు.

   గ్యాంగ్‌స్టర్ గంగరాజు ట్విస్టులు

  గ్యాంగ్‌స్టర్ గంగరాజు ట్విస్టులు


  గ్యాంగ్‌స్టర్ సిద్దప్ప ఎలా చనిపోయాడు? బసిరెడ్డితో గంగరాజకు వైరుధ్యం ఏమిటి? గ్యాంగ్‌స్టర్‌గా మారిన గంగరాజు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు? గ్యాంగ్‌స్టర్‌గా మారిన ఇన్స్‌పెక్టర్ ఉమాదేవి (వేదిక ద‌త్త‌) ఇష్టపడిన గంగరాజు తన ప్రేమను గెలిపించుకొన్నాడా? ఈ కథలో బసిరెడ్డి (చరణ్), నర్సారెడ్డి (శ్రీకాంత్ అయ్యంగార్) పాత్రలు ఏమిటి? గ్యాంగ్‌స్టర్ ఠాకూర్ (వెన్నెల కిషోర్) రోల్ ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానాలు తెరపైన చూడాల్సిందే.

  మాస్ ఎలిమింట్స్‌తో

  మాస్ ఎలిమింట్స్‌తో


  మాస్‌ హీరోగా ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో లక్ష్‌‌ కోసం రెగ్యులర్ కథను ఎంచుకొన్నప్పటికి.. అనేక ట్విస్టులు, హాస్యంతో గాంగ్‌స్టర్ గంగరాజును కొత్తగా ఆవిష్కరించారు. ఇషాన్ రాసుకొన్న కథ.. అనుసరించిన స్క్రీన్ ప్లే కొత్తగా ఉంది. ఇంటర్వెల్‌కు ముందు వరకు హీరోను కథ నడిపితే.. ఇంటర్వెల్ తర్వాత హీరోనే కథను నడపడం ఇందులో స్పెషల్‌గా ఉంటుంది. దర్శకుడు ఇషాన్ సూర్య తన వంతుగా ఫర్వాలేదనిపించాడు.

  లక్ష్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?

  లక్ష్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?


  వలయం చిత్రంతో మంచి మార్కులు కొట్టేసిన లక్ష్.. గ్యాంగ్‌స్టర్ గంగరాజు సినిమాతో పూర్తిస్థాయిలో మాస్ హీరోగా ఆకట్టుకొన్నాడు. బాడీ లాంగ్వేజ్, పాత్ర పరంగా యాటిట్యూడ్, ఫైట్స్, పాటలతో మరోసారి ఆకట్టుకొన్నాడు. మాస్ గెటప్‌తో మంచి అనుభవం ఉన్న నటుడిగా తన పాత్రలో ఒదిగిపోయాడు. కొత్తవాడైనప్పటికీ.. తొణుకు బెణుకు లేకుండా తెరపైన రాణించాడు. ఎమోషనల్ సీన్లలో, రొమాంటిక్ సీన్లలో మంచి ఫెర్ఫార్మెన్స్ కనబరిచాడు.

  మిగితా క్యారెక్టర్లలో

  మిగితా క్యారెక్టర్లలో


  మిగితా పాత్రల్లో వెన్నెల కిషోర్ తనదైన మార్కును ప్రదర్శించాడు. బసిరెడ్డిగా చరణ్ దీప్ మెయిన్ విలన్ పాత్రలో మెరిసారు. హీరో తండ్రిగా గోపరాజు రమణ ఎమోషన్స్ పండించాడు. యువ హీరోయిన్ వేదిక దత్త ఇన్స్‌పెక్టర్‌గా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో మెరిసింది. శ్రీకాంత్ అయ్యంగార్ ఫన్‌తో కూడిన విలనిజాన్ని పండించారు. మిగితా క్యారెక్టర్లలో నటించిన వారందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు

   టెక్నికల్ అంశాల గురించి

  టెక్నికల్ అంశాల గురించి


  గ్యాంగ్‌స్టర్ గంగరాజ్ సినిమాకు సాంకేతిక విభాగాల పనితీరు బాగుంది. కణ్ణ సినిమాటోగ్రఫి బాగుంది. సాయి కార్తీక్ మ్యూజిక్, పాటలు సన్నివేశాలను ఎలివేట్ చేశాయి. డ్రాగన్ ప్రకాశ్ డిజైన్ చేసిన ఫైట్స్‌ మాస్‌గా ఉన్నాయి. రేణుకా బాబు ఎడిటింగ్ బాగుంది. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ అనుసరించిన నిర్మాణ విలువలు వల్ల సినిమా చాలా రిచ్‌గా, క్లాస్‌గా ఉంది.

   ఫైనల్‌గా

  ఫైనల్‌గా


  ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, రొమాంటిక్, యాక్షన్ అంశాలు కలబోసిన మాస్ ఎంటర్‌టైనర్ గ్యాంగ్‌స్టర్ గంగరాజు. రెగ్యులర్ కథైనప్పటికీ.. తెర మీద ఆవిష్కరించిన తీరు వినూత్నంగా ఉంది. మాస్ హీరోగా మారడానికి అన్ని అంశాలు లక్ష్‌లో కనిపించాయి. రూరల్ నేటివిటి, మాస్ సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా తప్పక నచ్చుతుంది. లక్ష్ చేసిన మాస్ ప్రయత్నం ప్రేక్షకులను ఆకట్టుకొంటునడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

  నటీనటులు, సాంకేతిక నిపుణులు

  నటీనటులు, సాంకేతిక నిపుణులు


  నటీనటులు: లక్ష్ చదలవాడ, వేదిక ద‌త్త‌, వెన్నెల కిషోర్‌, చ‌ర‌ణ్ దీప్‌, శ్రీకాంత్ అయ్యంగార్, గోప‌రాజు ర‌మ‌ణ‌, నిహార్ క‌పూర్‌, రాజేశ్వ‌రి నాయ‌ర్‌, స‌త్య‌కృష్ణ‌, ర‌వితేజ‌ న‌న్నిమాల‌, స‌మ్మెట గాంధీ, రాజేంద్ర‌, అను మాన‌స‌, లావ‌ణ్య రెడ్డి, అన్న‌పూర్ణ త‌దిత‌రులు
  ద‌ర్శ‌క‌త్వం: ఇషాన్ సూర్య‌
  నిర్మాత‌: శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్
  సినిమాటోగ్ర‌ఫీ: క‌ణ్ణ పి.సి.
  సంగీతం: సాయి కార్తీక్‌
  ఎడిట‌ర్‌: అనుగోజు రేణుకా బాబు
  ఫైట్స్‌:డ్రాగ‌న్ ప్ర‌కాశ్‌
  కొరియోగ్రాఫ‌ర్స్‌: భాను, అనీష్‌
  పి.ఆర్‌.ఓ: సాయి స‌తీశ్‌, ప‌ర్వ‌త‌నేని రాంబాబు

  English summary
  hero Laksh who is picking to do winning scripts is awaiting the release of Gangster Gangaraju directed by young and dynamic director Eeshaan Suryaah. The film is produced prestigiously by 'Sri Tirumala Tirupati Venkateswara Films' and presented by 'Chadalavada Brothers'. Here is the Telugu Filmibeat exclusive review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X