twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Gangubai Kathiawadi review మెప్పించిన ఆలియాభట్.. నిరాశ పరిచిన సంజయ్ లీలా భన్సాలీ

    |

    Rating: 2.75/5

    నటీనటులు: ఆలియా భట్, అజయ్ దేవగణ్, హ్యుమా ఖురేషి, శంతను మహేశ్వరి, విజయ్ రాజ్, వరుణ్ కపూర్, జిమ్ సర్బ్ తదితరులు
    పాటలు, ఎడిటింగ్: మ్యూజిక్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంజయ్ లీలా భన్సాలీ
    డైలాగ్స్: ప్రకాశ్ కపాడియా
    కథ: హుస్సేన్ జైది
    నిర్మాత: సంజయ్ లీలా భన్సాలీ, జయంతిలాల్ గడా
    సినిమాటోగ్రఫి: సుదీప్ చటర్జీ
    బ్యాక్ గ్రౌండ్ స్కోర్: సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా
    బ్యానర్: భన్సాలీ ప్రొడక్షన్స్, పెన్ ఇండియా లిమిటెడ్
    రిలీజ్: 2022-02-25

    గంగూభాయ్ కతియావాడి కథ ఏమిటంటే?

    గంగూభాయ్ కతియావాడి కథ ఏమిటంటే?

    బాలీవుడ్‌లో హీరోయిన్ కావాలనే బలమైన కోరికతో ఉన్న గంగ (ఆలియా భట్)ను ప్రియుడు రామ్నిక్ (వరున్ కపూర్) ఊరి నుంచి ముంబైకి తీసుకెళ్లి కామటిపురా వేశ్యవాటికలో అమ్మివేస్తాడు. అయితే తన మోసపోయానని తెలుసుకొన్న ఆమె చిన్న వయసులోనే నరకకూపంలో కూరుకుపోతుంది. కామటిపురా నుంచి తప్పించుకోలేకపోయిన ఆమె వేశ్యవాటిక ప్రాంతానికి లీడర్‌ స్థాయికి ఎదుగుతుంది.

    కథ, కథనాల్లో ట్విస్టులు

    కథ, కథనాల్లో ట్విస్టులు


    ప్రియుడు మోసగించి వేశ్య వాటికలో అమ్మిన తర్వాత గంగ పరిస్థితి ఏమైంది. చిన్నతనంలో కస్టమర్ల వేధింపులను వేధిస్తే ఆమెకు ఏం జరిగింది? ఎలాంటి పరిస్థితుల్లో వేశ్యవృత్తిలోకి దిగాల్సి వచ్చింది? గంగ పేరుతో వేశ్యవాటికలోకి ప్రవేశించి గంగూభాయ్‌గా ఎలా మారింది? కామటిపురాలో ప్రత్యర్థి రజియా భాయ్ (విజయ్ రాజ్‌)ను ఎలా ఎదురించింది? ముంబై మాఫియా డాన్ రహీమ్ లాలా ( అజయ్ దేవగన్)‌తో ఎందుకు పరిచయం పెంచుకొన్నది? గంగూభాయ్‌కి దిల్‌రుబా (హ్యూమ ఖురేషి) సంబంధమేమిటి? చివరికి గంగూభాయ్ జీవితం ఏమైంది అనే ప్రశ్నలకు సమాధానమే గంగూభాయ్ కతియావాడి సినిమా కథ.

    ఫస్టాఫ్ మెప్పించే ప్రయత్నం..

    ఫస్టాఫ్ మెప్పించే ప్రయత్నం..

    ముంబైలోని కామటిపురాలోని అతిపెద్ద వేశ్యవాటికలో బాలికలు, చిన్న పిల్లలను ఎలా వ్యభిచార వృత్తిలోకి దించుతారనే ఎమోషనల్ పాయింట్‌తో సినిమా కథలోకి వెళ్తుంది. ఆ తర్వాత గంగ అనుభవించిన వేధన, నరకప్రాయమైన జీవితం మరింత భావోద్వేగానికి గురిచేస్తుంది. విధిలేని పరిస్థితుల్లో గంగ వేశ్యవృత్తిని స్వీకరించి.. గంగూభాయ్‌గా మారడం వరకు సీన్లు చకచకా పరుగులు పెడుతాయి. గంగను ఓ మాఫియా డాన్ చిత్రహింసలు పెట్టిన సీన్ గుండెను పిండేస్తుంది. రహీమ్ లీలా పాత్ర ఎంట్రీతో కథలో మరింత ఎనర్జీ కనిపిస్తుంది.

    సెకండాఫ్ ఎలా ఉందంటే..

    సెకండాఫ్ ఎలా ఉందంటే..

    ఇక తొలి భాగంలో మంచి కంటెంట్‌తో సినిమాను పరుగులు పెట్టించిన దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ సెకండాఫ్‌ వరకు వచ్చే వరకు స్క్రీన్ ప్లే పరంగా, కంటెంట్ పరంగా తడబాటు పడినట్టు కనిపిస్తాడు. సెకండాఫ్‌లో బలమైన పాయింట్లు లేకపోవడంతో పాటలతో నెట్టుకొచ్చే ప్రయత్నం చేశాడు. వేశ్యల పిల్లలను స్కూల్‌లో చేర్పించకపోవడమే పాయింట్‌ సెకండాఫ్‌కు కాస్త న్యాయం చేసింది. జవహర్‌లాల్ నెహ్రూను కలిసి ఓ కీలకమైన పాయింట్‌ను చర్చించే అంశం ఆకట్టుకోలేకపోయింది. సీరియస్‌గా ఎమోషనల్‌గా సాగే కథకు బ్రేక్ వేసినట్టు అనిపిస్తుంది.

    ఆలియా భట్ వన్ ఉమెన్ షో

    ఆలియా భట్ వన్ ఉమెన్ షో

    గంగుభాయ్ కతియావాడి సినిమాకు కర్త, కర్మ, క్రియ ఆలియాభట్. ప్రతీ ఫ్రేమ్‌లో మరో పాత్ర కనిపించదు. సినిమా మొత్తంలో విజయ్ రాజ్ పాత్ర తప్ప మరోటి కాగడా పెట్టి వెతికినా ప్రేక్షకుడికి కనెక్ట్ అయినట్టు కనిపించదు. అందం, అభినయం, హావభావాలు, నాటు సరసం, ఎమోషన్స్ పరంగా ఆలియా భట్ వన్ ఉమెన్ షో. వేశ్యలు మాట్లాడే భాష, బాడీ లాంగ్వేజ్‌తో మ్యాజిక్ చేసింది. బలహీనమైన కథ, కథనాలు సినిమాను దిగజార్చిన ప్రతీ సందర్భంలో తన నటనతో నిలబెట్టేందుకు ప్రయత్నించింది. ఇప్పటి వరకు ఆలియాభట్ కెరీర్‌లో గంగూభాయ్ పాత్ర బెస్ట్ అని చెప్పుకోవచ్చు.

    మిగితా పాత్రల్లో

    మిగితా పాత్రల్లో

    మిగితా పాత్రల విషయానికి వస్తే. గంగూభాయ్‌లో రహీమ్ లీలగా అజయ్ దేవగన్ పాత్ర కీలకమైనదే కానీ.. ఆ పాత్రపై సరిగా దృష్టిపెట్టలేదనే విషయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దర్జీగా నటించిన శంతను మహేశ్వరి రొమాంటిక్ సన్నివేశాల్లో ఆకట్టుకొన్నాడు. రజియా భాయిగా విజయ్ రాజ్ తన పాత్ర పరిధి మేరకు పర్వాలేదనిపించారు.

    సాంకేతిక విభాగాల పనితీరు..

    సాంకేతిక విభాగాల పనితీరు..

    సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. దర్శకత్వం, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, ఎడిటింగ్, పాటలు, నిర్మాతగా సంజయ్ లీలా భన్సాలీ వన్ మ్యాన్ షో. స్క్రీన్ ప్లే, ఎడిటింగ్‌తో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడని చెప్పవచ్చు. కానీ మ్యూజిక్, పాటలతో మనసును దోచుకొనే ప్రయత్నం చేశాడు. రెట్రో మూడ్‌లో పాటలు తెరమీద మంచి అనుభూతిని కలిగించాయి. సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ విషయానికి వస్తే.. పిసినారితనం ప్రదర్శించినట్టు కనిపిస్తుంది. ఆలియా పక్కన అడ్రస్ లేని యాక్టర్లను నిలబెట్టడంతో ఆమె నటన ధాటికి వారంతా తేలిపోయారు. ప్రేక్షకులకు పరిచయం లేని అనామక నటులను భారీ పాత్రల్లో చూపించడం వల్ల ఆ స్థాయిలో నటనను ప్రదర్శించలేకపోయారు.

    ఫైనల్‌ జడ్జిమెంట్

    ఫైనల్‌ జడ్జిమెంట్

    ఇక ప్రముఖ రచయిత హుస్సేన్ జైదీ రాసిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై అనే నవల ఆధారంగా గంగూభాయ్ కతియావాడి సినిమాను తెరక్కించారు. కామటిపురలో గంగూభాయ్ కోతేవాలిగా ప్రజాదరణ పొందిన గంగుభాయ్ హర్జివందాస్ అనే వేశ్య, మాఫియా క్వీన్ జీవితంలోని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు అయితే కథ, కథనాల్లో పర్‌ఫెక్షన్ లేకపోవడం వల్ల ఆలియాభట్ ప్రతిభ బూడిదలో పోసిన పన్నీరైంది. సాధారణంగా భావోద్వేగమైన కంటెంట్‌తో రూపొందే సినిమాలు చూస్తే కనిపించే మ్యాజిక్ ఇందులో కనిపించదు. గంగూభాయ్ కతియావాడి సినిమాను చూడాలనుకొంటే కేవలం ఆలియాభట్ కోసమే చూడాలి. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే.. మంచి సినిమా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది.

    English summary
    Bollywood actress Alia Bhatt's Gangubai Kathiawadi movie released on Feb 25th which is directed by Sanjay Leela Bhansali. Here is the Telugu filmibeat exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X