twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'గాయం' ఫర్వాలేదు

    By Staff
    |

    Gayam
    సినిమా: గాయం
    విడుదల తేదీ: 28-07-2006
    నటీనటులు: భరత్‌, ఆర్య , హనీఫ్‌, పద్మప్రియ, పూజ, సంతాన భారతి తదితరులు
    కెమెరా: నీరవ్‌ షా
    సంగీతం: యవన్‌ శంకర్‌ రాజా
    మాటలు, పాటలు: శశాంక్‌ వెన్నెలకంటి
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విష్ణువర్ధన్‌
    నిర్మాత: కిశోర్‌బాబు

    తెలుగు తెరని మరోసారి తమిళ డబ్బింగ్‌' గాయం' చేసింది. 'సిటీ ఆఫ్‌గాడ్‌' ప్రేరణతో తయారైన ఈ చిత్రం పూర్తి స్ధాయిలో హింసను గ్లామరైజ్‌ చేస్తూ నడుస్తుంది. అయినా రివాల్వర్‌ పట్టినవాడు దాని బుల్లెట్‌తోనే మరణిస్తాడని చక్కగా సందేశం ఉండడం విశేషం. తమిళంలో 'పట్టియల్‌'గా సంచలన విజయం సాధించిన ఈ చిత్రం దర్శకత్వ ప్రతిభ, కథన నైపుణ్యం పోటీ పడ్డాయి. యువతను టార్గెట్‌ చేసిన ఈ సినిమా బి,సి సెంటర్లలో బాగా ఆడే అవకాశముంది.

    సభ్యసమాజంతో నిర్లక్ష్యానికి గురైన అభాగ్యుల జీవిత చిత్రం ఈ సినిమా కథ. అనాధలైన ఇద్దరు పిల్లలు ఒకే ప్రాణంగా పెరుగుతారు. కాలక్రమంలో పెద్దయి బతుకు తెరువు కోసం కిరాయి హంతకులవుతారు. మూగ చెవుడు ఉన్న శివ (భరత్‌), ఎప్పుడూ తాగే కోటి (ఆర్య). స్వామి (హనీఫ్‌) అనే వ్యక్తి వీళ్ళకి పనులు తెచ్చిపెట్టే బ్రోకర్‌. బయటి ప్రపంచానికి చావు మేళం వేసే వారిగా నటిస్తూ ఉంటారు. వాళ్ళ జీవితంలోకి అనుకోకుండా సంధ్య (పద్మప్రియ), సరోజ (పూజ) ప్రేమిస్తూ ప్రవేసిస్తారు. ఇదిలా ఉండగా స్వామి ద్వారా కోయంబత్తూరులో ఉన్న పెద్ద రాజకీయ నాయకుడు (సంతాన భారతి) ని చంపమని ఆఫర్‌ వస్తుంది. అంతేగాక పని పూర్తయిన వెంటనే హీరోలిద్దరినీ చంపమని కండిషన్‌కు ఒప్పుకుంటాడు స్వామి. చివరికి శివ, కోటి ఏమయ్యారు? వారి ప్రేమలు ఫలించాయా అన్నది తెర మీద చూడాలి.

    క్లాసిక్‌ నేరేషన్‌తో తయారైన స్క్రీన్‌ప్లే ఎక్కడా బోర్‌ కలిగించకుండా సినిమాను పరుగెత్తించింది. 'అశోక్‌' సినిమా తరహాలో స్నేహితుడు చనిపోవడం, ఎమోషన్‌ రైజ్‌ కావడం జరిగింది. ఫస్టాఫ్‌లో స్నేహితుడితో అనుబంధం పూర్తి స్ధాయిలో ఎస్టాబ్లిష్‌ చేయడం ఈ స్క్రిప్టు విజయం. సినిమా నిండా హత్యలు జరుగుతున్నా పోలీసులు ఎక్కడా కన్పించకపోవడం విచిత్రం. చివర్లో ఆర్య చనిపోయాక భరత్‌ చేసే డ్యాన్స్‌ సినిమాకు హైలైట్‌. పాటలు, మాటలు బాగున్నాయి. మూగ, చెవిటి వాడుగా భరత్‌ నటన బాగుంది. ఆ క్యారక్టర్‌ని దర్శకుడు బాగా డిజైన్‌ చేయడం పండింది. కెమెరా, స్టంట్‌ డిపార్టెమెంట్‌ లదే పూర్తి క్రెడిట్‌. ఏదెలా ఉన్నా బిగుసరైన కథనం, భరత్‌ నటన సినిమాకు ప్లస్‌. తమిళ వాసనలో మితిమీరిన హింస ఫ్యామిలీ ఆడియెన్స్‌ను దూరంచేయవచ్చు.

    గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X