twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గాయత్రి మూవీ రివ్యూ: మోహన్‌బాబు వన్ మ్యాన్ షో!

    |

    Recommended Video

    Gayatri Movie Review

    Rating:
    2.5/5
    Star Cast: మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, శ్రీయ సరన్, అనసూయ భరద్వాజ్
    Director: ఆర్ ఆర్ మదన్

    డైలాగ్ కింగ్ మోహన్‌బాబు తనదైన శైలిలో మాటల తూటలు, నటన రుచి చూపించి చాలా రోజులైంది. టాలీవుడ్‌ తెరపై మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించడానికి మోహన్‌బాబు చేసిన ప్రయత్నం గాయత్రి. టైటిల్‌తోనే మంచి రెస్పాన్స్ సంపాదించుకొన్న మంచు ఫ్యామిలీ.. టీజర్లు, ట్రైలర్లతో అలరించింది. దాంతో గాయత్రి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మోహన్‌బాబు, మంచు విష్ణు, శ్రీయ సరన్ నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సినిమా ఎలాంటి టాక్ సంపాదించుకొందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

     గాయత్రి కథ ఇదే

    గాయత్రి కథ ఇదే

    శివాజీ (మోహన్‌బాబు) రంగస్థల నటుడు. అనాథలను ఆదరించి పెంచి పోషిస్తుంటాడు. పిల్లలు తప్పిపోతే తల్లిదండ్రుల వద్దకు చేర్చే బాధ్యతను భుజాన వేసుకొంటాడు. తప్పిపోయిన తన కూతురు గాయత్రి (నిఖిల్ విమల) కోసం వెతుకుతుంటాడు. ఆ క్రమంలో తన కూతురు కలుసుకొంటాడు. కానీ గాయత్రికి తండ్రి అంటే అసహ్యం భావం తెలుస్తుంది. అంతేకాకుండా రౌటీషీటర్ గాయత్రి పటేల్ (మోహన్‌బాబు)తో వైరం ఏర్పడుతుంది. కొన్ని పరిస్థితుల్లో శివాజీకి మరణ శిక్ష పడుతుంది.

    కథకు ముగింపు ఇలా

    కథకు ముగింపు ఇలా

    తన భార్య శారద (శ్రీయ సరన్)‌కు శివాజీ ఎందుకు దూరమయ్యాడు? కూతురు ఎలా తప్పిపోయింది? గాయత్రి పటేల్‌ ఏ విధంగా గుణపాఠం చెప్పాడు? మరణశిక్ష నుంచి శివాజీ ఎలా తప్పించుకొంటాడు. తనపై కూతురుకు ఉన్న చెడు అభిప్రాయాన్ని ఎలా తొలగించుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే గాయత్రి చిత్ర కథ.

    ఫస్టాఫ్

    ఫస్టాఫ్

    గాయత్రి బలమైన సెంటిమెంట్, అనేక కమర్షియల్ అంశాలు ఉన్న కథ. తొలి భాగంలో శివాజీ భావోద్వేగాలతో సినిమా నడుస్తుంది. శివాజీ నాటకరంగంపైనే కాకుండా నిజజీవితంలో కూడా నాటకం ఎందుకు ఆడాల్సి వచ్చేందనే పాయింట్‌ను బలంగా చెప్పడానికి చేసిన జైలు సంఘటన అంతగా ఆకట్టుకునేలా ఉండదు. తొలిభాగంలో పేలవమైన సన్నివేశాలు కథను బలహీనంగా మార్చాయనే ఫీలింగ్ కలుగుతుంది. హనుమాన్ పాట, కూతురు కలుసుకోబోతున్నాననే సంతోషంలో వచ్చే పాటలు ఫీల్‌గుడ్‌తో వెళ్తున్న సినిమాకు కళ్లెం వేశాయనే అనిపిస్తుంది. శివాజీ యువకుడి (మంచు విష్ణు) కథను ఫ్లాష్‌బ్యాక్‌తో ఆరంభంతో ఇంటర్వెల్ కార్డు పడుతుంది.

     సెకండాఫ్

    సెకండాఫ్

    రెండో భాగంలో శివాజీ జీవితంలోని ప్రేమ, పెళ్లి లాంటి భావోద్వేగాల సన్నివేశాలతో సాదాసీదాగా సాగుతుంది. గాయత్రి పటేల్ పాత్ర ఎంట్రీతో గాయత్రి చిత్రం మరో మలుపుతిరుగుతుంది. గాయత్రి పటేల్‌గా మోహన్ వైవిధ్యమైన నటనను కనబరిచాడు. మోహన్‌బాబులో ఉండే నట విశ్వరూపం క్లైమాక్స్‌లో కనిపిస్తుంది. ఓవరాల్‌గా కూతురు సెంటిమెంట్‌ను పక్కన పెట్టి మోహన్‌బాబు పాత్రలను హైలెట్ చేయడానికా అన్నట్టు గాయత్రి సినిమా ఉంటుంది.

    దర్శకుడి పత్రిభ

    దర్శకుడి పత్రిభ

    కథ, మాటల రచయిత డైమండ్ రత్నబాబు అందించిన అన్ని హంగులు ఉన్న కథను దర్శకుడు మదన్ తెరకెక్కించాడు. తొలిభాగంలో ఉండే కొన్ని స్క్రిప్టుపరమైన లోపాలను సరిదద్దడంలో తడబాటుపడ్డాడా అనే భావన కలుగుతుంది. తొలిభాగంలో కథా వేగానికి అడ్డుపడిన కొన్ని సన్నివేశాలపై దృష్టిపెట్టి ఉంటే బాగుండేది. సెకండాఫ్‌లో దర్శకుడు మదన్ పై చేయి సాధించాడా అనిపిస్తుంది.

    మోహన్‌బాబు నటన

    మోహన్‌బాబు నటన

    మోహన్‌బాబు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు మూడు దశాబ్దాలకుపైగా జీవితంలో ఎన్నో మరుపురాని పాత్రలను పోషించారు. ఇక గాయత్రి విషయంలో తన ఇమేజ్‌కు, బాడీ లాంగ్వేజ్‌కు తగిన కథను ఎంచుకొని రెండు పాత్రలతో పలు రకాల షేడ్స్‌తో మోహన్‌బాబు సినిమాను మరోస్థాయికి చేర్చాడని చెప్పవచ్చు. ఫైట్స్ విషయంలోనూ, పాటల విషయంలోనూ తన సత్తా తగ్గలేదని మరోసారి నిరూపించారు. మాటల తూటాలను పేల్చి మరోసారి డైలాగ్ కింగ్ అనిపించుకొన్నాడు.

    మంచు విష్ణు రోల్

    మంచు విష్ణు రోల్

    యువ శివాజీ పాత్రలో మంచు విష్ణు అతిథిగా కనిపించాడు. భారమైన పాత్రను తన భుజాలపై మోయడంలో సఫలమయ్యాడు. కీలక సన్నివేశాల్లో ఆకట్టుకొన్నాడు విష్ణు. ధుర్యోధనుడి డైలాగ్స్ చెప్పిన తీరు తన ప్రతిభకు అద్దం పట్టింది. తండ్రికి తగ్గ తనయుడు అనేలా విష్ణు నటించాడు.

    గృహిణి పాత్రలో శ్రియ సరన్

    గృహిణి పాత్రలో శ్రియ సరన్

    యువ శివాజీకి భార్యగా శారద పాత్రలో శ్రియ సరన్ నటించింది. పాత్ర పరిధి చాలా తక్కువైనప్పటికీ కళ్లతో భావాలను అద్బుతంగా పలికించింది. శ్రియకు ఈ సినిమా ద్వారా పెద్దగా క్రేజ్ గానీ, పేరు గానీ వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. గ్లామర్‌కు దూరంగా ఉండే పాత్ర కావడం వల్ల శ్రియ అందాలను ఆశించి వచ్చే వారికి కొంత నిరాశే.

     జర్నలిస్టుగా అనసూయ

    జర్నలిస్టుగా అనసూయ

    గాయత్రి చిత్రంలో శ్రేష్ణ అనే జర్నలిస్టు పాత్రను అనసూయ పోషించింది. తొలి భాగంలో ఆ పాత్ర హడావిడి కొంత ఎక్కువగానే కనిపించినా అంతగా ప్రభావం చూపలేకపోతుంది. ఆ పాత్రలో అర్టిఫిషియల్ ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. అనసూయ పాత్ర సన్నివేశాలకు మధ్య బలవంతంగా జొప్పించినట్టు కొన్నిసార్లు అనిపిస్తుంది. పాత్ర నిడివి ఎక్కువగా ఉన్న పాత్రలో శ్రేష్టగా అనసూయ పర్వాలేదనిపించింది.

     మిగితా పాత్రల్లో..

    మిగితా పాత్రల్లో..

    మిగితా పాత్రల్లో ఎంపీ శివప్రసాద్, బ్రహ్మానందం, సత్యం రాజేష్, నాగినీడు తదితరులు నటించారు. పోలీసు పాత్రలో సత్యం రాజేష్ కొంత కామెడీ టచ్ ఇచ్చాడు. జైలర్‌గా నాగినీడుది రొటీన్ పాత్ర. మోహన్‌బాబు అసిస్టెంట్‌గా శివప్రసాద్ ఆకట్టుకొన్నాడు. రెండు మూడు సీన్లలో కనిపించిన బ్రహ్మానందంది రొటిన్ పాత్రే.

     రత్నబాబు డైలాగ్స్ తూటాల్లా

    రత్నబాబు డైలాగ్స్ తూటాల్లా

    గాయత్రి చిత్ర కథకు డైమండ్ రత్నబాబు అందించిన మాటలు స్పెషల్ అట్రాక్షన్. మోహన్‌బాబు నోట రత్నబాబు పలికించిన మాటలు తూటాల్లా పేలాయి. ఈ మధ్య కాలంలో పవర్‌ఫుల్ మాటలు గాయత్రిలో వినిపించాయి. పంచ్‌లకు ప్రాధాన్యమివ్వకుండా సన్నివేశాలకనుగుణంగా రత్నబాబు రాసుకొన్న మాటలు ఆకట్టుకొన్నాయి. సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తాయనడంలో సందేహం అక్కర్లేదు.

    పాటలు మైనస్.. రీరికార్డింగ్ ప్లస్

    పాటలు మైనస్.. రీరికార్డింగ్ ప్లస్

    గాయత్రి సినిమాకు పాటలు మైనస్ పాయింట్స్. తొలి భాగంలో వచ్చే హనుమాన్ పాట, సెంటిమెంట్ పాట, సెకండాఫ్‌లో వచ్చే ఐటెం సాంగ్ పాటలు అసందర్భోచితంగా అనిపిస్తాయి. కథలో లీనమైన ప్రేక్షకుడిని ఆ పాటలు బయటకు లాగేసేలా ఉంటాయి. ఎస్ఎస్ థమన్ అందించిన రిరీకార్డింగ్ సన్నివేశాలకు బలం చేకూర్చింది. ఎడిటింగ్ విభాగానికి ఇంకా చాలా పని ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా చోట్ల కత్తెర పదును తగ్గినట్టు కనిపిసించింది.

     చివరిగా

    చివరిగా

    కూతురు సెంటిమెంట్‌తోపాటు కమర్షియల్ అంశాలు కలిపి తీసిన చిత్రం గాయత్రి సినిమా. మోహన్‌బాబు అభిమానులకు, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసుకొని తీసిన సినిమా ఇది. బీ, సీ సెంటర్ల ఆడియెన్స్ కనెక్ట్ అయితే కమర్షియల్‌గా మంచి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    మోహన్‌బాబు యాక్టింగ్

    • కథ
    • సెంటిమెంట్
    • డైలాగ్స్
    • రీరికార్డింగ్
    • మైనస్ పాయింట్స్

      • తొలిభాగం
      • పాటలు
      • కథనం
      • రొటీన్ సన్నివేశాలు
      •  తెర వెనుక, తెర ముందు

        తెర వెనుక, తెర ముందు

        నటీనటులు: మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, శ్రీయ సరన్, అనసూయ భరద్వాజ్
        దర్శకత్వం: ఆర్ ఆర్ మదన్
        నిర్మాత :మోహన్‌బాబు
        మాటలు: డైమండ్ రత్నబాబు
        సంగీతం: యస్ యస్ థమన్
        బ్యానర్: లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్
        రిలీజ్ డేట్: ఫిబ్రవరి 9

    English summary
    Veteran actor Mohan Babu's comeback film 'Gayatri' has been creating a lot of buzz in Tollywood ever since it went on floors. First look, Trailers, Teasers goes viral in social media. Now This movie slated to release on Feb 9th. In this occassion, Telugu filmibeat brings exclusively review for ..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X