Gedela Raju Review: గేదెల రాజు కాకినాడ తాలుకా మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: రఘు కుంచె, రామచంద్రం పుణ్యమూర్తుల, వికాస్, టీనా శ్రావ్య, మౌనిక, రవి చిన్నిబిల్లి తదితరుల
దర్శకత్వం: చైతన్య మోటూరి
నిర్మాత: వాణి రవికుమార్ మోటూరి
సహ నిర్మాతలు: రవి చిన్నిబిల్లి, వీరభద్రరావు తడాల, గీతార్ధ్ కుంచె
మ్యూజిక్: రఘు కుంచె
ఎడిటర్: సుధీర్ ఎడ్ల
రిలీజ్ డేట్: 2025-04-24
కాకినాడ ప్రాంతంలో గేదెల రాజు ( రఘు కుంచె) రౌడీ షీటర్. అధికార పార్టీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించడంతో కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో గేదెల రాజు పోటీ సిద్దమవుతాడు. తన చిరకాల శత్రువు దుర్గ (శ్రీకాంత్ అయ్యంగార్) కూడా టికెట్ ఆశించి భంగపడుతాడు. ఈ క్రమంలో షాకింగ్‌గా అదే రోజు రాజు గేదెల రాజు హత్యకు గురవుతాడు. గేదెల రాజు అధికార పార్టీకి చెందిన వాడు కావడంతో ఆయన హత్యను పోలీస్ డిపార్ట్ మెంట్ సీరియస్‌గా తీసుకొంటుంది.

గేదెల రాజు హత్య వెనుక హస్తం ఎవరిది? గేదెల రాజు హత్యకు రాజకీయ కారణాలే కారణమా? గేదెల రాజును దుర్గ వర్గమే హత్య చేసిందా? విజయ్ (రామచంద్రం), సత్య(టీనా శ్రావ్య), రిచ్ (వికాస్), మీరా(మౌనిక)తో గేదెల రాజుకు ఉన్న సంబంధం ఏంటి? గేదెల రాజు మర్డర్ కేసులో పోలీసులకు ఎదురైన సమస్యలు ఏమిటి? గేదెల రాజు మర్డర్ మిస్టరీని పోలీసులు ఎలా సాల్వ్ చేశారు? గేదెల రాజు హత్య వెనుక అసలు కారణం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.
ఈ సినిమా కథ, పాయింట్ వింటే సాధారణమైన మర్డర్ మిస్టరీగానే కనిపిస్తుంది. కానీ దర్శకుడు చైతన్య మోటూరి రాసుకొన్న స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ట్విస్టులు, పాత్రల డిజైన్ వల్ల కొత్తదనం కనిపిస్తుంది. పాత్రల చుట్టూ అనుమానాలను క్రియేట్ చేయడం అతడి ప్రతిభకు అద్దం పట్టింది. ఇలాంటి మర్డర్ మిస్టరీలో ప్రేమ కథను రన్ చేయడం కొత్తగా అనిపిస్తుంది. ఆడియెన్స్‌ను కథకు కనెక్ట్ చేసి గ్రిప్పింగ్‌గా కథ చెప్పడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అనుభవం ఉన్న దర్శకుడిలా కథను డీల్ చేశాడు. సీనియర్ నటుల, నూతన నటీనటుల నుంచి పెర్ఫార్మెన్స్ రాబట్టుకొన్న తీరు బాగుంది. కాకపోతే కథపై ఇంకాస్త డిఫరెంట్‌గా ఆలోచించాల్సింది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఇంకా జొప్పించి ఉంటే..ఈ సినిమాకు మరింత ప్లస్ అయి ఉండేది.
ఫస్టాఫ్‌లో స్టోరి బేస్ చేయడానికి కాస్త సమయం ఎక్కువగానే తీసుకొన్నాడు. అయితే ఇంటర్వెల్ పాయింట్‌లో కథలోకి ఓ ట్విస్ట్ తీసుకొచ్చి సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ గ్రిప్పింగ్ సాగడంతో సెకండాఫ్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారుతుంది. మర్డర్ మిస్టరీకి పురాణాలను లింక్ చేసిన తీరు బాగుంది.
మ్యూజిక్ డైర్టెక్టర్, సింగర్‌గా పరిచయమైన రఘు కుంచె నటుడిగా మారి విలన్,క్యారెక్టర్ పాత్రలతో ఆకట్టుకొంటున్నారు. ప్రతీ సినిమాలోనూ డిఫరెంట్ రోల్స్‌ను ఎన్నుకొనే ఆయన ఈ చిత్రంలో కూడా రౌడీ షీటర్‌గా కొత్తగా ప్రయత్నించాడు. గేదెల రాజు పాత్రలోకి పరకాయం ప్రవేశం చేసి వాస్తవ జీవితంలో రౌడీని తలపించేలా నటించాడు. గోదావరి యాసతో క్రేజీగా కనిపించాడు. శివయ్యగా రవి ఆనంద్, వికాస్, రామచంద్రం, టీనా శ్రావ్య,మౌనికలు పర్వాలేదనిపించారు. తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ సినిమాకు రవి కుంచె మ్యూజిక్ అందించారు. మర్డర్ మిస్టరీ మూడ్‌ను క్రియేట్ చేసేలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. కథలో పాటలకు పెద్దగా స్కోప్ లేకమపోయినా వాటిదిని ప్లేస్ చేసిన తీరు బాగుంది. సుధీర్ ఎడ్ల ఎడిటింగ్ డిఫరెంట్‌గా ఉంది. నాన్ లీనియర్ పద్దతిలో కథను చెప్పిన విధానం బాగుంది. కాకినాడ అందాలను, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి కావాల్సిన మూడ్ తెర మీదకు తీసుకు రావడంలో సినిమాటోగ్రఫి డిపార్ట్‌మెంట్ పనితీరు బాగుంది. నిర్మాత వాణి రవికుమార్ మోటూరి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.


Click it and Unblock the Notifications