twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గీత గోవిందం మూవీ రివ్యూ

    By Rajababu
    |

    Recommended Video

    Geetha Govindam Movie Review గీత గోవిందం మూవీ రివ్యూ

    Rating:
    3.5/5
    Star Cast: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సుబ్బరాజు
    Director: పరుశురాం

    అర్జున్ రెడ్డి మూవీ సెన్సేషనల్ హిట్ తర్వాత విజయ దేవరకొండ మహానటి చిత్రంలో నటించాడు. అయితే ప్రస్తుతం అందాల భామ రష్మిక మందన్నతో జతకట్టి విజయ్ సోలోగా గీత గోవిందం చిత్రంతో ముందుకొచ్చాడు. విజయ్ దేవరకొండ‌కు ఉన్న క్రేజ్‌తో రిలీజ్‌కు ముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా వచచిన ఈ చిత్రం విజయ్ దేవరకొండకు మళ్లీ భారీ సక్సెస్‌ను అందించిందా? స్టార్‌గా మారేందుకు ఈ సినిమా ఏ విధంగా ఉపయోగపడింది. రష్మిక మందన్న అభిమానులను అలరించిందా? అనే విషయాలను తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

     గీత గోవిందం సినిమా కథ

    గీత గోవిందం సినిమా కథ

    విజయ్ గోవిందం (విజయ్ దేవరకొండ) కాలేజీలో లెక్చరర్. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన విజయ్‌కి చెల్లెలు, తండ్రి (నాగబాబు) ఉంటారు. కాబోయే భార్య తనకు తల్లిలా ఉండాలని కోరుకొంటాడు. అలాంటి లక్షణాలు ఉన్న గీత (రష్మిక మందన్న)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ప్రేమ కోసం పరితపిస్తుండగా బస్‌లో విజయ్ చేసిన ఓ పనికి అతడిపై గీతకు అసహ్యం ఏర్పడుతుంది. తనతో తప్పుడుగా ప్రవర్తించారని తన అన్నకు గీత చెబుతుంది. కానీ ఆ పని చేసింది విజయ్ అని గీత అన్నకు తెలియక చంపడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో విజయ్ చెల్లెలికి గీత అన్న( సుబ్బరాజు)కు పెళ్లి కుదురుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనలు విజయ్‌ని గీత మరింత అసహ్యించుకొనేలా చేస్తాయి. ఈ నేపథ్యంలో ఓ అనుకొని సంఘటన కారణంగా గీత, గోవిందానికి పెళ్లి కుదురుతుంది. కానీ గీతను పెళ్లి చేసుకోవడానికి విజయ్ రిజెక్ట్ చేస్తాడు.

    కథలో మలుపులు

    కథలో మలుపులు

    ప్రేమతో దగ్గర కావాల్సిన గీత, గోవిందం మధ్య విభేదాలు ఎంత వరకు వెళ్లాయి. గీతతో పెళ్లి కుదిరిన తర్వాత ఎందుకు రిజెక్ట్ చేశాడు. విజయ్ గోవిందం చెల్లెలి పెళ్లి గీత అన్నతో జరిగిందా? తన దగ్గరి బంధువు (వెన్నెల కిషోర్‌)తో గీత కుదిరిన పెళ్లి ఎంత వరకు వెళ్లింది. ఆ తర్వాత రియలైజ్ అయిన విజయ్ గోవిందం గీతను దక్కించుకోవడానికి ఏం చేశాడు? ఈ చిత్రంలోని కథకు నిత్య మీనన్, అను ఇమ్మాన్యుయేల్ పాత్రలేంటి అనే ప్రశ్నలకు సమాధానమే గీత గోవిందం సినిమా కథ.

    ఫస్టాఫ్ అనాలిసిస్

    ఫస్టాఫ్ అనాలిసిస్

    అన్నవరం సత్యనారాయణ ఆలయం వద్ద కారు పంక్చర్ కావడమనే నేపథ్యంతో నిత్య మీనన్‌ను పరిచయం చేస్తూ కథ ప్రారంభమవుతుంది. ఆ పక్కనే దీనంగా కూర్చొని ఉన్న విజయ్‌తో నిత్య మీనన్ పరిచయం జరగడం, ఆ క్రమంలో తన ప్రేమగాధను, తన సమస్యలను చెప్పుకోవడంతో గీత పాత్ర అసలు కథలోకి ప్రవేశిస్తుంది. గుడిలో గీతను చూసి ప్రేమించడం, ఒకే బస్‌లో ప్రయాణించే సమయంలో ఓ ఘటన చేసుకోవడం కథ మలుపు తిరుగుతుంది. కథలో భాగంగా గీత, గోవిందం కలిసి కొన్ని పనులు చేయాల్సి రావడంతో వారి మధ్య కథ ఆసక్తికరంగా ప్రధానంగా వినోదాత్మకంగా సాగుతుంది. అంతేకాకుండా ప్రతీ సన్నివేశానికి సన్నివేశానికి మధ్య విజయ్ అంటే గీతకు ప్రేమ పెరుగకపోవడంపోగా వారి మధ్య దూరం పెరుగడం లాంటి అంశాలతో తొలి భాగం ముగుస్తుంది.

    సెకండాఫ్ అనాలిసిస్

    సెకండాఫ్ అనాలిసిస్

    ఇక రెండో భాగంలో గీతకు జరిగిన అవమానానికి కారణమైన వ్యక్తి అంతు చూడటానికి సుబ్బరాజు ప్రయత్నించడం. గీతతో చెడుగా బిహేవ్ చేసింద తానే అని తెలిస్తే చెల్లెలి పెళ్లి ఆగిపోతుందనే అంశాలతో విజయ్ మదనపడటం లాంటి అంశాలు చాలా వినోదాత్మకంగా సాగిపోతాయి. ప్రతీ సీన్‌ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించే విధంగా ఉండటంతో ఫీల్‌గుడ్‌గా సాగిపోతుంది. ప్రీ క్లైమాక్స్‌లో గీత పెళ్లి ప్రపోజల్‌ను వ్యతిరేకించడం, క్లైమాక్స్‌లో ఆమెనే పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితులు రావడం అనే అంశాలకు చక్కటి డైలాగ్స్, ఫీల్‌గుడ్ సన్నివేశాలతో సినిమా ముగియడం జరుగుతుంది.

    పరుశురాం దర్శకత్వ ప్రతిభ

    పరుశురాం దర్శకత్వ ప్రతిభ

    అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం కోసం దర్శకుడు పరుశురాం చేసిన స్క్రిప్టు వర్క్ గీత గోవిందం సినిమాకే హైలెట్. సింపుల్ కథను కాంప్లికేట్ చేసి, అందుకు తగ్గట్టుగా సన్నివేశాలు రాసుకొని పక్కా తెరకెక్కించిన విధానాన్ని ప్రేక్షకులు అభినందించకుండా ఉండలేరు. అర్జున్ రెడ్డి తర్వాత ఓ రకమైన ఇమేజ్ ఉన్న విజయ్ దేవరకొండను గోవిందంగా మలిచిన గట్స్‌కు హ్యాట్సాఫ్. విజయ్ దేవరకొండలో నటుడిని బయటకు తీయడానికి ఆ పాత్రను సృష్టించిన విధానం సినిమాకు అదనపు ఆకర్షణ. కథలో పలు రకాల మలుపులు, చిక్కు ముడులు ఉంటాయి. అయితే ప్రేక్షకుడిని డ్రైవ్ చేస్తూ చక్కగా మలుపులను దాటిన తీరు, విప్పిన ముడులు సినిమాను మరోస్థాయికి చేర్చాయి. గీత గోవిందం సక్సెస్‌కు పరుశురాంకే మొదటి క్రెడిట్ దక్కుతుంది.

    విజయ్ దేవరకొండ యాక్టింగ్

    విజయ్ దేవరకొండ యాక్టింగ్

    పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండకు యూత్‌లో ఒకరకంగా, ఫ్యామిలీలో మరో రకంగా ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది. ఆ రెండు రకాల ఇమేజ్‌ను బ్యాలెన్స్ చేస్తూ తన అవుట్ రైట్ ఫెర్ఫార్మెన్స్‌తో అన్నివర్గాలను గోవిందంగా ఆకట్టుకొన్నాడు. ఓ ప్రేమికుడిగా, ఓ అన్నగా, తల్లి కోసం ఆవేదన చెందే కొడుకుగా రకరకాల వేరియేషన్స్‌తో అదరగొట్టాడు. ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్ సన్నివేశాల్లో విజయ్ నటన కొన్ని సందర్భాల్లో ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేస్తాయి.

    రష్మిక మందన్న గ్లామర్, ఫెర్ఫార్మెన్స్

    రష్మిక మందన్న గ్లామర్, ఫెర్ఫార్మెన్స్

    గీతగా రష్మిక మందన్న నటన ఈ చిత్రానికి మరో ఎత్తు. తొలి భాగంలో చాలా సీరియస్‌గా, పెదవిపై ఓ చిరునవ్వు కూడా కనిపించకుండా ఉండే పాత్రలో రష్మిక ఒదిగిపోయారు. కీలక సన్నివేశాల్లో భావోద్వేగంతో ఆకట్టుకొన్నారు. చాలా సీన్లలో విజయ్‌ని డామినేట్ చేయడానికి ప్రయత్నించిన తీరు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు. సెకండాఫ్‌లో గ్లామర్‌‌తో ఆకట్టుకొన్నది.

    మిగితా పాత్రల్లో

    మిగితా పాత్రల్లో

    గీతా గోవిందం చిత్రంలో గీత అన్నయ్యగా సుబ్బరాజు నటనతో ఆకట్టుకొంటాడు. సుబ్బరాజుకు కెరీర్‌లోనే ఓ మంచి పాత్ర దొరికింది. ఇక గోవిందం ఫ్రెండ్స్‌గా రాహుల్ రామకృష్ణ, అభయ్ బేతిగంటి పాత్రలు ఆద్యంతం కామెడిని పంచుతాయి. రాహుల్ రామకృష్ణ తనదైన శైలిలో ఎంటర్‌టైన్‌మెంట్‌ను పండించాడు. చివర్లో పించ్ హిట్టర్‌ మాదిరిగా బరిలోకి దూకిన వెన్నెల కిషోర్ తన మార్కు హాస్యంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. నాగబాబు, అన్నపూర్ణ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. క్లైమాక్స్‌లో వెన్నెల కిషోర్, అన్నపూర్ణ కడుపుబ్బా నవ్వించారు.

    మ్యూజిక్ రివ్యూ

    మ్యూజిక్ రివ్యూ

    గీత గోవిందం చిత్రానికి గోపి సుందర్ మ్యూజిక్ అందించారు. రిలీజ్‌కు ముందే ఇంకా ఇంకా పాట ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఈ చిత్రంలో ప్రతీ సన్నివేశానికి సన్నివేశానికి మధ్య చాలా వేరియేషన్స్ ఉంటాయి. అందుకు తగినట్టుగానే తన రీరికార్డింగ్‌తో సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాడు. మిగితా పాటలు కూడా సందర్భోచితంగా బాగున్నాయి. గీత గోవిందం సినిమా ఫీల్‌గుడ్‌గా మారడానికి మ్యూజిక్ కూడా ఓ ప్రధాన కారణం.

     సినిమాటోగ్రఫీ

    సినిమాటోగ్రఫీ

    గీత గోవిందం చిత్రానికి మణికందన్ అందించిన సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణ. విజయ్, రష్మిక దంపతులుగా కనిపించినప్పుడు మణికందన్ పెట్టిన ఫ్రేమ్స్ స్వర్గీయ బాపును గుర్తు చేశాయి. ఊరి వాతవరణానికి సంబంధించిన షాట్స్‌ను అద్భుతంగా కెమెరాలో ఒడిసిపట్టుకొన్నారు. నటీనటుల చాలా సున్నితమైన హావభావాలను చక్కగా ఒడిసిపట్టుకొన్నారు. అన్నవరం ఆలయం సమీపంలోనూ, మరికొన్ని సన్నివేశాల్లోనూ లైటింగ్ వినియోగం క్లాసీగా ఉంది.

    ఎడిటింగ్

    ఎడిటింగ్

    గీత గోవిందంలో సన్నివేశాలను కూర్చిన విధానం మర్తాండ్ వెంకటేష్ ప్రతిభకు మరోసారి అద్దం పట్టింది. సినిమాలోని సన్నివేశాలు నదీ ప్రవాహంలా సాగిపోతుంటాయి. ఎక్కడ జర్కులు గానీ, ల్యాగ్‌లు కనిపించవు. ఇక రమణ వంక ఆర్ట్ విభాగం పనితీరు కూడా బ్రహ్మండంగా ఉంది. పెళ్లీ సీన్లు, ఇంటి వాతావరణం తెర మీద అందంగా కనిపిస్తాయి.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    గీత గోవిందం చిత్రం యూత్‌కు కిక్కించే మందులాంటిదైతే, ఫ్యామిలీ ఆడియెన్స్‌‌కు పండుగ భోజనం లాంటింది. కథ, కథనాలు ఈ సినిమాకు బలంగా మారాయి. వినోదంతోపాటు, ఓ ఫీల్‌గుడ్ సినిమాను చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రేక్షకుడు వెచ్చించిన ప్రతీ పైసాకు రెండింతల వినోదం దొరుకుతుంది. అర్జున్ రెడ్డి తర్వాత అంతకంటే గొప్ప కమర్షియల్ హిట్‌ విజయ్ దేవరకొండ ఖాతాలో పడటం ఖాయం.

     ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    జీఏ2 బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పించగా, బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎన్నో హిట్ చిత్రాలను అందించిన ఈ సంస్థ పాటించే నిర్మాణ విలువల స్థాయిలోనే ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఉన్నాయి. నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక, ప్రమోషన్ వాళ్ల ప్రమాణాలేంటో చెప్పకనే చెప్పాయి. గీతా బ్యానర్‌లో గీత గోవిందం మరో సక్సెస్‌ఫుల్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

     బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్

    • విజయ్ దేవరకొండ యాక్టింగ్
    • రష్మిక మందన్న గ్లామర్, ఫెర్ఫార్మెన్స్
    • పరుశురాం టేకింగ్
    • ఎంటర్‌టైన్‌మెంట్
    • మైనస్ పాయింట్స్

      • సెకండాఫ్‌లో కొన్ని సీన్లు
      • పాటల చిత్రీకరణపై దృష్టిపెట్టకపోవడం
      •  తెర ముందు, తెర వెనుక

        తెర ముందు, తెర వెనుక

        విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సుబ్బరాజు
        దర్శకత్వం: పరుశురాం
        నిర్మాతలు: అల్లు అరవింద్, బన్నీ వాసు
        సంగీతం: గోపి సుందర్
        సినిమాటోగ్రఫి: మణికందన్
        ఎడిటింగ్: మార్తాండ్ కే వెంకటేష్
        బ్యానర్: జీఏ2
        రిలీజ్‌ డేట్: 2018-08-15

    English summary
    Geetha Govindam is a Telugu movie starring Vijay Deverakonda and Rashmika Mandanna in prominent roles. It is a romantic drama directed by Parasuram. Allu Aravind, Bunny Vasu are the producers for this movie. This movie released on August 15, 2018. In this occassion, Telugu filmibeat brings exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X