Geetha Sakshiga Review ఎమోషనల్ పాయింట్‌తో మర్డర్ మిస్టరీ.. మూవీ ఎలా ఉందంటే?

Rating: 2.5/5

నటీనటులు: ఆదర్శ్, చిత్రా శుక్లా, శ్రీకాంత్ అయ్యంగార్, భవానీ శంకర్, జయలలిత, అనితా చౌదరీ, సుదర్శన్, రాజా రవీంద్ర, ఐఏఎస్ శ్రీనివాస్ తదితరులు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఆంథోని మట్టిపల్లి
కథ, నిర్మాత: చేతన్ రాజ్
మ్యూజిక్: గోపి సుందర్
డైలాగ్స్: పుచ్చ రామకృష్ణ
సినిమాటోగ్రఫి: వెంకటహనుమ నరిశెట్టి
బ్యానర్: చేతన్ రాజ్ ఫిల్మ్స్
రిలీజ్ డేట్: 2023-03-22l

మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు అర్జున్ (ఆదర్శ్), అమూల్య (చిత్రా శుక్లా)తో ప్రేమలో ఉంటూ సరదాగా జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉమెన్స్ హాస్టల్‌లో మనీషా అనే యువతి దారుణంగా అత్యాచారానికి గురై హత్యకు గురవుతుంది. మనీషా కేసులో అర్జున్‌ను సీఐ శంకర్ (భవానీ శంకర్) అరెస్ట్ చేస్తారు. మనీషా కేసులో జీవితకాలపు కారాగార శిక్షను కోర్టు విధిస్తుంది.

మనీషా రేప్ అండ్ మర్డర్ కేసులో అసలేం జరిగింది? మనీషా కేసులో అర్జున్‌ను ఎందుకు సీఐ అరెస్ట్ చేశారు? నిజానికి మనీషా కేసుతో అర్జున్‌కు సంబంధం ఉందా? జీవితకాలపు కారాగార శిక్ష విధించిన తర్వాత మనీషా కేసును మళ్లీ ఎందుకు విచారించాల్సి వచ్చింది? అర్జున్ కోసం వాదించడానికి వచ్చిన లాయర్ ఎవరు? పేరు మోసిన లాయర్ జోసఫ్ (శ్రీకాంత్ అయ్యంగార్)‌ను ఎదిరించడానికి అర్జున్ పక్షాన నిలబడిన లాయర్ కేసు గెలిచిందా? మనీషా కేసులో అసలు దోషులు ఎవరు? అర్జున్‌ను నిందితుడా? నిరుపరాధా? అనే ప్రశ్నలకు సమాధానమే గీతసాక్షిగా సినిమా కథ.

 Geetha Sakshiga Movie Review and Rating: Murder Mystery with action and emotional content

మనీషా హత్యా సంఘటన సంచలనం రేపిన అంశంతో కథ భావోద్వేగంగా సీరియస్ నోట్‌తో మొదలవుతుంది. ఆ తర్వాత అర్జున్ అరెస్ట్ చేయడం, కోర్టులో పరిచి విచారణ చేయడం, శిక్ష విధించడం లాంటి అంశాలతో నేరుగా కథలోకి వెళ్లిన విషయంలో దర్శకుడు ఆంథోని మట్టిపల్లి తన ప్రతిభను చాటుకొన్నారు. కోర్డు డ్రామా, యాక్షన్ ఎపిసోడ్స్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో కథను బ్యాలెన్స్ చేసిన తీరు బాగుంది. అర్జున్, అమూల్య ప్రేమ కథ, రొమాంటిక్ ట్రాక్‌ను కొనసాగించడం యూత్‌ఫుల్ ఎలిమెంట్స్‌గా మారాయని చెప్పవచ్చు. ఇక సెకండాఫ్‌లో కోర్టు డ్రామా విషయంలో ఇంకా బెటర్ కంటెంట్ ప్లాన్ చేయాల్సి ఉండేదనిపిస్తుంది. ఇక మనీషా కేసు వెనుక దోషులన చివరి వరకు దాచిపెట్టడం అవసరమా అనిపిస్తుంది. మనీషా కేసును మధ్యలోనే ముందుకు తీసుకొచ్చి డ్రామా నడిపి ఉండే ఇంకా బెటర్‌గా ఉండేదనిపిస్తుంది. ఏది ఏమైనా దర్శకుడు అంథోని టేకింగ్, పాత్రలను బ్లెండ్ చేసిన విధానం బాగుంది.

నటీనటుల విషయానికి వస్తే. అర్జున్‌గా ఆదర్శ్ తన అనుభవానికి మించిన పాత్రను భుజాన వేసుకోవడమే కాకుండా సినిమా భారాన్ని పూర్తిగా తనపై వేసుకొని ముందుకు తీసుకొన్న విధానం బాగుంది. నటనపరంగా కాకుండా సినిమాను అర్జున్ పాత్రతో ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ చూపించిన కాన్ఫిడెన్స్ బాగుంది. సిక్స్ ప్యాక్, మంచి బాడీతో జైలులో యాక్షన్ సీన్స్ ఇరుగదీశాడు. తన వల్ల ఫ్యామిలీ అనేక కష్టాల్లో పడిన సందర్భంలో ఆదర్శ్ చూపించిన ఎమోషన్స్ బాగున్నాయి. నటన, పెర్ఫార్మెన్స్ పరంగా ఇంకా మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తుంది.

చిత్ర శుక్లా చాలా సినిమాల్లో మంచి పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. లాయర్ పాత్రలో చిత్ర శుక్లా ఆకట్టుకొనే ప్రదర్శన చేసింది. లవర్‌గా, లాయర్‌గా రెండు విభిన్నమైన పాత్రల్లో మెప్పించింది. ఇక సీఐగా భవానీ శంకర్, సీనియర్ లాయర్‌గా శ్రీకాంత్ అయ్యంగార్, మంత్రిగా శివాజీ రాజా, కీలక పాత్రలో కనిపించిన శ్రీనివాసరావు ఐఏఎస్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

గీతాసాక్షిగా సినిమాకు అత్యంత బలం సాంకేతిక వర్గాల కూర్పు. గోపి సుందర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. వెంకట హనుమ నరిశెట్టి సినిమాటోగ్రపి బాగుంది. యాక్షన్ సీన్లను అద్బుతంగా తెరకెక్కించారు. కిషోర్ మద్దాలి ఎడిటింగ్ బాగుంది. కానీ సెకండాఫ్‌లో కొంత నిడివి తగ్గించి ఉంటే బాగుండేదనిపిస్తుంది. యశ్వంత్, అనీష్ కొరియోగ్రఫి బాగుంది.

గీతాసాక్షిగా చిత్రం మర్డర్ మిస్టరీగా సాగే ఎమోషనల్ కోర్టు డ్రామా. పాలిటిక్స్, పోలీసుల అక్రమాలు వల్ల సామాన్య యువకుడి జీవితం ఎలాంటి కుదుపులకు గురవుతుందోననే మంచి పాయింట్‌తో రూపొందింది. నటీనటుల ఫెర్పార్మెన్స్, సాంకేతిక నిపుణుల పనితనం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. స్క్రిప్టు పరంగా లోపాలు ఉన్నప్పటికీ.. కొత్త హీరో, కొత్త దర్శకుడు తమను తాను నిరూపించుకొనే ప్రయత్నంలో చేసిన చిత్రం కాబట్టి.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది. కథ, కథనాలపై మరింత దృష్టిపెట్టి ఉంటే మంచి థ్రిల్లర్‌గా అయి ఉండేదనిపిస్తుంది. క్రైమ్, కోర్టు డ్రామాలను ఇష్టపడే వారికి గీతాసాక్షిగా నచ్చుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే.. చిన్న సినిమా మంచి అనుభూతిని కలిగిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X