Geethanjali Malli Vachindi movie Review: కామెడీ బలంగా.. అదే మైనస్.. గీతాంజలి మళ్లీ వచ్చింది రివ్యూ

Rating: 2.25/5

నటీనటులు: అంజలి, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవిశంకర్, రాహుల్ మాధవ్ తదితరులు
కథ: కోన వెంకట్
స్క్రీన్ ప్లే: కోన వెంకట్, భాను భోగవరపు
సాహిత్యం: భాను భోగవరపు, నందు సవారిగాన
దర్శకుడు: శివ తుర్లపాటి
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
కెమెరా: సుజాత సిద్ధార్థ
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
కళ: నార్ని శ్రీనివాస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నాగు వై
పబ్లిసిటీ డిజైనర్: అనిల్ భాను
రిలీజ్ డేట్: 2024-04-11

వైజాగ్‌లో ఫాస్ట్ ఫుడ్ స్టాల్ నడుపుకొనే అయాన్ (సత్య)కు సినిమా హీరో కావాలనే కోరికతో ఉంటాడు. ఫ్లాప్ సినిమా తీసిన తన స్నేహితులు శ్రీను, ఆరుద్ర, ఆత్రేయ తన అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని చీట్ చేస్తూ డబ్బులు లాగేస్తుంటారని అయాన్‌ అర్ధమవుతుంది. అయితే చివరకు అయాన్‌ను హీరోగా పెట్టి సినిమా తీసేందుకు డైరెక్టర్ శ్రీను బృందం రెడీ అవుతుంది. ఊటీలో పురాతన భవనంలో షూటింగ్ మొదలు పెడుతారు. ఊటీలో కాఫీ షాప్ నడిపే అంజలి (అంజలి)ని హీరోయిన్‌గా పెట్టుకొంటారు. కానీ ఆ పాడుబడ్డ భవంతిలో మరణించిన శాస్త్రి కుటుంబం ఆత్మల రూపంలో తిరుగుతుంటాయి.

Geethanjali Malli Vachindi movie Review in telugu  Satya comedy hillarious   Anjali unimpressive Show

అయాన్ హీరోగా మొదలైన సినిమా షూటింగ్ ఎలా సాగింది. షూటింగులో ఆత్మలు ఎలాంటి పాత్రలు పోషించాయి. నిర్మాత విష్ణు (రాహుల్ మాధవ్)కు అంజలికి సంబంధం ఏమిటి? తన తండ్రి రమేష్ (రావు రమేష్) మరణానికి విష్ణు ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడు? అంజలి హీరోయిన్‌గా రాణించిందా? సత్య హీరోగా తన కలను నెరవేర్చుకొన్నాడా? శాస్త్రి కుటుంబం ఆత్మలు కథలో ఎలాంటి ఎమోషన్స్ పడించాయి? డైరెక్టర్ శ్రీనివాస్ సినిమాను పూర్తి చేశాడా? గీతాంజలి మళ్లీ రావడానికి కారణం ఏమిటి? కథలో బొమ్మ చేసిన మ్యాజిక్ ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా కథ.

సాఫ్ట్‌వేర్ కంపెనీలో అమ్మాయిపై లైంగిక వేధింపు సీన్‌తో కొత్తగా ఏదో కథ చెప్పబోతున్నామనే ఫీలింగ్‌ను టీమ్ క్రియేట్ చేసింది. కానీ ఎమోషనల్ సీన్లకు పెద్దగా స్కోప్ ఇవ్వకుండా పూర్తిగా వినోదాన్ని మాత్రమే నమ్ముకొన్నారనే విషయం సినిమా ఆరంభంలోనే అర్ధమవుతుంది. ఆ క్రమంలో ప్రేక్షకుడిని ట్యూన్ చేసే ప్రయత్నం కొంత మేరకు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. మెదడుకు మేత పెట్టాల్సిన అవసరం లేని కథ, కథనాలతో జబర్దస్త్ కామెడీని దట్టంగా దట్టించారు. ఓ ఫీల్ గుడ్ ఎమోషన్స్‌తో ఇంటర్వెల్ సీన్ వేసి.. ఫస్టాఫ్ ముగించాడు,

Geethanjali Malli Vachindi movie Review in telugu  Satya comedy hillarious   Anjali unimpressive Show

సెకండాఫ్‌లో పూర్తిగా కామెడీకి పెద్ద పీట వేశారనే చెప్పాలి. మెథడ్ యాక్టింగ్ కాన్సెప్ట్‌తో కథను నడిపించిన విధానం బాగుంది. సినిమా ద్వితీయార్తంలో కొన్ని చోట్ల కామెడీ సన్నివేశాలు చక్కగా వర్కవుట్ అయ్యాయి. అయితే గీతాంజలి లాంటి సినిమాకు ఉండాల్సిన ఎమోషనల్ క్లైమాక్స్ లేకపోవడం మైనస్‌గా చెప్పుకోవచ్చు.

ఇక ఈ చిత్రంలో సత్య మరోసారి తన ఫెర్ఫార్మెన్స్‌తో మ్యాజిక్ చేశారనే చెప్పాలి. ఈ సినిమా భారాన్ని, శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, సత్యం రాజేష్ సపోర్టుతో సత్య తన భుజాలపై మోశాడని చెప్పవచ్చు. అంజలి క్యారెక్టర్ బలంగా లేకపోవడం, ఆకట్టుకోనే విధంగా లేకపోవడంతో పెద్దగా తన ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ లేకపోయిందనిపిస్తుంది. డైలాగ్ కింగ్ రవిశంకర్ లాంటి యాక్టర్‌కు డైలాగ్స్ లేకుండా ఎక్స్‌ప్రెషన్స్‌తో మెప్పించిన తీరు బాగుంది. సినిమాటోగ్రాఫర్ కిల్లర్ నానిగా సునీల్, అతిథి పాత్రలో ఆలీ తమ వంతు కామెడీని పండించారు.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే... నార్ని శ్రీనివాస్ ఆర్ట్ వర్క్ సినిమా మూడ్‌ను బాగా క్రియేట్ చేసింది. సుజాత సిద్దార్థ సినిమాటోగ్రఫి, ప్రవీణ్ లక్కరాజు బ్యాక్ గ్రౌండ్ స్కోరు బాగుంది. పాటలు ఈ సినిమాకు మైనస్. బలమైన పాయింట్ లేకపోయినా కామెడీ పెద్ద పీట వేస్తూ సినిమాను శివ తుర్లపాటి నడించిన తీరు ఫర్వాలేదనిపిస్తుంది. సిట్యుయేషనల్ కామెడీ వర్కవుట్ చేసిన తీరు సినిమాకు ప్లస్ అవుతుంది. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ సీన్లను పరుగులు పెట్టించింది.

కోన తరహా కామెడీ డైలాగ్స్ అక్కడక్కడ బ్రహ్మండంగా పేలాయి. సెకండాఫ్‌లో ఎక్కడా ఎమోషన్స్ లేకపోవడంతో రొటీన్, రెగ్యులర్ కామెడీ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. గ్రాఫిక్ వర్క్ కారణంగా సినిమా ఫీల్ బాగుంది. కోన వెంకట్, ఎంవీవీ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

Geethanjali Malli Vachindi movie Review in telugu  Satya comedy hillarious   Anjali unimpressive Show

గీతాంజలి మూవీ విషయానికి వస్తే ఆ సినిమాకు ఎమోషనల్ అంశాలు సక్సెస్ కారణమయ్యాయి.దాంతో కామెడీ కూడా బ్రహ్మండంగా ఉండటం ఈ సినిమా హిట్‌గా మార్చింది. అయితే అలాంటి ఫార్ములాకు దూరంగా గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా ఉంది. కామెడీ ఉంది కానీ.. ఎమోషనల్ కంటెంట్ మిస్ అయింది. దాంతో ఆడియెన్స్‌ బయటకు వచ్చేటప్పుడు అతడిని వెంటాడే విషయాలు తక్కువ. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు నచ్చే అంశాలు భారీగానే ఉన్నాయి.బీ,సీ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విషయంపైనే సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. మల్టీప్లెక్స్ ఆడియెన్స్ ఆదరణ ఈ సినిమాకు బోనస్‌గా మారుతుంది. రానున్న రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు ప్రభావితం చేస్తుందో వేచి చూడాల్సిందే

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X