twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Gehraiyaan movie review దీపిక పదుకోన్ హాట్ షో.. గెహ్రాయియాన్ మూవీ ఎలా ఉందంటే?

    |

    Rating: 2.75/5

    నటీనటులు: దీపిక పదుకోన్, అనన్య పాండే, సిద్దార్థ్ చతుర్వేది, ధైర్య కర్వా, నసీరుద్దీన్ షా, రజత్ కపూర్ తదితరులు
    కథ, దర్శకత్వం: షకున్ బాత్రా
    నిర్మాతలు: హీరో యష్ జోహర్, కరణ్ జోమర్, అపూర్వ మెహతా, షకున్ బాత్రా
    సినిమాటోగ్రఫి: కౌశల్ షా
    ఎడిటింగ్: నితేష్ భాటియా
    మ్యూజిక్: కబీర్ కథాపలియా, సవేరా మెహతా
    బ్యానర్స్: ధర్మ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్, జౌస్కా ఫిల్మ్స్
    ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
    ఓటీటీ రిలీజ్ డేట్: 2022-02-11

     గెహ్రాయియాన్ కథంటే?

    గెహ్రాయియాన్ కథంటే?

    యోగా టీచర్‌గా పనిచేసే అలిషా (దీపిక పదుకోన్) తన ప్రియుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి కరణ్ (ధైరా కర్వా)తో ఆరేళ్లుగా సహజీవనం చేస్తుంటుంది. వారి మధ్య తరచూ అభిప్రాయబేధాలు తలెత్తుతుంటాయి. ప్రియుడితో లైఫ్ అసంతృప్తితో కొనసాగుతున్న సమయంలో తన కజిన్ తియా (అనన్య పాండే) కాబోయే భర్త జైన్ (సిద్దాంత్ చతుర్వేది)ని కలుసుకొంటారు. అయితే తొలి కలయికలోని అలీషా, జైన్ లిద్దరు పరస్పరం ఆకర్షితులవుతారు. భర్తపై అసంతృప్తికి లోనైన అలీషా.. జైన్‌కు చేరువైపోతుంది. అలీషా జైన్ ఇద్దరూ తమ భాగస్వాములకు తెలియకుండా రొమాంటిక్ లైఫ్‌ను లీడ్ చేస్తుంటారు.

    గెహ్రాయియాన్‌లో ట్విస్టులు

    గెహ్రాయియాన్‌లో ట్విస్టులు

    అయితే అలీషా, జైన్ మధ్య రొమాంటిక్ లైఫ్‌ ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది? చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన కారణంగా తండ్రి (నసీరుద్దీన్ షా)పై అలీషా ఎందుకు ద్వేషం పెంచుకోవాల్సి వచ్చింది. చివరికి తండ్రిపై ద్వేషాన్ని ఎలాంటి పరిస్థితుల్లో తగ్గించుకొన్నది. కజిన్ కాబోయే భర్తతో అలీషా పెట్టుకొన్న అక్రమ బంధానికి తుది ఫలితం ఏమిటి? అక్రమ బంధాన్ని కొనసాగించిన అలీషా చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకొన్నది? అనే ప్రశ్నలకు సమాధానమే గ్రెహ్రాయియాన్ సినిమా కథ.

    సినిమా ఎలా ఉందంటే?

    సినిమా ఎలా ఉందంటే?

    గెహ్రాయియాన్ సినిమా ఫస్టాఫ్ విషయానికి వస్తే.. అలీషా, జైన్ అక్రమ సంబంధం, డేటింగ్ లైఫ్‌కే దర్శకుడు శకున్ బాత్రా ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ రొమాంటిక్ సీన్ల మధ్య చిన్నతనంలో తన తల్లికి జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకొని మానసికంగా కుమిలిపోయే సన్నివేశాలు కథను కాస్త భారంగా మారుస్తాయి. ఇక సెకండాఫ్‌లో తండ్రిని తాను తప్పుగా అర్దం చేసుకొన్నానని రియలైజ్ కావడం అలీషా పాత్రను మరింత ఎమోషనల్‌గా మార్చింది. ఇక క్లైమాక్స్‌లో జైన్, అలీషా మధ్య చిన్న ట్విస్టు అప్పటి వరకు సాదాసీదా సాగుతుందనుకొనే కథ మరో లెవెల్‌కు వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది.

    దీపిక పదుకోన్ పచ్చిగా.. బోల్డ్‌గా

    దీపిక పదుకోన్ పచ్చిగా.. బోల్డ్‌గా

    దీపిక పదుకోన్ రకరకాల వేరియేషన్స్ ఉన్న అలీషా పాత్రలో ఒదిగిపోయింది. సహజీవనం చేసే యువతిగా, అకారణంగా తండ్రిపై ద్వేషం పెంచుకొన్న కూతురిగా, సొంత కజిన్ కాబోయే భర్త ఆకర్షణకు గురైన మహిళగా విభిన్నమైన పాత్రను పోషించింది. ఇక జైన్‌తో రొమాంటిక్‌, బెడ్ రూమ్ సీన్లలో హద్దు దాటి నటించిందేమిటి అనే అనుమానం కలుగుతుంది. ఒక స్టార్ హీరోయిన్ స్టేటస్ ఉన్న దీపిక.. సిద్దాంత్ చతుర్వేది లాంటి కుర్ర హీరోతో చేసిన సీన్లు షాకింగ్ ఉంటాయి. ముఖ్యంగా ఓ సీన్‌లో బ్రా, అండర్‌వేర్‌పై లైంగిక కార్యకలాపాలు చేసే సీన్ జీర్ణించుకోవడం కష్టమే అనిపిస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే. ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ కార్డ్ వరకు దీపిక భావోద్వేగమైన నటన అందర్నీ ఆకట్టుకొంటుంది. గెహ్రాయియాన్ చిత్రాన్ని దీపిక కేవలం తన భుజాలపై మోసిందని చెప్పవచ్చు.

     అనన్య పాండే.. ఇతర నటీనటులు గురించి

    అనన్య పాండే.. ఇతర నటీనటులు గురించి

    మిగితా నటీనటులు విషయానికి వస్తే.. సిద్దాంత్ చతుర్వేది జైన్ పాత్రలో ఒదిగిపోయాడు. కాబోయే భార్యను మోసం చేయడమే కాకుండా.. రియల్ ఎస్టేట్‌ వ్యాపారం విషయంలో అలీషాకు అన్యాయం చేసి ఎలాంటి మూల్యాన్ని చెల్లించుకొనే పాత్రలో సిద్దాంత్ ఫెర్ఫార్మెన్స్ బాగుంది. అనన్య పాండే ఈ సినిమాకు గ్లామర్ పరంగా స్పెషల్ ఎట్రాక్షన్ అయింది. కానీ నటనపరంగా పెద్దగా స్కోప్ లేని పాత్రలో నటించింది. నసీరుద్దీన్ షా తన పాత్ర పరిధి మేరకు ఒకే అనిపించాడు.

     సాంకేతిక నిపుణుల పనితీరు..

    సాంకేతిక నిపుణుల పనితీరు..

    గెహ్రాయియాన్ సినిమాకు కౌశల్ షా అందించిన సినిమాటోగ్రఫి ప్రత్యేక ఆకర్షణ. ముఖ్యంగా సముద్రంలో బోట్‌లో రొమాంటిక్ సీన్లను చక్కగా చిత్రీకరించాడు. దీపిక పదుకోన్, అనన్య పాండే అందాల ఆరబోతను కెమెరాలో బంధించిన తీరు మరింత గ్లామరస్‌గా మారింది. కబీర్ కథాపలియా, సవేరా మెహతా మ్యూజిక్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్లను మరింతగా ఎమోషనల్‌గా మార్చాయి. ఎడిటింగ్ విభాగం పనితీరు చాలా బాగుంది.

    కరణ్ జోహర్ ప్రొడక్షన్ వ్యాల్యూస్

    కరణ్ జోహర్ ప్రొడక్షన్ వ్యాల్యూస్


    గెహ్రాయియాన్ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్, జౌస్కా ఫిల్మ్స్ బ్యానర్లపై ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహర్ నిర్మించారు. యూత్‌ను టార్గెట్ చేసుకొని రూపొందించిన సినిమాలో నటీనటుల ఎంపిక పాజిటివ్ అంశంగా మారింది. కరణ్ జోహర్ తన స్థాయికి తగినట్టుగా నిర్మాణ విలువలను పాటించాడని చెప్పవచ్చు.

    Recommended Video

    83 Movie Promotions : Ranveer Singh Fun With Kapil Dev And Nagarjuna | Filmibeat Telugu
     ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    అడల్ట్ రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషనల్‌ అంశాలతో రూపొందిన చిత్రం గెహ్రాయియాన్. దీపిక పదుకోన్ గ్లామర్, బోల్డ్ రోల్, ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు హైలెట్. అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ కలిసి చూడటానికి సాధ్యపడని చిత్రం. కాబట్టి పిల్లల్ని దూరంగా పెట్టి.. జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. అడల్డ్, యూత్ కంటెంట్‌ను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది కాబట్టి.. తీరిక సమయంలో ఎలాంటి అంచనాల లేకుండా చూస్తే.. ఓ అనుభూతికి గురికావడం గ్యారెంటీ.

    English summary
    Deepika Padukone, Ananya Panday's Gehraiyaan movie hits Amazon prime video OTT on February 11th. Here is the Telugu filmibeat review and rating:
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X