twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జార్జ్‌రెడ్డి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Recommended Video

    George Reddy Movie Review And Rating

    Rating:
    3.0/5

    భావజాలం, సిద్ధాంతపరమైన అంశాలను పక్కన పెడితే.. కొన్ని తరాలకు ఉద్యమస్ఫూర్తిగా నిలిచిన విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీలో చోటుచేసుకొన్న కుల, పెట్టుబడిదారీ, రౌడీ మూకలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ 45 ఏళ్ల కిందట అమరుడయ్యాడు. 60, 70 దశకాల్లో యూనివర్సిటీలో చోటుచేసుకొన్న అంశాలను ఎదురించిన తీరు.. ఇప్పటికీ సమకాలీన ఉద్యమాలకు, ఉద్యమ నాయకులకు ఆయన పోరాటం, జీవితం స్ఫూర్తిదాయకంగా చెప్పుకొంటారు. అలాంటి వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిన చిత్రం జార్జిరెడ్డి. నవంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం జార్జిరెడ్డి స్ఫూర్తిని తెరమీద చాటిందా? ఇప్పటికీ సమాజంలో ఆయనకున్న క్రేజ్‌ ప్రేక్షకులను ఆకట్టుకొన్నదా అనే విషయాలను తెలుసుకోవాలంటే జార్జిరెడ్డి సినిమా గురించి తెలుసుకోవాల్సిందే.

    జార్జ్‌రెడ్డి కథ

    జార్జ్‌రెడ్డి కథ

    కేరళలో పుట్టి పెరిగిన జార్జ్‌రెడ్డి బాల్యం నుంచే అవేశంతో సమస్యలపై స్పందిస్తుంటాడు. ఉన్నత విద్య కోసం ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన అతడికి కొన్ని పరిస్థితులు సామాజిక కోణంలో ఆలోచించేలా చేస్తాయి. యూనివర్సిటీలో అమ్మాయిలపై అఘాయిత్యాలతో ప్రారంభమైన పోరాటం, విద్యార్థుల భోజన వసతులు, కులం వివక్ష వరకు సాగి.. ఆపై విద్యార్థి రాజకీయాల వైపు నడిచేలా చేస్తాయి. అంతేకాకుండా రైతుల ఆత్మహత్యలను ఆపేందుకు జార్జిరెడ్డి దేశవ్యాప్తంగా విద్యార్థులను, ప్రజలను చైతన్య పరిచేందుకు కంకణం కట్టుకొంటాడు.

    జార్జ్‌రెడ్డి ట్విస్టులు

    జార్జ్‌రెడ్డి ట్విస్టులు

    రైతుల ఆత్మహత్యల ఆపే క్రమంలో జార్జిరెడ్డికి ఎదురైన సమస్యలేంటి? విద్యార్థి రాజకీయాల్లో జార్జిరెడ్డి తన పాత్రను ఎలా పోషించారు? ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొన్న దుష్టశక్తులను ఏరిపారేసే క్రమంలో ప్రత్యర్థుల మానసిక, శారీరక దాడులను ఎలా ఎదుర్కొన్నాడు? బొంబాయి యూనివర్సిటీలో వచ్చిన ఉన్నత ఉద్యోగాన్ని ఎందుకు వదులుకొన్నాడు? ఉస్మానియాలో పాతబస్తీ మాఫియాను ఎదురించే క్రమంలో ఎలాంటి ధైరసాహసాలను చూపాడు? ఎలాంటి మోసానికి గురై జార్జిరెడ్డి తన ప్రాణాలను వదులుకోవడానికి తెగించాడు? అనే ప్రశ్నలకు సమాధానమే జార్జిరెడ్డి సినిమా కథ.

    ఫస్టాఫ్ అనాలిసిస్

    ఫస్టాఫ్ అనాలిసిస్

    జార్జిరెడ్డి జీవితంపై డాక్యుమెంటరీ రూపొందించాలని అమెరికాలో ఓ యువతి చేసే ప్రయత్నంతో కథ కేరళలో మొదలవుతుంది. ఆ యువతి సేకరించే విషయాలను, ఆమెకు ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానంగా కథ సాగుతుంటుంది. బాల్యంలోని కొన్ని సంఘటనలతో జార్జిరెడ్డి వ్యక్తిత్వం ఏమిటో ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇక ఉస్మానియా యూనివర్సిటీలోకి వచ్చిన తర్వాతే అసలు కథ వేగం పుంజుకొంటుంది. ఉస్మానియాలోని కుల వివక్ష, విద్యార్థినుల వేధింపులు, స్టూడెంట్ పాలిటిక్స్‌ లాంటి అంశాలతో కథ మరోమెట్టు ఎక్కినట్టు కనిపిస్తుంది. ఈ క్రమంలో జార్జిరెడ్డిపై తోటి విద్యార్థిని ప్రేమ పెంచుకోవడం లాంటి అంశాలు సినిమాటిక్‌గా అనిపిస్తాయి. కమర్షియల్ అంశాల కోసం ఈ ట్రాక్ నడిపించారనేది స్పష్టంగా కనిపిస్తుంది.

    సెకండాఫ్ అనాలిసిస్

    సెకండాఫ్ అనాలిసిస్

    జార్జిరెడ్డి సినిమాకు ప్రాణం రెండో భాగమే. సెకండాఫ్‌లో జార్జిరెడ్డి ఆలోచనా దృక్ఫథం సమాజం వైపు మారడం స్పష్టం కావడం, ప్రత్యర్థులు దాడులు కూడా పెరగడం సినిమా నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లడమే కాకుండా ఎమోషనల్‌గా మారుతుంది. 45 ఏళ్ల తర్వాత ప్రజలు, వామపక్ష ఉద్యమాల్లో జార్జిరెడ్డి ఇంకా బతికి ఉన్నాడని చెప్పడానికి ఆయన అనుసరించిన మార్గం, సిద్ధాంతాలు సినిమాకు బలంగా మారాయని చెప్పవచ్చు. కేవలం విద్యార్థి నాయకుడే కాకుండా చదువులపట్ల ఆసక్తి, ఆయన మేథోశక్తి ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తాయి. వామపక్షేతర విద్యార్థి సంఘాలను ఎదురించడం, పాతబస్తి మాఫియాతో పోరాటం చేయడం లాంటి అంశాలు తెర మీద సజీవంగా కనిపిస్తాయి. ఇక చివరి 20 నిమిషాలు సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లడమేకాకుండా ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేస్తుంది.

     డైరెక్టర్ జీవన్ రెడ్డి గురించి

    డైరెక్టర్ జీవన్ రెడ్డి గురించి

    జార్జ్‌రెడ్డి జీవితాన్ని సినిమాగా మలచాలని తీసుకొన్న నిర్ణయంతోనే దర్శకుడు జీవన్ రెడ్డి కొంత సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. ఎందుకంటే జార్జిరెడ్డి జీవితంలో ఎన్నో కోణాలు సామాన్య ప్రజలనే కాకుండా సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకొనేలా ఉండటమే. అయితే కథ, కథనాలును రూపొందించుకోవడంలో దర్శకుడు తడబాటుకు లోనైనట్టు అనిపిస్తుంది. బొంబాయి వెళ్లకుండా ఉండటం లాంటి అంశాలపై జార్జిరెడ్డి తీసుకొన్న కొన్ని నిర్ణయాల వెనుక కారణాలు తెర మీద చూపించకపోవడం అసంపూర్ణంగా కనిపిస్తాయి. సామాన్య ప్రేక్షకుడిని మెప్పించే క్రమంలో.. సిద్ధాంతపరంగా జార్జిరెడ్డి అనుసరించిన విధానాల విషయంలో ఆయన గురించి తెలిసిన వారికి తెరమీద క్లారిటీ ఇవ్వడంలో విఫలమయ్యాడనే విమర్శ వినిపిస్తున్నది. అయితే ఓవరాల్‌గా జార్జిరెడ్డిని సినిమాగా చూస్తే తన ప్రయత్నంలో నూటికి నూరుశాతం సఫలమయ్యాడనే చెప్పవచ్చు.

    జార్జ్‌రెడ్డిగా సందీప్ మాధవ్

    జార్జ్‌రెడ్డిగా సందీప్ మాధవ్

    ఇక జార్జిరెడ్డిగా సంందీప్ మాధవ్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడా అని కొన్ని సీన్లలో అనిపిస్తుంది. అయితే బాడీ లాంగ్వేజ్ విషయంలో మరికొంత దృష్టిపెడితే బాగుండేదేమో అనిపిస్తుంది. భావోద్వేగమైన డైలాగ్స్ పలికిన తీరు, ఎమోషనల్ సీన్లలో నటించిన తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటుంది. జార్జిరెడ్డి పాత్రకు న్యాయం చేశాడనే చెప్పవచ్చు. చివరి 20 నిమిషాల్లో సందీప్ నటన మరోస్థాయిలో ఉందనిపిస్తుంది.

    ఇతర నటీనటుల గురించి

    ఇతర నటీనటుల గురించి


    జార్జిరెడ్డిని ప్రేమించిన యువతి మాయగా ముస్కాన్ ఆకట్టుకొన్నది. గ్లామర్‌పరంగా కూడా మెప్పించింది. సత్యగా సత్యదేవ్, అర్జున్‌గా మనోజ్ నందన్, లలన్ సింగ్‌గా తిరువీర్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. లక్ష్మణ్ పాత్రలో లక్ష్మణ్ మీసాల తన అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాలను లక్ష్మణ్ తన నటనతో హైలెట్ చేశాడని చెప్పవచ్చు. జార్జిరెడ్డి తల్లిగా దేవిక దఫ్తర్దార్ తన ఎమోషనల్ పాత్రతో ఆకట్టుకొన్నారు. రాజన్నగా అభయ్ నటన సినిమాకు హైలెట్‌గా నిలిచిందని చెప్పవచ్చు. యాదమ్మరాజు కామెడీ అందర్నీ ఆలరిస్తుంది.

    సురేష్ బొబ్బిలి మ్యూజిక్

    సురేష్ బొబ్బిలి మ్యూజిక్

    సాంకేతిక అంశాలలో జార్జిరెడ్డి వెన్నెముకగా నిలిచింది మ్యూజిక్. ఇటీవల కాలంలో బ్రహ్మండంగా రాణిస్తున్న సురేష్ బొబ్బిలి తన రిరీకార్డింగ్‌తో కొన్ని పేలవమైన సన్నివేశాలకు కూడా ప్రాణం పోశాడని చెప్పవచ్చు. బలహీనమైన సన్నివేశాలను కూడా తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మరో లెవెల్‌కు తీసుకెళ్లాడని చెప్పవచ్చు. ప్రతాప్ కుమార్ అందించిన ఎడిటింగ్ బాగుంది. తొలి భాగంలో కొన్ని సీన్లపై కత్తెర వేయడానికి అవకాశం ఉంది.

    సినిమాటోగ్రఫి గురించి

    సినిమాటోగ్రఫి గురించి

    ఇక టెక్నికల్ అంశాల్లో విశేషంగా ఆకట్టుకొన్న సినిమాటోగ్రఫి. సుధాకర్ రెడ్డి యక్కంటి అందించిన సినిమాటోగ్రఫి టెక్నికల్‌గా బలంగా కనిపించింది. ముఖ్యంగా యాక్షన్ సీన్లను అద్భుతంగా చిత్రీకరించారు. ఫుట్‌బాల్ గేమ్ గానీ.. ఫైట్‌‌ను తెర మీద ఆవిష్కరించిన తీరు విపరీతంగా నచ్చుతుంది.

    ప్రొడక్షన్ వాల్యూస్

    ప్రొడక్షన్ వాల్యూస్


    జార్జిరెడ్డి చిత్రాన్ని మిక్ మూవీస్, త్రీ లైన్ సినిమాస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ రూపొందించింది. బయోపిక్‌కు కావాల్సిన పిరియాడిక్ బ్యాక్‌గ్రౌండ్‌ వాతావరణాన్ని అందించిన తీరు చూస్తే నిర్మాణంపై వారికి ఉన్న అభిరుచి తెలుస్తుంది. కథ, కథనాల విషయంలో రాజీ పడకుండా ఉంటే ఖచ్చితంగా జార్జిరెడ్డి టాలీవుడ్‌లో అణిముత్యంగా నిలిచేది. అయినా సినిమా నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    జాతీయ స్థాయి ఐకాన్‌గా నిలిచిన జార్జిరెడ్డి జీవితం ఆధారంగా వచ్చిన ఈ చిత్రంలో అన్ని రకాలు అంశాలు మెప్పించే విధంగా ఉన్నాయి. కథ, కథనాల్లో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ.. సాంకేతిక అంశాలు సినిమాను పూర్తిగా నిలబెట్టాయని చెప్పవచ్చు. స్ఫూర్తిని రగిలించే సినిమాలను ఇష్టపడే వారికి జార్జిరెడ్డి తప్పక నచ్చుతుంది. ఇటీవల వచ్చిన తెలుగు బయోపిక్స్‌లో ఉత్తమంగా నిలిచిన వాటిలో ఒకటని అని చెప్పవచ్చు. యూత్‌నే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు చేరువైతే కమర్షియల్‌గా మెరుగైన ఫలితాలను అందుకొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

    ప్లస్ పాయింట్స్

    ప్లస్ పాయింట్స్

    జార్జిరెడ్డి జీవితం
    సినిమాటోగ్రఫి
    మ్యూజిక్
    డైరెక్షన్

    మైనస్ పాయింట్స్
    కథనం
    ఫస్టాఫ్‌లో కొంత భాగం
    కొన్ని అంశాలపై క్లారిటీ లేకపోవడం

    తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    సందీప్ మాధవ్, సత్యదేవ్, మనోజ్ నందన్, అభయ్ బేతిగంటి, ముస్కాన్, లక్ష్మణ్ మీసాల, యాదమ్మరాజు తదితరులు
    కథ, దర్శకత్వం: బీ జీవన్ రెడ్డి
    నిర్మాతలు: అప్పిరెడ్డి, సంజయ్ రెడ్డి, దామురెడ్డి, సుధాకర్ రెడ్డి యక్కంటి
    మ్యూజిక్: సురేష్ బొబ్బిలి
    సినిమాటోగ్రఫి: సుధాకర్ రెడ్డి యక్కంటి
    ఎడిటింగ్: జే ప్రతాప్ కుమార్
    బ్యానర్: మిక్ మూవీస్, థ్రి లైన్ సినిమాస్, సిల్లీమాంక్స్ స్టూడియోస్
    రిలీజ్ డేట్: 2019-11-22

    English summary
    George Reddy is a biopic based on the life of a student leader George Reddy boxer and Gold medalist. He influenced the politics of Telangana region in Osmania University between 1967 and 1972. This movie hits the screen on November 22nd.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X