Ghaati Movie Review: ఘాటీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating: 2.75/5

నటీనటులు: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు, చైతన్య రావు, రవింద్ర విజయ్, జగపతి బాబు, జాన్ విజయ్, రాజు సుందరం తదితరులు
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి
సమర్పణ: యూవీ క్రియేషన్స్
బ్యానర్: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్
సినిమాటోగ్రఫి: మనోజ్ రెడ్డి కాటసాని
ఆర్ట్: తోట తరణి
మ్యూజిక్: విద్యాసాగర్ నాగవెల్లి
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
కథ: చింతకింది శ్రీనివాస రావు
ఎడిటర్: చాణక్యరెడ్డి, వెంకట్ ఎన్ స్వామి
రిలీజ్ డేట్: 225-09-05

ఓడిశా, ఆంధ్రా సరిహద్దు ప్రాంతంలోని తూర్పు కనుమల్లో గంజాయి మాఫియా సామ్రాజ్యాన్ని కుందల నాయుడు (చైతన్య రావు), కాష్టాల నాయుడు (రవీంద్ర విజయ్) తమ కనుసైగల్లో శాసిస్తు ఉంటారు.ఆ ప్రాంతంలోనే శీలావతి (అనుష్క శెట్టి) కండక్టర్‌గా ఉద్యోగం చేస్తూ.. వైద్య వృత్తిలో ఉన్న దేశీ రాజు (విక్రమ్ ప్రభు)ను ప్రేమిస్తుంటుంది. అయితే కొండ ప్రాంతంలో గంజాయి రవాణా చేసే కూలీలు (ఘాటీలు) జరిగే అన్యాయాన్ని సహించలేక శీలావతి, దేశీ రాజు కూడా గంజాయి మాఫియాలోకి అడుగుపెడుతారు. అయితే ఘాటీల తిరుగుబాటును సహించలేని నాయుడు ఫ్యామిలీ.. శీలావతి, దేశీ రాజుపై కక్ష కడుతారు. ఆ క్రమంలో శీలావతి, దేశీ రాజు పెళ్లి రోజున కుందల, కష్టాల నాయుడు వారిపై ఎటాక్ ప్లాన్ చేస్తారు.

Ghaati Movie Review and Rating in Telugu  Anushka Shetty s Power packed action drama

గంజాయి మాఫియా వ్యవహారాలను కుందల, కష్టాల నాయుడు ఎలా కొనసాగించారు? ఉద్యోగాలు చేసుకొనే శీలావతి, దేశీ రాజు గంజాయి వ్యాపారంలోకి ఎందుకు ప్రవేశించారు? నాయుడు బిజినెస్‌కు అడ్డంకి మారిన శీలావతిపై ఎలా ప్రతీకారం తీర్చుకొన్నారు? ఘాటీలకు జరిగిన అన్యాయం, తనకు జరిగిన అవమానానికి శీలావతి ఎలా రియాక్ట్ అయింది? దేశీ రాజు లక్ష్యం ఏమిటి? తన ప్రియుడి లక్ష్యాన్ని శీలావతి పూర్తి చేసిందా? గంజాయి వ్యాపారాన్ని ఆపివేయాలని, అలాగే ఘాటీ వృత్తిని వదిలివేయాలని శీలావతి ఎందుకు యూటర్న్ తీసుకొన్నది అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

తూర్పు కనుమల్లో గంజాయి సాగు విధానం, దానిని మాఫియా చేతుల్లోకి ఎలా వచ్చిందనే పాయింట్‌తో కథను దర్శకుడు క్రిష్ ఆసక్తికరంగానే మొదలుపెట్టాడు. స్టోరీ బ్యాక్ డ్రాప్, పాత్రల పరిచయం గురించి ఎక్కువగా దృష్టిపెట్టడం వల్ల అసలు కథలోకి వెళ్లడానికి కాస్త టైమ్ తీసుకొన్నాడనిపిస్తుంది. అయితే కథలో సమస్యను సృష్టించి సినిమాను మరో రేంజ్‌కు తీసుకు వెళ్లడానికి అనుసరించిన విధానం ఫర్వాలేదనిపించే విధంగా ఉంటుంది, కానీ ప్రేక్షకుడి ఆలోచనలకు పదను పెట్టే విధంగా రైటింగ్ లేకపోవడం వల్ల ఫస్టాఫ్‌‌లో ఊపు కనిపించదు. అయితే కొన్ని సీన్లు ఎమోషనల్‌గా ఉండటంతో కథ, కథనాలు గాడిలో పడ్డాయని అనుకొనే లోపే పేలవమైన సీన్లతో రోటీన్ ఫార్మాట్‌లోకి దర్శకుడు నెట్టాడా? అనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఫస్టాఫ్‌లో కథ చెప్ప తీరులో సాగదీత ఉన్నప్పటికీ.. సెకండాఫ్‌లో శీలావతి క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా మార్చడం సినిమా పాజిటివ్ జోన్‌లోకి చేరుతుంది. అయితే ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ ఎపిసోడ్‌లో వచ్చే సన్నివేశాలను మరింత బెటర్ ప్రజెంట్ చేయాల్సి ఉండేదనిపిస్తుంది. ఈ సినిమా విషయంలో క్రిష్ టీమ్ తమ కలాన్ని పూర్తి స్థాయిలో పదను పెట్టాల్సిందనే ఫీలింగ్ కలుగుతుంది.

ఇక నటీనటులు విషయానికి వస్తే.. ఈ సినిమాకు సోల్, స్ట్రెంగ్త్, సర్వం శీలావతి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్‌లో అనుష్క శెట్టి పరకాయ ప్రవేశం చేసిందా? అనేంతగా పెర్ఫార్మ్ చేసింది. యాక్షన్, సెంటిమెంట్ సీన్లలో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకొన్నారు. సినిమా భారాన్ని తన భుజాలపై మోసి సినిమాను ముందుకు నడిపించింది. ఇక అనుష్కకు తోడుగా, సపోర్టివ్‌గా విక్రమ్ ప్రభు తన పాత్రకు న్యాయం చేశారు. ఇక కుందల నాయుడుగా చైతన్య రావు క్యారెక్టర్ ఈ సినిమాలో సర్‌ప్రైజ్ ఎలిమెంట్. పూర్తిస్థాయి విలనిజాన్ని పండించడమే కాకుండా అనుష్కతో పోటిపడుతూ నటించాడు. జగపతి బాబు, జాన్ విజయ్, రవీంద్ర విజయ్, రాజు సుందరం తదితరులు తమ పాత్రల పరిధి మేరకు రాణించారు.

ఘాటీ సినిమా టెక్నికల్ విషయానికి వస్తే.. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ పాయింట్. విద్యాసాగర్ తన మ్యూజిక్‌లో పలు సన్నివేశాలను పవర్‌ఫుల్‌గా మార్చారు. తోట తరణి ఆర్ట్ వర్క్ సినిమాకు కొత్త మూడ్‌ను క్రియేట్ చేసింది. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ కొన్ని చోట్ల బ్రహ్మండంగా పేలాయి. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫి ఈ సినిమాను మరింత రిచ్‌గా మార్చింది. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి అనుసరించిన నిర్మాణ విలువలు హై క్లాస్‌గా ఉన్నాయి.

తెలుగు సినిమా ప్రేక్షకులకు గంజాయి మాఫియా అనేది కొత్త సబ్జెక్ట్. అలాంటి బ్యాక్ డ్రాప్‌తో అనుష్క శెట్టి బాడీ లాంగ్వేజ్, ఇమేజ్‌కు తగినట్టుగా రాసుకొన్న పక్కా రివెంజ్ డ్రామా. ఘాటిల జీవన విధానం ఆడియెన్స్‌కు కొత్తదనాన్ని రుచిచూపిస్తుంది. అనుష్క పెర్ఫార్మెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకు ప్లస్. స్క్రీన్ ప్లే, నిడివి మైనస్ పాయింట్స్. కనీసం 15 నిమిషాల సినిమాను ట్రిమ్ చేసి ఉంటే.. మూవీ బెటర్ ఫీల్ ఇచ్చి ఉండేదనిపిస్తుంది. క్యారెక్టర్లను తీర్చిదిద్దిన తీరు బాగున్నప్పటికీ.. కథ, కథనాలపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే.. అనుష్క కెరీర్‌లో ది బెస్ట్ మూవీ అయి ఉండేది. మాస్ ఎలిమెంట్స్‌తో యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను అనుష్క కోసమే థియేటర్‌లో చూడాలి. ఈ వారం మాస్ ఎంటర్‌టైనర్ చూడాలనే వారికి ఈ సినిమా కేరాఫ్ అడ్రస్. భారీ అంచనాలు లేకుండా వెళ్తే పైసా వసూలు సినిమా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X