twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ghani movie review.. వరుణ్ తేజ్ ఫెర్పార్మెన్స్ సూపర్.. కానీ.. !

    |

    Rating: 2.75/5

    ఇండియన్ సిల్వర్ స్క్రిన్‌పై క్రీడా నేపథ్యం ఉన్న సినిమాల జోరు ఇటీవల కాలంలో భారీగా కనిపిస్తున్నది. ముఖ్యంగా బాక్సింగ్ నేపథ్యంగా చిత్రాలు దక్షిణాదిలో ఇటీవల కాలంలో ఎక్కువగా వచ్చాయి. భారతీయ సినిమా పరిశ్రమలో మిథున్ చక్రవర్తి బాక్సర్ నుంచి మొదలుపెడితే.. ఇటీవల కాలంలో వెంకటేష్ నటించిన గురు, ఫరాన్ అఖ్తర్ నటించిన తుఫాన్, తమిళంలో ఆర్య నటించిన సర్పెట్టా పరంపర చిత్రాలు ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచాయి.

    మరోసారి తెలుగు ప్రేక్షకులను కొత్త అనుభూతిని పంచేందుకు వరుణ్ తేజ్ నటించిన ఘని చిత్రం ఏప్రిల్ 8వ తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఆడియెన్స్‌కు ఎలాంటి ఫీల్ అందించిందనే విషయాన్ని తెలుసుకొనేందుకు కథ, కథనాలను సమీక్షిద్దాం.

     గని సినిమా కథ ఏమిటంటే?

    గని సినిమా కథ ఏమిటంటే?

    విక్రమాదిత్య అనే జాతీయ స్థాయి బాక్సర్ కుమారుడు గని ( వరుణ్ తేజ్). తండ్రిని స్పూర్తిగా తీసుకొని జాతీయ స్థాయి బాక్సర్ కావాలని చిన్నతనం నుంచే కలలు కంటాడు. కానీ జాతీయ పోటీలో విక్రమాదిత్యకు ఎదురైన ఓ సంఘటన కారణంగా గని కుటుంబానికి సమాజం నుంచి చేదు అనుభవాన్ని చవి చూడాల్సి వస్తుంది. దాంతో బాక్సింగ్ క్రీడ జోలికి వెళ్లవద్దని బాల్యంలోనే గని చేత తల్లి ఒట్టు వేయించుకొంటుంది.

    కథలో మలుపులు

    కథలో మలుపులు

    తన తండ్రి విక్రమాదిత్యకు ఎదురైన చేదు అనుభవం ఏమిటి? దేశం మొత్తం వ్యతిరేకించే విధంగా విక్రమాదిత్య ఏం చేశాడు? తన తండ్రిపై గని ఎందుకు కోపం పెంచుకోవాల్సి వచ్చింది? తల్లికి ఇచ్చిన మాట మేరకు బాక్సింగ్ వదిలేశాడా? గని తండ్రికి జరిగిన మోసం ఏమిటి? తన తండ్రికి జరిగిన మోసానికి ఈశ్వర్ నాథ్ (జగపతిబాబు)పై గని ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడు. బాక్సింగ్ క్రీడతో మాయ (సాయి మంజ్రేకర్)తో గని ప్రేమ కథ ఎలా నడించింది. గని కథలో నేషనల్ చాంఫియన్ విజయేంద్ర సిన్హా (సునీల్ శెట్టి) పాత్ర ఏమిటి? గనిని జాతీయ స్థాయి బాక్సర్‌గా తీర్చి దిద్దేందుకు విజయేంద్ర సిన్హా ఎందుకు కంకణం కట్టుకొన్నాడు? కథలో ఇర్ఫాన్ ఖాన్ (అంబరీష్), యూసఫ్ ఖాన్ (భరత్ రెడ్డి) పాత్రలు ఏమిటి?

    మూవీలో ప్లస్ పాయింట్స్

    మూవీలో ప్లస్ పాయింట్స్

    గనిగా వరుణ్ తేజ్ ట్రాన్పర్మేషన్
    వరుణ్ ఫెర్ఫార్మెన్స్
    స్క్రీన్ ప్లే, డైలాగ్స్
    డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి టేకింగ్
    బ్యాక్ గ్రౌండ్ స్కోర్

    మూవీలో మైనస్ పాయింట్స్

    మూవీలో మైనస్ పాయింట్స్

    ఎమోషన్స్ పండకపోవడం
    మదర్, ఫాదర్ సెంటిమెంట్‌ సరైన రీతిలో ప్రజెంట్ చేయలేకపోయడం
    సాయి మంజ్రేకర్‌తో లవ్ ట్రాక్‌కు స్కోప్ లేకపోవడం
    విలనిజం స్ట్రాంగ్‌గా లేకపోవడం

    గని మూవీ ఎనాలిసిస్

    గని మూవీ ఎనాలిసిస్

    సునీల్ శెట్టి, ఉపేంద్ర మధ్య బాక్సింగ్ ఫైట్‌తో కథ ఎమోషనల్‌గా మొదలవుతుంది. తండ్రి కారణంగా గనికి జరిగిన అవమానంతో తల్లి పడే ఆవేదన సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ఇలా రెండు అంశాలతో కథ ఫీల్‌గుడ్‌గా సాగుతుందనే నమ్మకం కలుగుతుంది. కానీ గని ఇంట్రడక్షన్ తర్వాత సన్నివేశాలు తేలిపోవడం, హీరోయిన్‌తో లవ్ ట్రాక్ సరైన రీతిలో లేకపోవడంతో ఫస్టాఫ్‌ సాదాసీదాగా, నిరాసక్తతగా సాగుతుంది.

    అయితే ఇంటర్వెల్ ట్విస్టు సర్‌ప్రైజ్‌గా ఉండటంతో సెకండాఫ్‌పై క్యూరియాసిటీ పెరుగుతుంది. గని తండ్రి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తర్వాత సెకండాఫ్ ఊపందుకొంటుంది. కథలో ఇంటెన్సిటీ, టెంపో పెరగడం, ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ మధ్య ఈశ్వర్ నాథ్ (జగపతి బాబు), గనికి మధ్య సీన్లు సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశాయి.

    దర్శకుడు కిరణ్ గురించి

    దర్శకుడు కిరణ్ గురించి

    దర్శకుడు కిరణ్ కొర్రపాటి తొలి చిత్ర దర్శకుడైనప్పటికీ అలాంటి ఫీలింగ్ ఎక్కడా కనిపించదు. స్పోర్ట్స్ డ్రామాను తెరకెక్కించడం కత్తిమీద సామే అయినప్పటికీ.. తన తొలి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేశాడని చెప్పవచ్చు. అంతేకాకుండా అనుభవం ఉన్న దర్శకుడిగా కిరణ్ సినిమాను హ్యాండిల్ చేశాడు. ఎమోషనల్ సీన్లను బలంగా చూపించడంలోను, అలాగే స్పోర్ట్స్‌లో ఉండే డ్రామాను పూర్తిస్థాయిలో ప్రజెంట్ చేయడంలో తడబాటు కనిపిస్తుంది. ఓవరాల్‌గా మంచి విషయం ఉన్న దర్శకుడనే ముద్రను మాత్రం గని సినిమా ద్వారా వదిలాడని చెప్పవచ్చు.

    బాక్సర్‌గా వరుణ్ తేజ్

    బాక్సర్‌గా వరుణ్ తేజ్

    గనిగా వరుణ్ తేజ్ తన పాత్రలో ఒదిగిపోయాడు. గత చిత్రాల్లో చాక్లెట్ బాయ్‌‌గా పడిన ఇమేజ్‌కు దూరంగా వరుణ్ తేజ్ ప్రయత్నించాడనిపిస్తుంది. బాక్సర్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్ చాలా బాగుంటుంది. సిక్స్ ప్యాక్ బాడీతో తెర మీద అద్భుతంగా కనిపించాడు. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వరుణ్ తేజ్ చెలరేగిపోయాడని చెప్పవచ్చు. ఎమోషనల్ సీన్లలో బాగా పెర్ఫార్మ్ చేశాడని చెప్పవచ్చు. ఈ సినిమాలోగని పాత్ర ద్వారా కొత్త వరుణ్ తేజ్‌ను గ్యారెంటీగా చూసే అవకాశం లభించింది.

    ఇతర నటీనటుల గురించి

    ఇతర నటీనటుల గురించి

    మిగితా నటీనటుల ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. తెర మీద సునీల్ శెట్టి, ఉపేంద్ర, జగపతి బాబు లాంటి అగ్ర నటులు కనిపిస్తారు. కానీ వారి పాత్రలు పూర్తి స్థాయిలో క్లిక్ కాలేదనే ఫీలింగ్ కలుగుతుంది. ఆ పాత్రల ద్వారా బోలెడంత ఎమోషన్స్, డ్రామా క్రియేట్ చేసే ఛాన్స్‌ను మిస్ అయ్యామా అనే ఫీలింగ్ కలుగుతుంది. నదియా పాత్ర రొటిన్ తల్లి పాత్రగానే మిగిలింది. ఇక ఫెర్ఫార్మెన్స్‌కు కథలో స్కోప్ లేకపోవడం వల్ల సాయి మంజ్రేకర్ గ్లామర్‌ షో చేయడానికి ఛాన్స్ లభించలేదనిపిస్తుంది. నవీన్ చంద్ర పాత్రలో క్లారిటీ మిస్ అయిందనిపిస్తుంది. వీకే నరేష్, తనికెళ్ల భరణి మిగితా పాత్రలన్నీ కథతో పాటు ట్రావెల్ అవుతాయే కానీ.. కథను మరో లెవెల్‌కు తీసుకుపోయేంతగా డిజైన్ చేయలేదనిపిస్తుంది.

    Recommended Video

    Ghani Movie Heroine Saiee Manjrekar Special Interview | Part 3 | Filmibeat Telugu
     టెక్నికల్ విభాగాల పనితీరు

    టెక్నికల్ విభాగాల పనితీరు

    సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ పాయింట్. సెకండాఫ్‌లో పలు సన్నివేశాలు కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తోనే మరో లెవెల్‌లో కనిపించాయి. తమన్ మరోసారి మ్యూజిక్‌తో తన సత్తాను చూపించగలిగాడు. ఇక సినిమాటోగ్రఫి కూడా బాగుంది. జార్జ్ సీ విలియమ్స్ బాక్సింగ్ ఎపిసోడ్స్‌ను అద్బుతంగా తీర్చి దిద్దాడు. మార్తాండ్ వెంకటేష్ ఎడిటింగ్ బాగుంది.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    గని చిత్రం బాక్సింగ్‌ నేపథ్యంగా సాగే స్పోర్ట్స్ డ్రామా. కానీ సినిమాను బ్లాక్‌బస్టర్‌గా మార్చే ఎమోషన్స్, డ్రామా, సెంటిమెంట్ లేకపోవడం కొంత నిరాశను కలిగిస్తుంది. ఈ కథలో బలమైన సన్నివేశాలు లేకపోవడం వల్ల ఫీల్ మిస్ అయిందనిపిస్తుంది. అయితే తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన మంచి స్పోర్ట్స్ డ్రామా చిత్రాల్లో గని ఒకటి అని చెప్పవచ్చు. క్రీడా నేపథ్యంతో వచ్చే సినిమాలను ఆదరించే ప్రేక్షకులకు గని తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమాను థియేటర్‌లో చూస్తేనే ఓ థ్రిల్, ఎక్స్‌పీరియెన్స్ లభిస్తుంది. ఓ సారి ఫ్యామిలీతోపాటు వీకెండ్ ఎంజాయ్ చేసే సినిమా గని అని చెప్పవచ్చు.

    నటీనటులు

    నటీనటులు

    వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్, జగపతిబాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, నదియా, వీకే నరేష్; తనికెళ్ల భరణి, తమన్నా భాటియా
    దర్శకత్వం: కిరణ్ కొర్రపాటి
    నిర్మాతలు: సిద్దు ముద్ద, అల్లు బాబీ
    సినిమాటోగ్రఫి: జార్జ్ సీ విలియమ్స్
    ఎడిటింగ్: మార్తాండ్ కే వెంకటేష్
    మ్యూజిక్: తమన్ ఎస్
    బ్యానర్ం రినాయిసెన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ
    రిలీజ్ డేట్: 2022-04-08

    English summary
    Ghani is a sports based Boxing drama movie. Varun Tej as seen Ghani as boxer. This movie Released on April 8th. Here is the full and exclusive review for Telugu filmibeat audience.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X