Ghatikachalam Movie Review: ఘటికాచలం మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.5/5

నటీనటులు: నిఖిల్ దేవాదుల, సంయుక్త రెడ్డి, ఈటీవీ ప్రభాకర్, ఆర్వికా గుప్తా, దుర్గాదేవీ తదితరులు
దర్శకత్వం: అమర్ కామెపల్లి
కథ, నిర్మాణం: ఎంసీ రాజు
సినిమాటోగ్రఫి: ఎస్ఎస్ మనోజ్
మ్యూజిక్: ఫావియో జీ కుక్కురుల్లో
ఎడిటింగ్: శ్రీనివాస్ బాయినబోయిన
రచన: శ్రీనివాస్ మల్కార్
డిస్టిబ్యూషన్: మారుతి, ఎస్‌కేఎన్ (మాస్ మూవీ మేకర్స్)
బ్యానర్: ఒయాసిస్ ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్ డేట్: 2025-05-31

మెడిసిన్ చదివే కౌశిక్ బాలా (నిఖిల్ దేవాదుల)కు కొన్ని సైకాలజికల్‌గా కొన్ని సమస్యలు ఉంటాయి. దాంతో తనకు ఏం కావాలో.. తను ఏం చేయాలో చెప్పలేని పరిస్థితి తలెత్తుతుంది. తన మానసిక సమస్యను ఇతరులకు చెప్పుకోలేక తనలోనే తాను మదనపడిపోతుంటాడు. ఫ్రెండ్స్ ఎగతాళికి గురవుతాడు. ఇలాంటి పరిస్థితుల్లో వేరే అబ్బాయితో ప్రేమలో ఉన్న తన క్లాస్‌మెట్ (సంయుక్త రెడ్డి)ని లవ్ చేస్తుంటాడు. తనను ఏదో తెలియని దుష్టశక్తి ఆవహించడంతో విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. తన కొడుకు పరిస్థతి చూసిన తండ్రి పరుశురామ్ (ఈటీవీ ప్రభాకర్) సైకాలజిస్ట్ వద్దకు తీసుకెళ్తాడు. అయితే బాలా సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో మంత్రగాడి వద్దకు తీసుకెళ్లగా.. తనకు కుందన్‌భాగ్ ఘటికాచలం ఆవహించారని చెబుతుంది.

మానసిక రుగ్మత కారణంగా బాలాకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? తన క్లాస్‌మెట్‌ను ప్రేమిస్తే బాలాకు తన నుంచి ఎలాంటి రియాక్షన్ వచ్చింది? దుష్టశక్తి మూలంగా విచిత్రంగా ఎలా ప్రవర్తించాడు? సైకాలజిస్ట్ ఎలాంటి వైద్యం చేశాడు? బాలాకు ఉన్నది మానసిక రుగ్మతనా? లేదా నిజంగా దుష్టశక్తినే ఆవహించిందా? మంత్రగాడు చెప్పిన కుందన్‌భాగ్ ఘటికాచలం ఎవరు? బాలాను ఎందుకు ఆత్మ రూపంలో ఆవహించాడు? ప్రేమించిన అమ్మాయి బాలాను అర్ధం చేసుకొన్నదా? చివరకు బాలా సమస్యకు ఎలాంటి పరిష్కారం దొరికింది? అనే ప్రశ్నలకు సమాధానమే ఘటికాచలం సినిమా కథ.

Ghatikachalam Movie Review

దర్శకుడు అమర్ కామెపల్లి ఎంచుకొన్న పాయింట్‌లో ఆడియెన్స్‌ను థ్రిల్లింగ్ గురి చేసే ఎమోషన్స్, హారర్ ఎలిమెంట్స్‌కు స్కోప్ ఉన్నాయి. వాటిని కొంత వరకు బెటర్‌గా ప్రొజెక్ట్ చేసే పనిలో సక్సెస్ అయ్యాడు. కానీ పూర్తిస్థాయిలో కంప్లీట్ హారర్ ఎలిమెంట్స్‌ను ఎలివేట్ చేయడంలో తడబాటు కనిపిస్తుంది. డిఫరెంట్ హారర్ జోనర్‌ను దర్శకుడు టచ్ చేశాడనే ఫీలింగ్ మాత్రం కలుగుతుంది. ఈ సినిమాను బెటర్‌గా చేయడానికి ఇంకా బెటర్ రిసోర్సెస్, పేరున్న నటీనటులు ఉంటే బాగుండేదనిపిస్తుంది. అయితే పిల్లలతో తల్లిదండ్రులు సఖ్యతగా ఉండకపోతే ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అనే సందేశాన్ని చక్కగా చెప్పాడు అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

ఇక బాల నటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నిఖిల్ దేవాదుల హీరోగా మారి ఈ సినిమా ద్వారా తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకొనేందుకు ప్రయత్నించాడు. తన భుజాలపై సినిమా భారాన్నంతా మోశాడు. కొన్ని చోట్ల మంచి ఎమోషన్స్ పలికించాడు. ఇక తండ్రి పాత్రలో ఈటీవీ ప్రభాకర్ ఆకట్టుకొన్నాడు. మీరోయిన్‌గా సంయుక్తా రెడ్డి గ్లామర్‌తోపాటు తనకు స్కోప్ ఉన్నంత వరకు నటించేందుకు ప్రయత్నించారు. మిగితా పాత్రల్లో నటించిన వారంతా ఫర్వాలేదనిపించారు

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. నిర్మాత ఎంసీ రాజు తాను సొంతంగా రాసుకొన్న కథనే తెరపైకి తీసుకు రావాలనే ప్రయత్నంతో ఈ సినిమాను రూపొందించారు. నిర్మాత, కథకుడి విజన్‌ను అమర్ కామెపల్లి తెర మీదకు తీసుకు రావడంలో కొంత వరకు సక్సెస్ అయ్యాడు. ఎస్ఎస్ మనోజ్ సినిమాటోగ్రఫి సినిమాలోని మూడ్‌ను, ఎలిమెంట్స్‌ను ఎలివేట్ చేసేలా సన్నివేశాలను చిత్రీకరించారు. ఫ్లావియో మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్, డైలాగ్స్, ఆర్ట్ వర్క్ తదితర అంశాలు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. హారర్ సినిమాలు ప్రేక్షకుడిని వెంటాడుతూనే ఉంటాయి. కానీ ఈ సినిమాలో చక్కటి సందేశంతోపాటు మంచి హారర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. హారర్ సినిమాలు చూడాలనుకొనే వారు ఈ వారం వీలైతే ఈ సినిమాపై ఓ లుక్ వేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X