Ghost Review ఘోస్ట్ ఎవరు? శివరాజ్ కుమార్ మూవీ ఎలా ఉందంటే?
నటీనటులు: శివరాజ్ కుమార్, జయరాం, అనుపమ్ ఖేర్, అర్చన జాయిస్, సత్య ప్రకాశ్, ప్రశాంత్ నారాయణన్, యంజీ శ్రీనివాస్ తదితరులు
కథ, దర్శకత్వం: ఎంజీ శ్రీనివాస్
నిర్మాత: సందేశ్ నాగరాజ్
డైలాగ్స్: ప్రసన్న వీఎం, మస్తీ
సినిమాటోగ్రఫి: మహేంద్ర సిన్హా
మ్యూజిక్: అర్జున్ జన్య
ఎడిటింగ్: దీపు ఎస్ కుమార్
బ్యానర్: సందేశ్ ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2023-11-04
జైళ్లను ప్రైవేటీకరణ కోసం పోరాటం చేస్తున్న మాజీ సీబీఐ ఆఫీసర్ వామన్ శ్రీనివాస్ (ప్రశాంత్ నారాయణన్) కల ఫలిస్తుంది. జైలు నిర్మాణానికి భూమి పూజ చేయడానికి వెళ్లిన వామన్ బృందం కిడ్నాప్‌కు గురి అవుతుంది. కిడ్నాప్ గురైన వారిని రక్షించడానికి చరణ్ రాజ్ (జయరాం) అనే అధికారిని ప్రభుత్వం రంగంలోకి దించుతుంది. ఆపరేషన్ ప్రారంభించిన జయరాంకు వామన్‌ను కిడ్నాప్ చేసింది బిగ్ డాడీ (శివ రాజ్‌కుమార్) గ్రూప్ అని తెలియడంతో షాక్ గురవుతాడు.

బిగ్ డాడీ ఎవరు? అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి? వామన్ శ్రీనివాస్‌ను ఎందుకు కిడ్నాప్ చేసి బంధించారు? జైలులో బంగారు నిల్వల కథ ఏమిటి? కిడ్నాప్ వ్యవహారాన్ని చరణ్ రాజ్ ఎలా డీల్ చేశారు. కిడ్నాప్ డ్రామాలో అసలు ఘోస్ట్ ఎవరు? బిగ్ డాడీ లక్ష్యం ఏమిటి? ఆయన తన లక్ష్యాన్ని ఎలా చేరుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఘోస్ట్ సినిమా కథ.
జైలులో కిడ్నాప్ డ్రామాతో ఘోస్ట్ కథ ఆసక్తికరంగానే మొదలవుతుంది. అసలు కథలో పస లేకపోవడం, కథనంలో చాలా లోపాలు ఉండటం, అలాగే పాత్రల విషయంలో క్లారిటీ లేకపోవడం వల్ల సినిమా మొదటి భాగంలో ఏం జరుగుతుందోననే గందరగోళం నెలకొంటుంటుంది. రకరకాల అస్పష్టమైన ట్విస్టులు, క్లారిటీ లేని స్క్రీన్ ప్లేతో సినిమా సహనానికి పరీక్ష పెట్టినట్టు ఉంటుంది. శివ రాజ్ కుమార్ ప్రజెన్స్ కారణంగా సినిమాలో నిమగ్నమయ్యే ప్రయత్నం చేయాల్సి వస్తుంది.

ఇక సెకండాఫ్‌లో కథ, కథనాల పరంగా కొంత మెరుగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో సినిమాలోని ట్విస్టులు, బిల్డప్ షాట్స్, ఎలివేషన్స్ కొంత బెటర్‌గా అనిపిస్తాయి. యాక్షన్ సీన్లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌గా కనిపిస్తాయి. శివ రాజ్‌కుమార్ ఫ్యాన్స్‌కు పండుగ భోజనంలా ఉంటుంది. రెగ్యులర్ ఆడియెన్స్ పెద్దగా నచ్చకపోవడానికి చాలానే అంశాలు ఉన్నాయి.
నటీనటుల విషయానికి వస్తే.. శివరాజ్ కుమార్ వన్ మ్యాన్ షో మాదిరిగా ఉంటుంది. డ్యూయెట్, హీరోయిన్ లేకపోవడం రెగ్యులర్ ఆడియెన్స్‌కు కొంత నిరాశ పరిచే విషయంగా కనిపిస్తుంది. కేజీఎఫ్ ఫేమ్ అర్చన జాయిస్ ఉంది కానీ.. ఆమె క్యారెక్టర్‌కు పెద్దగా ప్రధాన్యం ఉన్నట్టు కనిపించదు. ఇతర పాత్రల్లో కనిపించిన వారు ఫర్వాలేదనిపిస్తుంది.

ఘోస్ట్ సినిమా విషయానికి వస్తే.. టెక్నికల్‌గా ఆకట్టుకొనే అంశాలు ఉన్నాయి. మహేంద్ర సిన్హా సినిమాటోగ్రఫి, అర్జున్ జన్య మ్యూజిక్ ఈ సినిమా వరకు ప్లస్ పాయింట్స్. కథలో, సన్నివేశాల్లో బలం లేకపోయినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొంత బలంగా మార్చే ప్రయత్నం చేసింది. ఇతర విభాగాల పరితీరు ఫర్వాలేదనిపిస్తుంది. సందేశ్ నాగరాజ్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
కథ, కథనాలు బలం లేకుండా యాక్షన్, బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో మ్యాజిక్ చేద్దామనే ప్రయత్నమే ఘోస్ట్. బీర్బల్ లాంటి సినిమాలతో ఆకట్టుకొన్న దర్శకుడు శ్రీని స్టోరీ, స్క్రీన్ ప్లేను పెద్దగా పట్టించుకొన్నట్టు కనిపించదు. కేవలం శివరాజ్ కుమార్ చరిష్మాపైనే ఆధారపడి సినిమా తీశాడా? అనే ఫీలింగ్ కలుగుతుంది. శివ రాజ్‌కుమార్ ఫ్యాన్స్‌కు నచ్చే అంశాలు ఉన్నాయి. యాక్షన్ డ్రామాను ఇష్టపడేవారు, శివ రాజ్‌కుమార్‌ను ఇష్టపడేవారు ఓ సారి చూడొచ్చు. వీలు కాకపోతే ఓటీటీలో వచ్చే వరకు ఆగితే సరిపోతుంది.


Click it and Unblock the Notifications











