For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Ginna review and rating సన్నీలియోన్ కిల్లింగ్ ఫెర్ఫార్మెన్స్.. మంచు విష్ణు హిట్ కొట్టాడా?

  |

  Rating:
  2.5/5
  Star Cast: Vishnu Manchu, Sunny Leone, Payal Rajput
  Director: Eeshaan Suryaah

  నటీనటులు: మంచు విష్ణు, సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్, దివి వద్యా, చమ్మక్ చంద్ర, వెన్నెల కిషోర్ తదితరులు
  దర్శకత్వం: సూర్య
  నిర్మాత: విష్ణు మంచు
  మ్యూజిక్: అనూప్ రూబెన్స్
  సినిమాటోగ్రఫి: చోటా కే నాయుడు
  ఎడిటర్: చోటా కే ప్రసాద్
  రిలీజ్ డేట్: 2022-10-21

  జిన్నా మూవీ కథేంటి అంటే?

  జిన్నా మూవీ కథేంటి అంటే?


  చిత్తూరులోని చిన్న గ్రామంలో గాలి నాగేశ్వర్ రావు అలియాస్ జిన్నా (విష్ణు మంచు) టెంట్ హౌస్ ఓనర్. తన గ్రామానికి చెందిన స్వాతి (పాయల్ రాజ్‌పుత్), జిన్నా ప్రేమలో ఉంటారు. ఈ క్రమంలో అమెరికా నుంచి తిరిగి వచ్చిన తన చిన్ననాటి స్నేహితురాలు రేణుక జిన్నాను పెళ్లి చేసుకోవాలనుకొంటుంది. అయితే రేణుక బాగా డబ్బు ఉన్న అమ్మాయి కావడంతో ఆమెను మోసం చేసి సొమ్ము చేసుకోవాలని ప్లాన్ చేస్తాడు.

  జిన్నాను మలుపు తిప్పే అంశాలు

  జిన్నాను మలుపు తిప్పే అంశాలు


  స్వాతితో జిన్మా ప్రేమ ఫలించిందా? తనను పెళ్లి చేసుకోవాలని అమెరికా నుంచి వచ్చిన రేణుకు పప్రోజల్‌కు జిన్నా ఎలా స్పందించాడు? రేణుకను మోసం చేసి డబ్బు కొట్టేయాలనుకొన్న జిన్నాకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఈ కథలో ప్రధాన పాత్ర పోషించిన దివి వద్యా కథను ఎలా మలుపు తిప్పింది? జిన్నాపై మనసు పడిన రేణుక పరిస్థితి చివరకు ఏమైందనే ప్రశ్నలకు సమాధానమే జిన్నా సినిమా కథ.

  ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

  ఫస్టాఫ్ ఎలా ఉందంటే?


  జిన్నా చిత్రం ఫస్టాఫ్ రెగ్యులర్ ఫార్మాట్‌లో మొదలవుతుంది. హీరో ఎంట్రీ, పాటలు, ఫైట్స్ ఇలా ఫార్మాట్‌తో పాత్రల పరిచయంతో కొత్తదనం లేకుండా సాగుతుంది. సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్ అందాల ఆరబోత సినిమాకు కొంత ఎట్రాక్షన్‌ను తెచ్చిపెడుతాయి. ఫస్టాఫ్‌ కామెడీ పెద్దగా ఆకట్టుకొలేకపోయిందనే చెప్పాలి.

  సెకండాఫ్‌లో ఊహించని ట్విస్టుతో

  సెకండాఫ్‌లో ఊహించని ట్విస్టుతో


  ఇక సెకండాఫ్‌కు వచ్చే సరికి కథ కాస్త ఆసక్తిని రేపుతుంది. కథలో భావోద్వేగాలు భారీగా పండాయనే చెప్పాలి. అప్పటి వరకు రొటీన్‌గా సాగిన కథలో ట్విస్టులు రావడంతో ప్రేక్షకుడిలో జోష్ కనిపిస్తుంది. ఇక వెన్నెల కిషోర్ సెకండాఫ్‌ను తనదైన కామెడీతో నిలబెట్టారు. సెకండాఫ్‌లో హారర్ ఎపిసోడ్స్, సైకో ఎలిమెంట్స్‌ ఆకట్టుకోవడమే కాకుండా ఎమోషనల్‌గా మారుస్తాయి. ఇక దివి వద్య పాత్రకు సంబంధించిన ట్విస్టుతో సినిమా ఫీల్‌గుడ్‌గా అనిపిస్తుంది.

  దర్శకుడు, రచయితల గురించి

  దర్శకుడు, రచయితల గురించి


  ప్రముఖ దర్శకుడు జీ నాగేశ్వర్ రెడ్డి కథ సహాకారం, నిర్మాత, రచయిత కోన వెంకట్ అందించిన స్క్రీన్ ప్లే ఫస్టాఫ్‌లో చాలా రొటీన్‌గా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో క్రేజీగా ట్విస్టులతో సాగుతుంది. వీరిద్దరి సహకారంతో సూర్యకు పని చాలా సులభమైందనిపిస్తుంది. సూర్య కొత్తవాడైనా కోన, నాగేశ్వర్ రెడ్డి వల్ల పర్‌ఫెక్ట్‌గా సినిమాను రూపొందించారని చెప్పవచ్చు. రొటీన్, రెగ్యులర్ ఫార్మాట్ అయినా చివరకు అందరికి నచ్చే విధంగా ఫీల్ కల్పించారని చెప్పవచ్చు.

   సన్నీలియోన్ కొత్త కోణంతో

  సన్నీలియోన్ కొత్త కోణంతో


  ఇక మంచు విష్ణు విషయానికి వస్తే.. ఆయన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఢీ, దూసుకెళ్తా లాంటి సినిమాలో ఆయన కామెడీ టైమింగ్‌గా మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమా విషయంలో పాత్రలో వేరియేషన్స్ తక్కువగా ఉండటంతో ఓ రేంజ్‌లో వరకు ఓకే అనిపిస్తాడు. ముఖ్యంగా డ్యాన్సులతో ఇరుగదీశారు. డ్యాన్సుల విషయంలో కొత్త విష్ణు తెరమీద కనిపిస్తాడు. ఇక సన్నీలియోన్ ఇప్పటి వరకు శృంగార తార మాదిరిగానే తెలుసు. ఈ సినిమాలో కూడా అదే ఫ్లేవర్‌ను కొనసాగించినా.. సెకండాఫ్‌లో ఫెర్ఫార్మెన్స్ పరంగా అదరగొట్టింది. సన్నిలియోన్ నటనలో కొత్త కోణం కనిపిస్తుంది. పాయల్ రాజ్‌పుత్‌కు కేవలం అందాల ఆరబోతకే పరిమితమైందనే చెప్పాలి.

   దివి వద్యా రోల్ ఎమోషనల్‌గా

  దివి వద్యా రోల్ ఎమోషనల్‌గా


  జిన్నా సినిమాలో ఆకట్టుకొనే పాత్రల్లో బిగ్‌బాస్ బ్యూటీ దివి వద్య ఒకరు. ఇటీవల గాడ్‌ఫాదర్ చిత్రంలో చిన్న పాత్రైనా కేక పెట్టించింది. మరోసారి ఎమోషనల్, ఫీల్ ఉన్న పాత్రలో కనిపించడమే కాకుండా మెప్పించింది కూడా. కథను మలుపు తిప్ే పాత్రలో దివి ఆకట్టుకొన్నది. చమ్మక్ చంద్ర ఊర మాస్ కామెడీ.. వెన్నెల కిషోర్ క్లాస్ కామెడీ సినిమాకు ప్లస్ అని చెప్పవచ్చు. మిగితా పాత్రల్లో నటించిన వారు వారి పాత్రలకు న్యాయం చేశారు.

  జిన్నా టెక్నికల్ అంశాల గురించి

  జిన్నా టెక్నికల్ అంశాల గురించి


  సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. చోటా కే నాయుడు అందించిన సినిమాటోగ్రఫి ఈ మూవీకి స్పెషల్ ఎట్రాక్షన్. కంటెంట్ వీక్ అయినప్పటికీ.. సన్నివేశాలను తన ప్రతిభతో బాగా తీశారనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే చోటా కే ప్రసాద్ అందించిన ఎడిటింగ్ బాగుంది. ఫస్టాఫ్‌లో కథ, కథనాలు బలహీనంగా ఉన్నా.. తన ప్రతిభతో సీన్లను పరుగులు పెట్టించాడు. ప్రభుదేవా అందించిన కోరియోగ్రఫి, అనూప్ రూబెన్స్ అందించిన మ్యూజిక్ ఆకట్టుకొనేలా ఉన్నాయి. సెకండాఫ్‌లో బీజీఎం బాగుంది. విష్ణు మంచు పాటించిన ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు


  బలం, బలహీనతలు
  పాజిటివ్ పాయింట్స్
  సన్నీలియోన్, దివి ఫెర్ఫార్మెన్స్
  చంద్ర, వెన్నెల కిషోర్ కామెడీ

  మైనస్ పాయింట్స్
  కథ, కథనాలు
  కొత్తదనం కనిపించకపోవడం

  జిన్నా ఫైనల్‌గా ఎలా ఉందంటే?

  జిన్నా ఫైనల్‌గా ఎలా ఉందంటే?


  కామెడీ, లవ్, ఎమోషన్స్‌ అంశాలతో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ జిన్నా.
  కామెడీకి బాగా స్కోప్ ఉన్నప్పటికి, సన్నీలియోన్ పాత్రను మరింత ఎమోషన్స్ పండించడానికి ఛాయిస్ ఉన్నాయి. ఇంకా బెటర్‌గా చేసి ఉంటే మంచి కామెడీ థ్రిలర్ మూవీ అయి ఉండేది. పాయింట్ బాగున్నప్పటికీ.. ఆ రేంజ్‌లో ట్రీట్‌మెంట్ లేదనిపిస్తుంది. ఎమోషనల్‌తో కూడిన ట్విస్టులు సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చాయి. నటీనటులు ఫెర్ఫార్మెన్స్ సినిమాకు బలంగా మారాయి. రొటీన్ కథ బలహీనంగా కనిపిస్తుంది. అయితే కొన్ని విషయాలు తప్పిస్తే.. రెండున్నర గంటలు ప్రశాంతంగా ఎంజాయ్ చేయడానికి మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే.. జిన్నా మిమ్మల్ని మెప్పిస్తాడు.

  English summary
  Machu Vishnu's movie Ginna has released on October 21st, 2022. Vishnu Manchu, Sunny Leone, Payal Rajput and Divi Vadhtya are in lead role. Here is the exclusive review from Telugu filmibeat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X