twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాయ్స్‌ ఫాంటసీ కోసమే 'గర్ల్స్‌'

    By Staff
    |

    Girls
    చిత్రం: గర్ల్స్‌ (బాయ్స్‌తో పనేంటి!)
    నటీనటులు: ఇషా కొప్పికర్‌, అమృతా అరోరా, ఆశిష్‌ చౌదరి, తదితరులు
    సంగీతం: డబ్బూ మాలిక్‌
    నిర్మాత: ఎస్పీ క్రియేషన్స్‌
    స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కరన్‌ రజ్డాన్‌

    లెస్పిబియనిజం - ఇప్పటికీ మనదేశంలో 'నిషేధ అంశమే'. బాగా చదువుకున్నవారు కూడా అంతా సులువుగా 'డైజెస్ట్‌' చేసుకోలేని ఈ అంశంపై మన దేశంలో తొలిసారిగా దీపామెహతా రూపొందించిన 'ఫైర్‌' అనే చిత్రం వచ్చింది. చాలా గ్యాప్‌ తర్వాత ఇప్పుడు 'గర్ల్‌ఫ్రెండ్‌' పేరుతో హిందీలో చిత్రం ఈ వారం విడుదలైంది. తెలుగులో దీన్ని గర్ల్స్‌ (బాయ్స్‌తో పనేంటి!) అనే పేరుతో డబ్‌ చేసి విడుదల చేశారు.

    'లెస్బినియజం' అంశాన్ని అసహ్యంచుకునే పురుష పుంగవులకు కూడా ఈ అంశాన్ని 'తెర'పై చూసి ఆనందించాలనే ఫాంటసీ ఉంటుంది. ఆ ఫాంటసీతో ఈ సినిమా చూడడానికి వస్తే హీరోయిన్లు అమృతా అరోరా, ఇషా కొప్పికర్‌ల అందచందాల ప్రదర్శన, కౌగలింతలు బాగానే ఆనందిస్తాయని చెప్పాలి. కాకపోతే, ఆడవాళ్ళు ఆడవాళ్ళువైపు ఎందుకు ఆకర్షింపబడుతారు, లెస్బియన్స్‌ మధ్య ఉండే ' ఎమోషనల్‌ సంబంధాల'ను చూడాలనుకునే సున్నిత మనుస్కులకు ఇది నప్పదు.

    మగవాళ్ల ఫాంటసీలను తీర్చేందుకు ఈ సినిమా తీసినట్లు కన్పిస్తుంది. పక్కా సెకండ్‌ గ్రేడ్‌ చిత్రం.

    అమృతా, ఇషాలిద్దరూ మంచి స్నేహితులు. వారిద్దరి మధ్య 'సంబంధం' ఏర్పడుతుంది. ఇషా చిన్ననాట 'సెక్సువల్‌ అబ్యూస్‌' వల్ల లెస్బియనిజానికి అలవాటు పడితే, అమృతా తాగిన మైకంలో ఏర్పరచుకుంటుంది. కథలో ట్విస్ట్‌ ఏమిటంటే, అమృతా ఆశిష్‌ చౌదరిని ప్రేమించడం, అమృతాను తనవైపు తిప్పుకునేందకు ఇషా ఆశిష్‌ను చంపే ప్రయత్నం చేయడం. సినిమా చివరికి అందరూ ఊహించవిధంగానే ముగుస్తుంది.

    తెలుగులో నాగార్జున సరసన 'చంద్రలేఖ'లో నటించిన ఇషా ఆడవిలన్‌గా బాగానే చేసింది. అమృత, ఇషాలిద్దరూ బాగానే అందాలు ప్రదర్శించారు. దర్శకత్వం గురించి గొప్పగా చెప్పుకునే అంశం లేదు. సెకాండాఫ్‌ మరీ సాగతీత.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X