Gladiator II Review: గ్లాడియేటర్ 2 మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: పాల్ మెస్కల్, పెడ్రో పాస్కల్, ఫ్రెడ్ హెచింగర్, లైయర్ రాజ్, డెరిక్ జాకోబి, డెంజెల్ వాషింగ్టన్ తదితరులు
దర్శకత్వం: రిడ్లీ స్కాట్
స్క్రీన్ ప్లే: డేవిడ్ స్కార్పా
కథ: పీటర్ క్రేయిగ్
నిర్మాతలు: రిడ్లీ స్కాట్, డగ్లస్ విక్, సూసీ ఫిచర్ తదితరులు
సినిమాటోగ్రఫి: జాన్ మాథిసన్
ఎడిటింగ్: క్లెయిర్ సింప్సన్
మ్యూజిక్: హ్యారీ గ్రేగ్‌సన్, విలియమ్స్
బ్యానర్: స్కాట్ ఫ్రీ ప్రొడక్షన్స్, రెడ్ వ్యాగన్ ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్ డేట్: 2024-11-15
లూసియస్ వెరస్ (పాల్ మెస్కల్) తన భార్యతో నుమిడియాలో వైవాహిక జీవితాన్ని గడుపుతుంటాడు. జనరల్ మార్కస్ అకాసియస్ (పెడ్రో పాస్కల్) నేతృత్వంలోని రోమన్ సైన్యం దాడి చేసి తన భార్యను చంపేసి లూసియస్‌ను రోమ్ యువరాజలు జెటా (జోసెఫ్ క్విన్), కారాకల్ల (ఫ్రెడ్ హెచింగర్) ద్వయం బానిసగా మార్చుతారు. అయితే బానిసగా విముక్తి పొందాలంటే.. రోమన్ రాజులు ఆడే వికృత క్రీడలో విజయం సాధించి వీరుడిగా నిలువాలనే కండిషన్ పెడుతారు.

తల్లిదండ్రులు లుసిల్లా, మాక్సిమమ్‌కు లూసియస్ ఎందుకు దూరమయ్యాడు? రోమన్ యువరాజులు ఆడే క్రూరమైన క్రీడలో లూసియస్ ఎలా పావుగా మారారు. క్రూర జంతువులు, రోమన్ వీరులను లూసియస్ ఎలా ఎదురించారు? రోమన్ సామ్రాజ్యాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకొన్న మాక్రినస్ (డెంజెల్ వాషింగ్టన్)కు ఎలాంటి గుణపాఠం చెప్పాడు? తల్లి లుసిల్లా కోరికను నెరవేర్చాడా? జెటా, కారాకల్ల అరాచక పాలన నుంచి రోమన్ ప్రజలకు ఎలా విముక్తి కలిగించారనేది గ్లాడియేటర్ సినిమా కథ.
గ్లాడియేటర్ మూవీ దాదాపుగా 24 క్రితం అంటే 2000 సంవత్సరంలో విడుదలై సంచలన విజయం సాధించడమే కాకుండా ప్రపంచ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అలాంటి సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకుల ముందుకు గ్లాడియేటర్ 2 ముందుకు వచ్చింది. అయితే రిడ్లీ స్కాట్ రాసుకొన్న కథ.. దానిని సన్నివేశాలుగా విస్తరించిన తీరు బాగుంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా ఎమోషన్స్, రాజనీతీ వ్యవహరాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నీ అంశాలను కూడా థ్రిల్లింగ్‌గా తెరకెక్కించారు.
24 ఏళ్లు దాటినా గానీ ఇంకా ప్రేక్షకుల హృదయాల్లో ఉన్న గ్లాడియేటర్ సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా కథను నడిపించి తీరు.. అలాగే నటీనటులతో నటన రాబట్టుకొన్న తీరు హ్యాట్సాప్ అనిపించేలా ఉంది. ఇక స్టేడియంలో రకరకాల యుద్ద విన్యాసాలను చిత్రకరించిన విధానం చూస్తే కనురెప్ప మూస్తే ఏదైనా మిస్ అవుతామా? అనే విధంగా ఉంటుంది. సినిమా ఆరంభంలోనే భారీ యాక్షన్ ఎపిసోడ్‌లో లూసియస్ భార్యను చంపడం.. అలాగే అతడిని బానిస చేయడం లాంటి అంశాలతో ఏ మాత్రం లేటు చేయకుండా కథలోకి తీసుకెళ్లి ప్రేక్షకుడిని మూవీకి కనెక్ట్ చేయడం దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది.
నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. లూసియస్ వెరస్‌గా పాల్ మెస్కల్ నటన అమోఘంగా ఉంది. యాక్షన్, ఎమోషన్ సన్నివేశాల్లో అదరగొట్టాడు. ఎమోషనల్ సీన్ల అద్బుతంగా రాణించాడు. లూసిల్లాగా కానీ నీల్సెన్, కరాకల్లాగా ఫ్రెండ్ హెచింగర్, జెటాగా జోసెఫ్ క్విన్ సాఫ్ట్ విలనిజంతో ఆకట్టుకొంటారు. అలాగే మాక్రినస్ పాత్రలో చాణక్యుడిలా రాజనీతి వ్యవహారాలతో డెంజెల్ వాషింగ్టన్ తన నటనతో సినిమాను మరో మెట్టు ఎక్కించే ప్రయత్నం చేశారు. ఇలా ప్రతీ పాత్ర గుర్తిండిపోయేలా తెర మీద ఆవిష్కృతమైంది.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, యాక్షన్ కొరియోగ్రఫి, మ్యూజిక్ ప్రధానంగా ఈ మూవీకి హైలెట్‌గా నిలిచాయి. యాక్షన్ సీన్లను ఊపిరి బిగబట్టి చూసేలా డిజైన్ చేశారు. సౌండ్ డిజైనింగ్, ఆర్ట్, ఎడిటింగ్ విభాగాల పనితీరు సినిమాకు మాస్టర్ క్లాస్‌గా మార్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ అద్బుతంగా ఉన్నాయి. ప్రతీ సన్నివేశం విజువల్ ట్రీట్‌గా రూపొందించారు.
గ్లాడియేటర్ 2 సినిమా విషయానికి వస్తే.. సీక్వెల్స్ అంటే కొన్ని లోపాలు కనిపిస్తుంటాయి. కానీ గ్లాడియేటర్ పార్ట్ 1 మరిపించే విధంగా ఈ సినిమాను అన్ని రకాల ఎమోషన్స్, థ్రిల్స్‌తో తెరకెక్కించడంతో ప్రేక్షకులు కొత్త అనుభూతికి గురవ్వడం ఖాయమనిపిస్తుంది. దర్శకుడు ఊహించని విధంగా సన్నివేశాలను అందించిన తీరు చూస్తే సినిమాపై ఉన్న తపన ఏంటో తెలుస్తుంది. పక్కా మాస్, క్లాస్ ఎంటర్‌టైనర్. థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఫుల్లుగా ఉన్న సినిమా ఇది. డోంట్ మిస్ ఇట్.


Click it and Unblock the Notifications











