Godari Gattupaina First Review: గోదారి గట్టుపైన మూవీ ఫస్ట్ రివ్యూ

యువ హీరో సుమంత్ ప్రభాస్, హీరోయిన్ నిధి ప్రదీప్ జంటగా నటించిన చిత్రం గోదారి గట్టుపైన. విలక్షణ నటుడు జగపతి బాబు, రాజీవ్ కనకాల, సీనియర్ హీరోయిన్ లైలా కీలక పాత్రల్లో నటించారు. ఇంకా దేవీ ప్రసాద్, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్, రోహిత్ కృష్ణ వర్మ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సుభాష్ చంద్ర దర్శకత్వం వహించారు. ఈ మూవీకి అభినవ్ రావు నిర్మాతగా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా మధూళిక సంచన లంక వ్యవహరించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. సినిమాటోగ్రఫి: సాయి సంతోష్, ఎడిటర్: అనిల్ కుమార్ పీ, మ్యజిక్: నాగ వంశీకృష్ణ, సౌండ్ ఇంజినీర్: నాగార్జున తాళ్లపల్లి, ప్రొడక్షన్ డిజైనర్: ప్రయల్య డీ తమ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సినిమా మే 8వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఏంటి? ఈ సినిమాకు లభించిన సెన్సార్ సర్టిఫికెట్, రన్ టైమ్ వివరాల్లోకి వెళితే..

Godari Gattupaina  Review by Censor Board

గోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో ఆటో డ్రైవర్ వృత్తిని కొనసాగించే యువకుడు రాజు (ప్రభాస్ సుమంత్), సత్యభామ (నిధి ప్రతాప్) ప్రేమలో పడుతారు. కానీ వారి ప్రేమకు సత్యభామ తండ్రి (జగపతిబాబు) నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతాయి. దాంతో వారి ప్రేమ సందిగ్దంలో పడుతుంది. అయితే రాజు ప్రేమకు అడ్డంకిగా నిలిచిన అంశం ఏమిటి? ప్రేమను అంగీకరించకపోవడంతో సత్యభామ ఏం చేసింది? తండ్రిని ఇద్దరు ప్రేమికులు ఎలా ఒప్పించారా? రాజు, సత్యభామ తమ ప్రేమను గెలిపించుకొన్నారా? అనేది ఈ సినిమా కథ.

గోదారి గట్టుపైన సినిమా కథ విషయానికి వస్తే.. గొప్పగా చెప్పుకొనేంతగా ఏమి లేదు. కానీ స్వచ్ఛమైన గ్రామీణ నేపథ్యంగా సాగే ప్రేమ కథ. ఈ జనరేషన్‌ యువతీ, యువకుల ప్రేమ ప్రయాణం. ప్రియురాలి తండ్రి అభ్యంతరాలు నేపథ్యంగా చాలా సినిమాలు వచ్చినప్పటికీ.. ఈ సినిమాలో ఉండే బలమైన ఎమోషనల్ పాయింట్ ఈ మూవీని డిఫరెంట్‌గా మార్చేసింది. ఆ భావోద్వేగమైన పాయింట్ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయితే మాత్రం సినిమా మంచి రెస్పాన్స్ వస్తుందనే ఫీడ్ బ్యాక్ సెన్సార్ రిపోర్టు ద్వారా వచ్చిందని తెలిసింది.

ఇక పూర్తిగా ఫన్, లవ్, ఎమోషనల్ అంశాలతో సాగే ఈ సినిమాకు పెద్దగా అభ్యంతరాలు వెల్లడించకుండానే సినిమా రిలీజ్‌కు సెన్సార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకు యూఏ (UA13+) సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సర్టిఫికెట్ ప్రకారం 13 ఏళ్లకు పైబడిన వారు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల అనుమతితో చూడాల్సి ఉంటుందని సెన్సార్ తమ మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.

గోదారి గట్టుపైన సినిమా హానెస్ట్ అండ్ జెన్యూన్ లవ్ స్టోరీగా రూపొందిందన టాక్ వచ్చింది. అయితే ఈ చిత్రంలో ఊహకు అందని ట్విస్టులు, టర్న్ లేకుండా ఫీల్ గుడ్ అంశాలతో సాగే కథ కావడంతో నిడివి కూడా బ్యాలెన్స్‌గా ఫిక్స్ చేశారు. ఈ సినిమా నిడివి 2 గంటల 28 నిమిషాలు. అంటే 148 నిమిషాల రన్‌టైమ్‌తో ఈ సినిమాను ముగించారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా గురించిన ఎక్స్‌క్లూజివ్ రివ్యూ, ఇతర కథనాల కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X