twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గొడవ-సినిమా సమీక్ష

    By Staff
    |
    Godava
    Rating
    నటీనటులు: వైభవ్, శ్రద్ధా ఆర్యా, షాయాజి షిండే. సునీల్, బ్రహ్మానందం,
    చలపతిరావు, ఢిల్లీ గణేష్, చిత్రం శ్రీను తదితరులు.
    మాటలు-పరుచూరి బ్రదర్స్
    సంగీతం-మణిశర్మ
    సినిమాటోగ్రఫీ-దినేష్
    ఎడిటింగ్-మార్తాండ్ కె.వెంకటేష్
    నిర్మాత-ఎ.భారతి
    బ్యాన్నర్-కె ఫిల్మ్స్
    స్క్రీన్ప్లే, దర్శకత్వం-ఎ కోదండరామిరెడ్డి
    విడుదల-డిసెంబర్07, 2007

    బాలు(వైభవ్), అంజలి(శ్రద్ధా ఆర్యా) ఒకే కాలేజీలో చదువుతుంటారు. ఏదో ఒక సంఘటనతో హీరోనో, హీరోయినో అటో ఇటో మొదట ప్రేమలో పడడం షరా మామూలే అన్నట్టు ఈ సినిమాలోనూ హీరోయిన్ ముందుగా ప్రేమలో పడుతుంది. అయితే హీరోగారూ ఆ లవ్ ను తిరస్కరిస్తారు. మరోవైపు హీరోయిన్ తండ్రి(షాయాజీ షిండే) ఆమెకు ఒక పెద్దింటి కుర్రాడితో పెళ్లి కుదిరిస్తాడు. దీనితోపెళ్లి అయ్యేదాకైనా లవ్ చేయమని హీరోయిన్, హీరోను కోరుతుంది..ఆ తరువాత ఏమైందన్నది తెరపై చూడాల్సిందే.

    చిరంజీవితోనే కాకుండా పలువురు హీరోలతో 93 సినిమాలు తీసిన దర్శకుడు ఎ కోదండరామిరెడ్డి చాలాకాలం తరువాత తన కుమారుడినే హీరోగా పరిచయం చేస్తూ గొడవ కు దర్శకత్వం వహించాడు. తాను దర్శకత్వం వహించిన సినిమాలలో విజయం సాధించినవే ఎక్కువనే క్రెడిట్ ఉన్న కోదండరామిరెడ్డి తన కొడుకు సినిమాకు కూడా స్వయంగా దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కథ చెప్పుకోదగ్గట్టుగా లేదు. అదే పెద్ద లోపం. పాటలు మాత్రం మణిశర్మ మార్కుతో అద్భుతంగా ఉన్నాయి. చీత్రీకరణ కూడా పరవాలేదు. వైభవ్ చక్కగా డాన్స్ చేశాడు. యాక్షన్ సీన్లలో కూడా రాణించాడు. హీరోయిన్ స్కిన్ షోలో సక్సెస్ అయింది. కథ బలహీనంగా ఉండడం ఈ సినిమాకు పెద్ద లోటు. సీనియర్ దర్శకులు రిటైర్ అవడమే మంచిదని చెప్పే రెండో సినిమా ఇది. మొదటిది దాసరి నారాయణరావు కథతో వచ్చిన మైసమ్మ ఐపిఎస్ సినిమా. కోదండరామిరెడ్డి తన కొడుకును యువ దర్శకుడి చేతిలో పెడితేనే ఏమైనా లాభం చేకూరేది.

    (గమనిక: వినోదం అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు,కథన నైపున్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది. సినిమా జయాపజయాలకు మా రేటింగ్ కు సంబందం ఉండనవసరం లేదు)

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X