For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Godzilla: King of the Monsters: మూవీ రివ్యూ అండ్ రేటింగ్

|

Rating:
3.0/5
Star Cast: కైలే చాండ్లర్, వెరా ఫర్మీంగా, మిల్లీ బాబీ బ్రౌన్
Director: మైఖేల్ డాహెర్తీ

గతంలో రిలీజైన గాడ్జిల్లాకు సీక్వెల్‌గా గాడ్జిల్లా: కింగ్స్ ఆఫ్ మాన్‌స్టర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గాడ్జిల్లాకు దర్శకత్వం వహించిన గారెత్ ఎడ్వార్డ్స్ కొన్ని కారణాల వల్ల తప్పుకోవడంతో సీక్వెల్‌కు మైఖేల్ డాహెర్తీ దర్శకత్వం వహించారు. గాడ్జిల్లా సిరీస్‌లో ఇది 35వది. విడుదలకు ముందే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్లు సినిమాపై అంచనాలు పెంచాయి. విజువల్ ఎఫెక్ట్స్, ఇతర అంశాలపై మీడియాలో చర్చ భారీగానే జరిగింది. ఇలాంటి అంశాల మధ్య గాడ్జిల్లా: కింగ్స్ ఆఫ్ మాన్‌స్టర్ మే 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలకు చేరుకొన్నాదా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ ఏమిటంటే

కథ ఏమిటంటే

మార్క్ (కైలే చాండ్లర్), డాక్టర్ ఎమ్మా రస్సెస్ (వెరా ఫర్మింగా) ఇద్దరు భార్య భర్తలు. ఐదేళ్ల క్రితం గాడ్జిల్లా దాడిలో తన కుమారుడిని కోల్పోతారు. వ్యక్తిగత విభేదాల కారణంగా వారిద్దరూ విడిపోతారు. ఎమ్మా రసెల్ తన కూతురు మాడిసన్ (మిల్లీ బాబీ బ్రౌన్)తో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో ప్రపంచాన్ని సర్వనాశనం చేయాలనే కోరికతో మోనార్క్ ఆర్గనైజన్‌‌ను నడిపే అలెన్ జానా (చార్లెస్ డ్యాన్స్)తో కలిసి ఎమ్మా రసెల్ పనిచేస్తుంటుంది. రాక్షస బల్లులు లాంటి భీకరమైన జంతువులను గుర్తించే పరికరాన్ని కనిపెడుతుంది. అలెన్ జానా దుష్ణపన్నాగాలను మార్క్ బృందం ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంటారు.

 కథలో మలుపులు

కథలో మలుపులు

అలెన్ జానా, మార్క్ బృందాల మధ్య జరిగే పోరాటంలో మోత్రా, రోడాన్, కింగ్ గిడోరా లాంటి భయంకర జంతువులను గాడ్జిల్లా ఎలా ఎదుర్కొన్నది. తల్లి వద్ద నుంచి బయటకు వచ్చిన మాడిసన్ తండ్రి వద్దకు చేరిందా? ఎమ్మా, మార్క్ మళ్లీ కలుసుకొన్నారా? అలెన్ దుష్టపన్నాగాలకు ఎవరు? ఎలా అంతం పలికారు అనే ప్రశ్నలకు సమాధానమే గాడ్జిల్లా కింగ్స్ ఆఫ్ మాన్స్‌స్టర్ చిత్ర కథ.

 విశ్లేషణ

విశ్లేషణ

ఆది మానవుల కాలంలో ఉండే జంతువుల గురించి పరిశోధించే సంస్థ మోనార్క్ చుట్టే కథ తిరుగుతుంది. మంచు కొండల్లో బంధీలైన భయంకర జీవులను, గాడ్జిల్లాను విడిపించే క్రమంలో కథ సాగుతంది. మోత్రా, రోడాన్, కింగ్ గిడోరాను గాడ్జిల్లా అంతమొందించడానికి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చిందనే అంశాలు సినిమాలో ఆసక్తికరంగా ఉంటాయి. కాకపోతే కథలో పాత్రల వివరణ అసంపూర్తిగా, అసందిగ్ధంగా అనిపిస్తాయి. కథ కంటే గ్రాఫిక్,యాక్షన్ సన్నివేశాలనే నమ్ముకొన్నట్టు కనిపిస్తుంది.

 సాంకేతికంగా

సాంకేతికంగా

గాడ్జిల్లా మూవీ చూడని ప్రేక్షకులకు కథలో ఏం జరుగుతందో అర్థం కాదు. గ్రాఫిక్స్ వర్క్స్ బాగున్నాయి. కాకపోతే ఓ రకమైన కలర్ బ్యాక్ డ్రాప్‌తో సినిమాను చిత్రీకరించడం ప్రేక్షకుడుని అసహనానికి గురిచేస్తుంది. అద్భుతమైన విన్యాసాలతో, వార్ సీక్వెన్స్ పిల్లలకు ఆనందాన్ని కలిగిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. దర్శకుడు మైఖేల్ డాహెర్తీ పనితీరు యాక్షన్ మూవీస్ చూసే వారికి నచ్చుతుంది.

నటీనటులు ప్రతిభ

నటీనటులు ప్రతిభ

కైలే చాండ్లర్, వెరా ఫర్మిగా, మిల్లే బాబీ బ్రౌన్ నటన బాగుంది. కైలే, వెరా మధ్య, అలాగే మిల్లే బాబీ మధ్య సన్నివేశాలు భావోద్వేగంగా సాగుతాయి. కైలే, వెరా ఎందుకు విడిపోయారనే విషయాన్ని వివరంగా వ్యక్తీకరిస్తే సగటు ప్రేక్షకులకు సినిమా సులభంగా అర్ధమయ్యేందుకు ఆస్కారం ఉండేది.

ఫైనల్‌గా

ఫైనల్‌గా

గాడ్జిల్లా: కింగ్స్ ఆఫ్ మాన్‌స్టర్ చిత్రం టెక్నికల్‌గాను, నిర్మాణ పరమైన విలువలు పుష్కలంగా కనిపిస్తాయి. వేసవి సెలవుల్లో పిల్లలకు వినోదం అందించే చిత్రమని చెప్పవచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లితే పెద్దలకు కూడా ఓ రకమైన అనుభూతికి లోనవ్వడానికి అవకాశం ఉంటుంది.

తెర ముందు, తెర వెనుక

తెర ముందు, తెర వెనుక

నటీనటులు: కైలే చాండ్లర్, వెరా ఫర్మీంగా, మిల్లీ బాబీ బ్రౌన్, బ్రాడ్లే విట్‌ఫోర్డ్ తదితరులు

దర్శకత్వం: మైఖేల్ డాహెర్తీ

నిర్మాతలు: థామస్ టుల్, జాన్ జాష్నీ

కథ: మాక్స్ బారెన్‌స్టెయిన్, మైఖేల్ డాహెర్తీ

మ్యాజిక్: బియర్ మెక్ క్రియరీ

సినిమాటోగ్రఫి: లారెన్స్ షేర్

బ్యానర్: లెజెండరీ పిక్చర్స్

రిలీజ్ డేట్: 2019-05-30

Read more about: godzilla
English summary
Godzilla: King of the Monsters is American monster film directed and co-written by Michael Dougherty. It is a sequel to Godzilla (2014), and is also the 35th film in the Godzilla franchise. The film stars Kyle Chandler, Vera Farmiga, Millie Bobby Brown, Bradley Whitford, Sally Hawkins, Charles Dance, Thomas Middleditch, Aisha Hinds, O'Shea Jackson Jr., David Strathairn, Ken Watanabe, and Zhang Ziyi.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more