అక్షయ్ కుమార్ నటించిన ‘గోల్డ్’ మూవీ రివ్యూ

By Bojja Kumar

Rating:
3.5/5
Star Cast: అక్షయ్ కుమార్, మౌనీ రాయ్, కునాల్ కపూర్, అమిత్ సాధ్, వినత్ కుమార్ సింగ్
Director: రీమా కగ్టి

భారత జాతీయ క్రీడ హాకీ నేపథ్యంలో వచ్చిన మరో హిస్టారికల్ స్ట్పోర్ట్స్ డ్రామా 'గోల్డ్'. అక్షయ్ కుమార్ కోచ్‌గా ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. 200 సంవత్సరాలు ఇండియాను పాలించిన బ్రిటిషర్ల మీద 1948 ఒలంపిక్స్‌లో భారత హాకీ జట్టు గెలుపుతో ప్రతీకారం తీర్చుకున్న వైనాన్ని ఫోకస్ చేస్తూ దేశ భక్తిని పెంపొందించే అంశాలను జోడించి ఆసక్తికర కథనంలో ఈ సినిమాను రూపొందించామని చెబుతున్న మేకర్స్ ఏ మేరకు ప్రేక్షకులను మెప్పించారు అనేది రివ్యూలో చూద్దాం.

 కథ విషయానికొస్తే

కథ విషయానికొస్తే

తపన్ దాస్ (అక్షయ్ కుమార్) బ్రిటిష్ ఇండియా హాకీ జట్టు కోచ్. తన శిక్షణలో జట్టును విజయపథంలో నడిపించి ఒలంపిక్ గోల్డ్ మెడల్ సాధిస్తాడు. బ్రిటిషర్ల హయాంలో పని చేస్తున్నా అపారమైన దేశభక్తి ఉన్న బెంగాళీ బాబు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇండియాకు గోల్డ్ మెడల్ సాధించి పెట్టాలని, విశ్వ వేధికపై త్రివర్ణ పతాకం రెపరెపలాడించాలనేది అతడి డ్రీమ్. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన అనంతరం 1946లో నెక్ట్స్ ఒలంపిక్స్ ప్రకటన వెలువడుతుంది. 1948లో లండన్ కేంద్రంగా జరిగే ఒలంపిక్స్‌లో బ్రిటిష్ గడ్డపై భారత విజయపతాకాన్ని ఎగరవేయాలనే తపనతో రంగంలోకి దిగుతాడు తపన్ దాస్.

దేశ విభజన తర్వాత

దేశ విభజన తర్వాత

అప్పటికీ భారత్, పాకిస్థాన్ కలిసే ఉంటాయి. మెరికల్లాంటి టీంను తయారు చేస్తాడు. ఈ జట్టుకు లాహోర్‌కు చెందిన ఇంతియాజ్ షా కెప్టెన్. అయితే దేశ విభజన తర్వాత తపన్ దాస్ తయారు చేసిన జట్టు ముక్కలవుతుంది. కెప్టెన్ ఇంతియాజ్ షాతో పాటు కొందరు పాకిస్థాన్, మరికొందరు ఆస్ట్రేలియా వెళ్లిపోవాల్సి వస్తుంది. ప్రపంచంలోనే అత్యంత బలమైన ఇండియా జట్టు చీలి పోవడంతో బ్రిటిషర్లు ఈ సారి ఒలంపిక్స్‌లో హాకీ గోల్డ్ తమదే అనే గర్వంతో ఉంటారు. మరి వారి గర్వాన్ని తపన్ దాస్ ఎలా అణగదొక్కాడు, మళ్లీ కొత్త టీంను ఫాం చేసే క్రమంలో ఎన్ని కష్టాలు పడ్డాడు, 1948 లండన్ ఒలంపిక్స్ సమయంలో గోల్డ్ సాధించడానికి ఎలాంటి ఎత్తులు వేశాడు అనేది తెరపై చూడాల్సిందే.

అక్షయ్ కుమార్ పెర్ఫార్మెన్స్

అక్షయ్ కుమార్ పెర్ఫార్మెన్స్

కోచ్ తపన్ దాస్ పాత్రలో అక్షయ్ కుమార్ నటించాడు అనడం కంటే... జీవించాడు అని చెప్పొచ్చు. ముంఖ్యంగా బెంగాళీ బాబు పాత్రలో అతడి వేషధారణ, పెర్ఫార్మెన్స్ సినిమాకే హైలెట్ అయింది. హాకీ అంటే ప్రాణంగా ప్రేమించే వ్యక్తిగా, అవసరం అయితే తన సర్వస్వం అర్పించే పాత్రలో అదరగొట్టాడు. అదే సమయంలో తాగుడుకు బానిసైన సన్నివేశాల్లో సూపర్బ్ అనిపించాడు. ఈ పాత్రలో అక్షయ కుమార్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేం అనే స్థాయిలో పెర్ఫార్మెన్స్ ఇరగదీశాడు.

ఇతర పాత్రల్లో

ఇతర పాత్రల్లో

హాకీ ప్లేయర్స్ పాత్రల్లో అమిత్ సాధ్, వినీత్ కుమార్ సింగ్, సన్నీ కౌశల్, కునాల్ కపూర్ తదితరులు ఆకట్టుకున్నారు. అక్షయ్ కుమార్ భార్య పాత్రలో మౌనీ రాయ్ మెప్పించింది. అక్షయ్-మౌనీరాయ్ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

టెక్నికల్ అంశాల పరంగా

టెక్నికల్ అంశాల పరంగా

అల్వరో గుతీర్రెజ్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. సినిమా 1940ల్లోని బ్యాక్ బ్రాప్‌ను తన కెమెరాలో అద్భుతంగా చూపించాడు. సచిన్ జిగర్ అందించి సంగీతం, బ్యాగ్రౌండ్ సన్నివేశాలను మరింత ఎలివేట్ చేసే విధంగా ఉంది. రాజేష్ దేవ్ రాజ్ అందించిన స్క్రీన్ ప్లే ఎక్కడా కూడా సినిమా బోర్ కొట్టండా ప్రేక్షకులు ఆసక్తిగా చూసేలా తోడ్పడింది. ఎడిటింగ్ కూడా ఎలాంటి సాగదీత లేకుండా షార్ఫ్‌గా ఉంది.

 రీమా కగ్టి దర్శకత్వం

రీమా కగ్టి దర్శకత్వం

ఈ చిత్రానికి స్వయంగా కథ రాసుకోవడంతో పాటు దర్శకత్వం వహించింది ఒక లేడీ డైరెక్టర్. గతంలో హనీమూన్ ట్రావెల్స్ ప్రై.లి, తలాష్ చిత్రాలను తెరకెక్కించి రీమా కగ్టి కాస్త గ్యాప్ తర్వాత ‘గోల్డ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచక్చారు. దర్శకత్వం పరంగా ఆమెకు ఫుల్ మార్కులు వేయొచ్చు. సినిమాను నడిపించిన విధానం, థియేటర్లో సినిమా చూస్తున్న ప్రేక్షకుడు సినిమాలోని ఎమోషన్లకు కనెక్ట్ అయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. క్లైమాక్స్‌లో ఇండియా గెలుపు అనంతరం అందరూ సీట్ల నుండి లేచి అప్లాజ్ ఇచ్చారంటే.... కథను ఆమె ఎంత కనెక్టివ్‌గా రన్ చేశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఆ సన్నివేశాలు హైలెట్

ఆ సన్నివేశాలు హైలెట్

దేశ విభజన తర్వాత ఒకే జట్టులోని ప్లేయర్లు విడిపోవడం, కొందరు పాకిస్థాన్... కొందరు హిందూస్థాన్ తరుపున ఆడాల్సిన పరిస్థితుల్లో ఆటగాళ్లు పడేవేదనను అద్భుతంగా చూపించారు. ఒలంపిక్స్ జరిగే సమయంలో ముందే ఒడిపోయి పక్కన కూర్చున్న పాకిస్థాన్ జట్టు ఫైనల్ పోరులో ఇండియాకు సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ సన్నివేశాలను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించారు.

జట్టులో పాలిటిక్స్ గురించి..

జట్టులో పాలిటిక్స్ గురించి..

జట్టు మేనేజ్మెంట్లలో కొందరు తమ స్వార్థం కోసం రాజకీయాలు చేస్తూ ఆటగాళ్లను, కోచ్‌లను ఇబ్బందలకు గురి చేసే వారు ఉంటారు. అలాంటి కొన్ని సందర్భాలను సైతం ఫోకస్ చేసిన తీరు బావుంది.

ప్లస్ పాయింట్స్

ప్లస్ పాయింట్స్

  • అక్షయ్ కుమార్ పెర్ఫార్మెన్స్
  • రీమా కగ్టి దర్శకత్వం
  • ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా కథ నడిపించిన తీరు
  • సంగీతం, సినిమాటోగ్రఫీ
  • అంత పెద్ద మైనస్ పాయింట్స్ అయితే ఏమీ కనిపించలేదు.

    విశ్లేషణ

    విశ్లేషణ

    200 సంవత్సరాల పాటు భారతీయుల నెత్తినెక్కి పాలించిన బ్రిటిషర్లు వెళుతూ వెళుతూ ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేసి వెళ్లారు. దేశాన్ని విభజించి, అన్నదమ్ముల్లాంటి హిందుస్థాన్-పాకిస్థాన్ మధ్య మతం చిచ్చు పెట్టి, విద్వేషాలు రెచ్చగొట్టి, అపారమైన మన దేశ సంపద కొల్లగొట్టి వెళ్లారు. ఒలంపిక్స్ క్రీడల రూపంలో వారిపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం దొరికినపుడు తపన్ దాస్ ఎంత తపన పడ్డాడో ప్రేక్షకుడు సైతం అంతే తపన పడేలా సినిమాను నడిపించిన తీరు అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరిలోనూ దేశంపై మరింత ప్రేమ పెంచేలా చిత్రాన్ని తెరెకెక్కించిన విధానం బావుంది. యునిటీగా పని చేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి, ఒంటరిగా వెళితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనే అంశం హాకీ గేమ్ రూపంలో వివరించిన తీరు ఆకట్టుకుంది.

     చివరగా

    చివరగా

    మీకు హాకీ గురించి తెలియక పోయినా గోల్డ్ సినిమాను ఇష్టపడతారు. తపన్ దాస్ పాత్రలో అక్షయ్ కుమార్ మెప్పిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాలో ఆటకంటే దేశభక్తికి సంబంధించిన అంశాలను ఎక్కువ ఫోకస్ చేశారు.

     నటీనటులు, టెక్నీషియన్స్

    నటీనటులు, టెక్నీషియన్స్

    తారాగణం: అక్షయ్ కుమార్, మౌనీ రాయ్, కునాల్ కపూర్, అమిత్ సాధ్, వినత్ కుమార్ సింగ్, సన్నీ కౌశల్, జితిన్ శర్మ, నిఖితా దత్తా

    దర్శకత్వం: రీమ కగ్టి
    నిర్మాణం: రితేష్ సిధ్వానీ, పర్హాన్ అక్తర్
    సినిమాటోగ్రఫీ: అల్వరో గుతీర్రెజ్
    సంగీతం: సచిన్-జిగర్
    ఎడిటింగ్: ఆనంద్ సుబయ
    విడుదల తేదీ: ఆగస్టు 15, 2018

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X