గురి తప్పిన గోలీ...(గోలీమార్) రివ్యూ

By Sindhu
Golimaar
Rating
-జోశ్యల సూర్య ప్రకాష్
చిత్రం: గోలీమార్
నటీనటులు: గోపీచంద్, ప్రియమణి, రోజా, నాజర్, కెల్లీ, ఎమ్ ఎస్ నారాయణ, జీవా తదితరులు.
బ్యానర్: శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్
యాక్షన్: విజయ్
ఆర్ట్: చిన్నా
కొరియోగ్రఫి: శ్యామ్.కె.నాయుడు
ఎడిటింగ్: మార్తాండ్.కె.వెంకటేష్
సంగీతం: చక్రి
సమర్పణ: బెల్లంకొండ రామ శ్రీనివాస్
నిర్మాత: బెల్లంకొండ సురేష్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరీ జగన్నాధ్
రిలీజ్ డేట్: మే 27, 2010

ఎనకౌంటర్ స్పెషలిస్టు కథలు తెలుగు తెరకు అచ్చివచ్చేటట్లు లేదు. మొన్న వెంకటేష్ 'ఘర్షణ', నిన్న జగపతి బాబు 'సిద్దం', ఈ రోజు గోపిచంద్ 'గోలీమార్' చిత్రాల ఫలితాలే దీనికి ప్రబల సాక్ష్యం. ఇక 'గోలీమార్' లో పూరీ బలం అయిన క్యారెక్టైరేజన్, కామెడీ, డైలాగులు ఎందుకనో ఈ సారి కట్టకట్టుకుని సమ్మె చేసాయి. దీనికి తోడు ఊపు ఇస్తాయనుకున్న పాటలు, హీరోయిన్ ట్రాక్ కూడా అంతంతమాత్రమై ఇబ్బందిపెట్టాయి. వీటిన్నటితో హీరో...తెరపై చేసే ఎనకౌంటర్స్ గురి తామే అన్నట్లు ప్రేక్షకులుకు విలవిల్లాడిపోయారు. దాంతో మంచి ఓపినింగ్స్ తెచ్చుకున్నా చిత్రం నిలబడేటట్లు కనపడటం లేదు.

పోలీస్ అవ్వాలనే కోరిక విపరీతంగా ఉన్న గంగారామ్(గోపీచంద్) ఓ అనాధ. హోటల్ లో లేబర్ గా పని చేస్తూ తన కల నిజం చేసుకుంటాడు. గంగారామ్ తెగువ, ధైర్యం చూసిన పై అధికారి (నాజర్) అతన్ని ఎనకౌంటర్ స్పెషలిస్ట్ గా ప్రమోషన్ ఇస్తాడు. ఇక సిటీని ఖలీధ్, తల్వా అనే ఇద్దరు మాఫియా డాన్స్ పాలిస్తూంటారు. గంగా...డ్యూటిలోకి దిగిన వెంటనే ఆ రెండు గ్యాంగ్ లను ఏరివేయటం ప్రారంభిస్తాడు. దాంతో అతనికి మీడియా మంచి పబ్లిసిటీ ఇస్తుంది. అది డిపార్టమెంట్ లో కొందరికి కన్నెర్రగా ఉంటుంది. వాళ్ళు అతన్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు. అలాగే మగాళ్ళంటే అసహ్యపడే పవిత్ర(ప్రియమణి), ఆమె తల్లి(రోజా)కీ గంగారామ్ కీ సంభందం ఏమిటీ అన్నది తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.

ఇక హీరో ట్రాక్ సహజంగా అనిపించేలా తెరపై సీన్స్ జరుగుతూంటే హీరోయిన్ ట్రాక్ దానికి భిన్నంగా మగాళ్ళంటే ఇష్టపడను అంటూ తిరగుతూ నవ్వులు పాలు అవుతూంటుంది. నవ్వులు కోసమే ఆ పాత్ర పెట్టి ఉంటే ఓకే. అలాగే సినిమా ప్రారంభం నుంచీ విలన్ ని దాచినట్లుగా అలీ క్యారెక్టర్ ని దాచి రివిల్ చేయటం అంత అవసరం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే అలీ వచ్చి ఊడబెరికిందేమీ లేదు.(నా ఉద్దేశ్యం కథకు గానీ, నవ్వించటానికి కానీ ఉపయోగపడలేదని). పాటల్లో ఓ రెండు బాగున్నాయి. పూరీ డైలాగులు ఇంతకుముందులా పేలలేదు. అనుభవం మీద రాసిన డైలాగులు కావటంతో వెలికి కనపడలేదంతే. ఇక మిగతా విభాగాల్లో ఎడిటింగ్ బాగుంది. ఇక గోపీచంద్ బాగానే చేసినా అన్ని సినిమాల్లోనూ అవే ఎక్సప్రెషన్స్ అన్న ఫీలింగ్ వచ్చేస్తోంది. దర్శకుడుగా పూరి మరింత వర్క్ చేస్తే బావుండననిపిస్తుంది.

ఏదైమైనా పూరీ వరస ఫెయిల్యూర్స్ చూస్తూంటే ప్రేక్షకులకీ, ఆయన ఆలోచనలకీ మధ్య దూరం బాగా పెరిగినట్లు అనిపిస్తోంది. ఇక గోలీమార్ చిత్రం గోపీచంద్ అభిమానులు, యాక్షన్ చిత్రాభిమానులు మాత్రమే ఫరవాలేదనిపిస్తుంది. రెగ్యులర్ ప్రేక్షకులకు కాస్త కష్టమే. అలాగే వినోదం తక్కువ, హింస ఎక్కువ నిండి ఉంది కాబట్టి ఫ్యామిలీలను ఎక్సపెక్ట్ చేయటం అనవసరం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X