Good Bad Ugly Review: గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: అజిత్ కుమార్, త్రిషా కృష్ణన్, అర్జున్ దాస్, సునీల్, ప్రసన్న, జాకీ ష్రాఫ్, ప్రియా ప్రకాశ్ వారియర్, సిమ్రాన్, షైన్ టామ్ ఛాకో తదితరులు
రచన, దర్శకత్వం: అధిక్ రవిచంద్రన్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవి శంకర్
సినిమాటోగ్రఫి: అభినందన్ రామనుజం
మ్యూజిక్: జీవీ ప్రకాశ్ కుమార్
ఎడిటింగ్: విజయ్ వేలుకుట్టి
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
రిలీజ్ డేట్: 2025-04-10

ఏకే (అజిత్ కుమార్) రెడ్ డ్రాగన్ అనే పేరుతో నిర్వహించే మాఫియా సామ్రాజ్యానికి అధిపతి. తన కుటుంబం కోసం మాఫియా కార్యకలాపాలను వదిలిపెట్టి జైలుకు వెళ్తాడు. దాదాపు 18 సంవత్సరాలు జైలు జీవితం గడుపుతాడు. తన కుమారుడికి తన గత జీవితాన్ని తెలియకుండా దాచి పెడుతాడు. తన కొడుకు విహాన్ (కార్తీకేయ దేవ్) గ్రాడ్యుయేషన్ ఫంక్షన్‌కు వస్తానని మాటిస్తాడు. కానీ జైలులో ఉండటం కారణంగా రాలేకపోతాడు. కానీ జైలు నుంచి రిలీజ్ అయ్యే సమయానికి విహాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైలు పాలైతాడు. ఆపై తన ప్రియురాలు (ప్రియా ప్రకాశ్ వారియర్) హత్యానేరం కూడా తనపై పడుతుంది.

Good Bad Ugly Tamil Movie Review

ఏకే తన నేర ప్రపంచాన్ని ఎలా విస్తరించాడు? ముంబైకి వెళ్లిన ఏకేకు అక్కడి మాఫియా నుంచి ఎలాంటి సంబంధాలు ఏర్పడ్డాయి? సాధారణ యువకుడు ఇంటర్నేషన్ మాఫియాను ఎలా శాసించాడు? తన భార్య రమ్య (త్రిషా కృష్ణన్)తో విభేదాలకు కారణం ఏమిటి? ఏకే కుమారుడు విహాన్‌ను డ్రగ్స్ కేసులో ఎవరు ఇరికించారు? జానీ, జామీ (అర్జున్ దాస్)కు ఏకేకు ఉన్న వైరుధ్యం ఏమిటి? డ్రగ్స్, మర్డర్ కేసులో ఇరుకొన్న తన కుమారుడిని ఏకే ఎలా రక్షించుకొన్నాడు? జానీ, జామీలకు ఎలాంటి గుణపాఠం నేర్పాడు అనే ప్రశ్నలకు సమాధానమే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా కథ.

దర్శకుడు అధిక్ రవిచంద్రన్ రాసుకొన్న పాయింట్‌లో ఎలాంటి కొత్తదనం లేదు. కానీ కథను చెప్పడంలో కొత్తదనం చూపించాడు. అజిత్ స్టార్‌డమ్‌ను ఊపయోగించుకొని ఎలివేషన్స్, ఫ్యాన్ మూమెంట్స్‌తో సినిమాను క్రేజీగా తెరకెక్కించాడు. అజిత్ వింటేజ్ లుక్‌తో ఫ్యాన్స్‌కు పండుగ వాతావరణాన్ని తెచ్చాడు. అర్జున్ దాస్, జాకీ ష్రాఫ్, త్రిష, సిమ్రాన్ క్యారెక్టర్లను రాసుకొన్న విధానం కొత్తగా అనిపించింది. కేవలం అజిత్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని చేసిన సినిమాగా చెప్పుకోవచ్చు.

ఇక అజిత్ కుమార్, త్రిష యాక్టింగ్, పెర్ఫార్మెన్స్ గురించి కొత్తగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు. కానీ ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాలో హైలెట్‌గా కనిపిస్తాయి. కుమారుడి కోసం అజిత్, త్రిషా చెందే ఆవేదన ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా చేశారు. ఈ సినిమాలో అర్జున్ దాస్, కార్తీకేయ దేవ్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అర్జున్ దాస్ డబుల్ రోల్‌లో కనిపించాడు. కానీ ఆ పాత్రల్లో ఓ ట్విస్టు ఆసక్తిని రేపుతుంది. మాపియా డాన్ కొడుకుగా కార్తీకేయ దేవ్ మరోసారి మంచి నటనను పలికించాడు. సిమ్రాన్ స్పెషల్ అప్పీరియెన్స్ అజిత్ ఫ్యాన్స్‌తో కేక పెట్టిస్తుంది. జాకీ ష్రాఫ్, సునీల్, రెడ్ కింగ్స్‌లే తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

ఇక సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. జీవీ ప్రకాశ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి జోష్ పుట్టిస్తుంది. అజిత్ కుమార్ సీన్ల ఎలివేషన్స్‌కు ఇచ్చిన బీజీఎం అభిమానులు విజిల్స్ వేసేలా చేస్తుంది. ఇక అభినందన్ రామానుజం రెట్రో ఎన్విరాన్‌మెంట్‌ను తెర మీద చక్కగా చూపించాడు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. అజిత్ ఫ్యాన్స్‌కు మంచి గిఫ్ట్ లాంటి సినిమాను అందించారనే చెప్పాలి.

యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, అజిత్ వింటేజ్ లుక్స్ కలిపి రూపొందించిన సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. కొత్తదనం కోసం ఆశించి వెళ్లడానికి స్కోప్ లేని సినిమా. కేవలం రెండున్నర గంటలు మంచి విందు భోజనం చేసిన ఫీలింగ్ ఉంటుంది. బయటకు వచ్చి బాగుందా? బాగాలేదా? అనే డిస్కషన్ పెట్టడానికి స్కోప్ ఉండదు. సినిమా చూసినంత సేపు ఎలివేషన్స్, బిల్డప్స్ ఫ్యాన్ మూమెంట్స్ అందిస్తాయి. అజిత్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే మంచి అనుభూతితో బయటకు రావడం గ్యారెంటీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X