Good Bad Ugly Twitter Review: గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ట్విట్టర్ రివ్యూ

తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్, త్రిషా కృష్ణన్ జంటగా నటించిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. యాక్షన్ కామెడీ మూవీగా రూపొందిన ఈ సినిమాకు తమిళ దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమాపై ఫ్యాన్స్, నెటిజన్లు సోషల్ మీడియాలో వెల్లడించిన అభిప్రాయాలు, రివ్యూల వివరాల్లోకి వెళితే..

మైత్రీ మూవీ మేకర్స్ తమిళ సినిమా రంగంలోకి అడుగుపెట్టి నిర్మించిన తొలి చిత్రంలో ప్రియా ప్రకాశ్ వారియరన్, ప్రభు, జాకీ ష్రాఫ్, షైన్ టామ్ చాకో, అర్జున్ దాస్, ప్రసన్న, సునీల్, ఉషా ఉతప్, రాహుల్ దేవ్, రెడిన్ కింగ్స్‌ స్లే, యోగిబాబు, సిమ్రాన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫి, విజయ్ వేలుకుట్టి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

Good Bad Ugly Tamil Movie Twitter Review

గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా గురించి ఓ నెటిజన్ తన రివ్యూను రాశారు. ఫస్టాఫ్ సూపర్‌గా ఉంది. అజిత్ ఇంట్రో వేరే లెవెల్. గాడ్ బ్లెస్ యూ పాటతో థియేటర్ దద్దరిల్లింది. జీవీ ప్రకాశ్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్‌గా ఉంది. యాక్టర్ విశాల్, ఎస్‌జే సూర్య అతిథి పాత్రలు స్క్రీన్ రాగానే ఆడియెన్స్ ఉత్సాహం కొండను తాకతుుంది. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయింది. సెకండాఫ్ కోసం వెయిటింగ్ చేస్తున్నాను అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

గుడ్ బ్యాడ్ అగ్లీ ఫస్టాఫ్.. ఫ్యాన్స్‌కు పండగలాంటి సినిమా. అజిత్ కెరీర్‌లో బెస్ట్ ఇంట్రడక్షన్, టైటిల్ కార్డు ఉంది. పాటలతోపాటు అర్జున్ దాస్ యాక్టింగ్ అదిరిపోయింది. ఈ సినిమాలోని సన్నివేశాలు చాలా స్టైలిష్‌గా ఉన్నాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ గ్రిప్పింగ్‌గా ఉంది. ఇంటర్వెల్ సీన్లకు జీవీ ప్రకాశ్ ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. అజిత్ వింటేజ్ మళ్లీ కనిపించింది. స్క్రీన్ ప్రజెన్స్, లుక్ బాగుంది. దర్శకుడు అధిక్ ఈ సినిమాను ఎక్ట్రార్డినరీగా తీశాడు. ఇక సెకండాఫ్‌పైనే ఈ సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

అజిత్ కుమార్ సినిమా సెలబ్రేషన్‌లా ఉంది. 30 ఏళ్ల కెరీర్‌లో అదిరిపోయే సినిమా. ఫ్యాన్ బాయ్ ప్రజెంటేషన్ బాగుంది. ఈ సినిమా మెగా బ్లాక్ బస్టర్. ఈ సినిమా నిరాశపరచదు. నాకు బాగా నచ్చింది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా మాస్ ఎంటర్‌టైనర్. కొన్ని కొన్ని పార్ట్స్‌లో సినిమా బాగుంది. దర్శకుడు తన ఫ్యాన్ బాయ్ మూమెంట్స్‌తో అజిత్‌ను బాగా చూపించాడు. ఫస్టాఫ్ అదిరిపోయింది. సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌తో సినిమాకు పాజిటివ్‌గా మారింది. అయితే చివరి వరకు కథను సాగదీసినట్టు ఉంది. వింటేజ్ లుక్‌లో అజిత్‌ కనిపించడం ఈ సినిమాకు వర్కవుట్ అయింది. ఈ సినిమాకు నా రేటింగ్ 2.75 అని ఓ రివ్యూవర్ కామెంట్ చేశాడు.

ఈ దశాబ్దంలో ఇలాంటి ఫ్యాన్ బాయ్ సంభవాన్ని చూడలేదు. అజిత్‌పై దర్శకుడికి ఉండే పిచ్చి ప్రేమ ఈ సినిమాలో కనిపించింది. ఈ సినిమా అజిత్ కెరీర్‌లో ఆల్ టైమ్ హిట్‌గా నిలుస్తుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా రిలీజ్ సందర్భంగా అభిమానుల ఉత్సాహం కొండను తాకింది. తమిళనాడులో థియేటర్ల వద్ద అభిమానులు పండగ వాతవరణాన్ని తీసుకొచ్చారు. కోలీవుడ్ కింగ్, నంబర్ వన్, చరిత్ర, కోలీవుడ్ గాడ్, ఓజీ అన్నీ అజిత్ మాత్రమే అని ట్వీట్ చేశారు. చెన్నైలోని థియేటర్ వద్ద భారీగా కటౌట్, థియేటర్ అలకరించి పండుగ వాతావరణాన్ని తలపించారు.

గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా రిలీజ్ సందర్భంగా బుధవారం రాత్రి 7 గంటల నుంచే తమిళనాడులో థియేటర్ల వద్ద అభిమానులు క్రేజీగా ఉత్సవాలు జరిపారు. చెన్నైలోని థియేటర్ వద్ద డీజేను ఏర్పాటు చేసి అభిమానులు డ్యాన్సులతో హోరెత్తించారు. ఈ వీడియోను మీరే చూడండి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X