twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Good Luck Sakhi Movie Review బ్యాడ్ లక్ కీర్తీ సురేష్.. అత్యంత పేలవంగా!

    |

    Rating:
    1.5/5

    నటీనటులు: కీర్తీ సురేష్, జగపతి బాబు, ఆది పినిశెట్టి, రాహుల్ రామకృష్ణ, రఘుబాబు తదితరులు
    దర్శకత్వం: నగేశ్ కుకునూర్
    నిర్మాత: సుధీర్ చంద్ర పదిరి
    సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
    సినిమాటోగ్రఫి: చిరంతన్ దాస్
    ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్

    మిలటరి నుంచి రిటైర్ అయిన కల్నల్ (జగపతిబాబు) ఓ ఉన్నత లక్ష్యంతో తన గ్రామానికి చేరుకొంటారు. క్రీడల్లో దేశ ప్రతిష్టను పెంచే విధంగా గ్రామీణ ప్రాంతం నుంచి మంచి షూటర్‌ను తయారు చేయాలనే సంకల్పంతో ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో గురి చూసి కొట్టడంలో మంచి నేర్పరి సఖి (కీర్తీ సురేష్)ను గోళి రాజు (ఆది పినిశెట్టి) కల్నల్‌కు పరిచయం చేస్తాడు. షూటింగులో ఎలాంటి ప్రావీణ్యం లేని సఖిని దేశంలోనే టాప్ షూటర్‌గా తయారు చేస్తాడు.

    అయితే సఖిని షూటర్‌గా తయారు చేయడంలో కల్నల్ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు. అలాగే తన ప్రత్యర్థుల ఎత్తుగడలను, సమస్యలను సఖి ఎలా ఎదురించింది? కల్నల్‌పై ఆకర్షణకు గురైన సఖికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. కల్నల్, సఖి మధ్య భావోద్వేగమైన అంశాలు ఆకట్టుకొన్నాయా? గోళి రాజు, సూరి (రాహుల్ రామకృష్ణ) పాత్రలు ఎలా ఉన్నాయి? ఓ సామాన్య యువతి దేశంలోని టాప్ షూటర్‌గా ఎలా ఎదిగింది అనే ప్రశ్నలకు సమాధానమే గుడ్ లక్ సఖి సినిమా.

    Good Luck Sakhi Movie Review and Rating: Keerthy Sureshs Unimpressive Sports drama

    గుడ్ లక్ సఖి కథ, కథలోని ట్విస్టులు చూస్తే గతంలో వెంకటేష్ నటించిన గురు సినిమా గుర్తుకు రాక మానదు. ఆ సినిమా బాక్సింగ్ క్రీడ అయితే.. ఈ సినిమాలో షూటింగ్ ప్రధాన అంశం. మిగితా అంశాల్లో దాదాపు సేమ్ టూ సేమ్. అయితే కథ, కథనాల్లో పసలేకపోవడం వల్ల ఈ సినిమా పేలవంగా సాగుతుంది. పాత్రల్లో ఇంటెన్సిటి లేకపోవడం, కథలో బలం లేకపోయినా కనీసం సన్నివేశాలు ఎమోషనల్‌గా ఉంటే బాగుండనే ఫీలింగ్ కలుగుతుంది.

    అయితే మహానటి లాంటి సినిమాల్లో నటించిన కీర్తీ సురేష్ గుడ్ లక్ సఖి ఒప్పుకోవడంలో ఎలాంటి లాజిక్ కనిపించదు. ఓ దశలో ఈ కథలో ఏం చూసి నటించిందనే ప్రశ్న వెంటాడుతూనే ఉంటుంది. సఖి పాత్రలో ఎలాంటి కొత్తదనం కనిపించదు. పూర్తి నాసిరకమైన పాత్రను భుజాన వేసుకొని నానా తంటాలు పడినట్టు కనిపిస్తుంది.

    ఇక జగపతి బాబుకు ఇలాంటి పాత్ర చేయడం కొత్తే కావొచ్చు. కానీ ఇలాంటి షేడ్స్ ఉన్న పాత్రలు గతంలో ఎన్నో చేశారని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో వైవిధ్యం చూపుతున్న జగపతి బాబు నుంచి కాస్త ఎక్కువగా ఆశిస్తే అభిమానులు నిరాశ పడటం ఖాయం. ఇక ఆది పినిశెట్టి, రాహుల్ రామకృష్ణ పాత్రలు పెద్దగా ఆకట్టుకొనేలా కనిపించావు.

    హైదరాబాద్ బ్లూస్, ఇక్బాల్ లాంటి సినిమాలు చేసిన నాగేశ్ కుకునూర్ దర్శకత్వంలో గుడ్ లక్ సఖి వస్తుందంటే.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉంటాయి. కానీ గతంలో ఆయన తీసిన సినిమాలకు ఏ మాత్రం మ్యాచ్ కానీ కథతో రావడం ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ స్టోరిలో ఏ మూలన వెతికినా పస ఉన్నట్టు కనిపించదు. పూర్తిగా నాసిరకం, పేలవమైన సినిమా తీశాడనే ఫీలింగ్ కలుగుతుంది. సీన్లు చాలా రొటీన్‌గా, రెగ్యులర్‌గా ఉంటాయి. సినిమాలో సన్నివేశాలు పట్టి పట్టి లాగదీసినట్టు అనిపిస్తాయి. ఏ స్థాయిలోను ఈ సినిమాలో డ్రామా ఎమోషనల్‌గా లేకపోవడంతో సినిమా ఆకట్టుకొలేకపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది. కథ, కథనాల్లో పసలేకపోవడం వల్ల సాంకేతిక విభాగాలు కూడా రాణించలేకపోయాయని చెప్పవచ్చు.

    ఇక గుడ్ లక్ సినిమా గురించి ఫైనల్‌గా చెప్పాలంటే.. ప్రస్తుతం పరిస్థితుల్లో థియేటర్‌కు వెళ్లి రిస్క్ తీసుకోవడమే అవుతుంది. కీర్తీ సురేష్ కోసం ఒకవేళ రిస్క్ తీసుకొందామని అనిపించినా.. పూర్తిగా ఈ సినిమా నిరాశనే పంచుతుంది. కాబట్టి ఈ సినిమాకు ఎంత దూరం ఉంటే అంత మంచిది. కాబట్టి ఈ సినిమా కీర్తీ సురేష్‌కు బ్యాడ్ లక్ అనే ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు.

    పాజిటివ్ పాయింట్స్
    కీర్తీ సురేష్

    నెగిటివ్ పాయింట్స్
    పేలవమైన కథ, నాసిరకమైన కథనం
    దారుణంగా డైరెక్షన్
    బలహీనమైన పాత్రలు
    కథలో భావోద్వేగం లోపించడం

    English summary
    Popular Director Nagesh Kukunoor and Keerthy Suresh joins hands for Good Luck Sakhi. This movie hits the screen on January 28th. Here is the exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X