Goodbye movie review అమితాబ్‌తో రష్మిక మందన్న పోటాపోటీగా.. మూవీ ఎలా ఉందంటే?

Rating:
2.5/5
Star Cast: అమితాబ్ బచ్చన్, రష్మిక మందన్న, నీనా గుప్తా, ఆశీష్ విద్యార్థి, సునీల్ గ్రోవర్
Director: వికాస్ బెహల్

నటీనటులు: అమితాబ్ బచ్చన్, రష్మిక మందన్న, నీనా గుప్తా, ఆశీష్ విద్యార్థి, సునీల్ గ్రోవర్, ఎల్లీ అవ్రామ్ తదితరులు
రచన, దర్శకత్వం: వికాస్ బెహల్
నిర్మాతలు: శోభా కపూర్, ఏక్తా కపూర్, విరాజ్ సావంత్, వికాస్ బెహల్
సినిమాటోగ్రాఫర్: సుధాకర్ రెడ్డి ఎక్కంటి
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
మ్యూజిక్: అమిత్ త్రివేది
బ్యానర్: గుడ్ కో, బాలాజీ మోషన్ పిక్చర్స్, సరస్వతి ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్ డేట్: 2022-10-07

గుడ్ బై కథ ఏమిటంటే?

గుడ్ బై కథ ఏమిటంటే?

ఆధునిక, స్వతంత్ర భావాలు కలిగిన తారా భల్లా (రష్మిక మందన్న) యువ లాయర్. తన కెరీర్‌లో కోర్టులో తొలి కేసు గెలిచిన ఆనందంలో పబ్‌లో పార్టీలో మునిగి తేలుతుండగా.. తండ్రి హరీష్ భల్లా (అమితాబ్ బచ్చన్) నుంచి పలుమార్లు ఫోన్ కాల్స్‌ వచ్చినా అటెండ్ చేయలేని పరిస్థితుల్లో ఉంటుంది. మరుసటి ఉదయం పార్టీ మత్తు నుంచి కోలుకొన్న తర్వాత తన తల్లి మరణించారనే విషయం తారాకు తెలుస్తుంది.

గుడ్ బై సినిమాను నడిపించే అంశాలు

గుడ్ బై సినిమాను నడిపించే అంశాలు

తండ్రి హరీష్ భల్లా నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ ఎందుకు రిసీవ్ చేసుకోలేదు. తన కుటుంబంతో తారకు ఎందుకు విభేదాలు ఉంటాయి. తల్లి మరణం తర్వాత ఫ్యామిలీలో చోటుచేసుకొన్న సంఘటనలు ఏమిటి? హిందూ సంప్రదాయంలో మరణం తర్వాత జరిగే ఆచారాలపై తారా ఎందుకు విరక్తిగా ఉంటుంది? తండ్రితో తారకు ఉన్న విభేదాలు తొలిగిపోయాయా? తార ఇద్దరు సోదరుల పరిస్థితి ఏమిటి? భార్య వియోగంతో బాధపడే హర్ష భల్లాకు కుటుంబ సభ్యుల నుంచి ఎదురైన సమస్యలు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే గుడ్‌బై సినిమా కథ.

ఫస్టాఫ్‌లో అంత్యక్రియల తంతు బోరింగ్

ఫస్టాఫ్‌లో అంత్యక్రియల తంతు బోరింగ్

గుడ్‌బై చిత్రం రష్మిక మందన్న (తార) పబ్‌లో పీకల్లోతు పార్టీలో మునిగి చిందులేసే మంచి ఎనర్జిటిక్ సాంగ్‌తో కథ మొదలవుతుంది. దర్శకుడు వికాస్ బెహల్ ఆలస్యం చేయకుండా అసలు కథలోకి తీసుకెళ్లడంతో సినిమా చాలా ఎమోషనల్ నోట్‌తో ముందుకు వెళ్తుంది. ఇంటికి పెద్ద దిక్కుగా ఉండే వ్యక్తి మరణం తర్వాత ఎమోషన్స్, రకరకాల సంప్రదాయాలపరంగా ఉండే విభేదాలు కాస్త ఆలోచింపచేసేలా ఉంటాయి. అదే సమయంలో పెదవిపై నవ్వు తెప్పించే హ్యుమర్ కూడా ఉంటుంది. అయితే ఒకే నోట్‌తో కథ సాగడం, చాలా నిదానంగా కథ ముందుకెళ్తడం నేటితరం ప్రేక్షకులకు బోరింగ్‌గా ఉంటుంది.

సెకండాఫ్‌లో కొన్ని ఎమోషనల్ సీన్లతో

సెకండాఫ్‌లో కొన్ని ఎమోషనల్ సీన్లతో

ఇక సెకండాఫ్‌లో తల్లి మరణం తర్వాత అధునిక భావాలు ఉన్న కొడుకులు, కూతురు వ్యవహరించే తీరు.. వారిని చూసి తండ్రి పడే ఆవేదన లాంటి అంశాలను గుండెను పిండేసేలా ఉంటాయి. నేటి సమాజంలో ఇలాంటి సంఘటనలు చాలా కనిపిస్తుంటాయి. ఓ కుటుంబంలో విషాదం, విషాదం ముందు.. వెనుక వినోదం అలాంటి ఎమోషనల్ అంశాలు కనిపిస్తాయి. ఇలాంటి అంశాలు రెగ్యులర్ ఆడియెన్స్‌‌కి నచ్చుతాయా అనేది ఓ పెద్ద ప్రశ్న. పాత్ర మధ్య ఎమోషన్స ఆధారంగా సినిమా చాలా నెమ్మదిగా సాగిపోతుంది. అయితే మంచి మెసేజ్‌తో ఫీల్‌గుడ్‌గా సినిమా ముగుస్తుంది.

అమితాబ్ మరోసారి ఎమోషన్ పాత్రతో

అమితాబ్ మరోసారి ఎమోషన్ పాత్రతో

హరీష్ భల్లాగా తన వయసుకు తగిన పాత్రలో అమితాబ్ బచ్చన్ ఒదిగిపోయారు. రకరకాల ఎమోషన్స్‌ను బిగ్ బీ అలవోకగా పండించారు. హరీష్ పాత్ర చుట్టు ఉండే పాత్రలు, వాటి బిహేవియర్‌కు తగినట్టుగా అద్బుతమైన ఫెర్ఫార్మెన్స్‌తో అమితాబ్ ఆకట్టుకొంటాడు. అమితాబ్‌ను సూపర్ స్టార్ ఎందుకంటారనేది హరీష్ పాత్ర ఓ చిన్న ఉదాహరణగా కనిపిస్తుంది. నీనా గుప్తా చుట్టూ కథ నడిచినా.. ఆమె ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ లేకుండా పోయింది. పూజారీగా సునీల్ గ్రోవర్ కనిపించేది కాసేపైనా కామెడీని అందించే ప్రయత్నం చేశాడు.

రష్మిక మందన్న బాలీవుడ్ ఎంట్రీ

రష్మిక మందన్న బాలీవుడ్ ఎంట్రీ


ఆధునిక భావాలు ఉన్న యువతిగా, లాయర్‌గా, హిందూ సంప్రదాయాల వెనుక బలమైన సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయని నమ్మే తార పాత్రలో రష్మిక మందన్న ఒదిగిపోయారు. తల్లిదండ్రులను విభేదించి.. సహజీవనం చేసే ఆధునిక భావాలు ఉన్న యువతిగా మంచి ఫెర్ఫార్మెన్స్ చూపించింది. రకరకాల భావోద్వేగాలను తన కళ్లతోనే పలికిచింది. పీపీ సీంగ్ పాత్రలో ఆశీస్ విద్యార్థి ఓ చాదస్తం ఉన్న పాత్రలో కనిపించాడు. ఆ పాత్ర బిహేవియర్ ద్వారా కొంత కామెడీని పండించాడు. మిగితా పాత్రల్లో కనిపించిన వారు వారి పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక విభాగాల పనితీరు..

సాంకేతిక విభాగాల పనితీరు..

గుడ్‌బై చిత్రానికి సుధాకర్ రెడ్డి ఎక్కంటి అందించిన సినిమాటోగ్రఫి స్పెషల్ ఎట్రాక్షన్. కాశీ, తదితర పాంత్రాల్లోని వాతవరణాన్ని చక్కగా కెమెరాలో బంధించాడు. అమిత్ త్రివేది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను ఎమోషనల్‌గా మార్చేసింది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్‌కు ఇంకా స్కోప్ ఉంది. నిడివి కోసం అనవసరమైన సీన్లు ఉంచారా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సీరియల్స్ తెరకెక్కించే బాలాజీ ఫిల్మ్స్ బ్యానర్‌పై భావోద్వేగంతో సాగే పూర్తి కుటుంబ చిత్రాన్ని నిర్మాత ఏక్తా కపూర్ అందించారు. నటీనటుల ఎంపిక, నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్‌గా ఎలా ఉందంటే?

ఫైనల్‌గా ఎలా ఉందంటే?

గుడ్‌బై చిత్రం మొత్తం దహన సంస్కారం చుట్టు తిరిగే ఎమోషనల్ కథ. అంత్యక్రియలు, ఆచారాలు, దహనం తర్వాత ఆస్థికల నిమజ్జనం లాంటి అంశాలతో ఓ ట్రావెలాగ్ మాదిరిగా.. నేటి యువతరానికి సంస్కృతి, సంప్రదాయాలను చెప్పే ఒక డాక్యుమెంటరీ మాదిరిగా అనిపిస్తుంది. జీవిత ప్రయాణంలో చావు అనేది రైట్ టర్న్ లాంటింది.. యూటర్న్ కాదు అనే చక్కటి ఫీల్‌గుడ్ పాయింట్‌తో మంచి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామానరు వికాస్ బెహల్ తెరకెక్కించారు. అమితాబ్, రష్మిక ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. స్లో నేరేషన్, కథలో ట్విస్టులు లేకపోవడం ఆసక్తికరంగా అనిపించదు. కాకపోతే అంత్యక్రియల సమయంలో హిందూ సంప్రదాయాలు, సంస్క‌ృతి విలువలను నేటి జనరేషన్‌కు చాటిచెప్పే చిత్రమని చెప్పవచ్చు. అమితాబ్, రష్మిక అభిమానులకు, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఈ సినిమా నచ్చుతుంది. అన్ని సినిమాలను చూసినట్టు కాకుండా.. చాలా ఓపికగా చూడాల్సిన చిత్రం గుడ్‌బై.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X