twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాటలు ఎలా ఉన్నాయ్ (గోపాల గోపాల మ్యూజిక్ రివ్యూ)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వెంకటేష్ మల్టీస్టారర్లుగా నటించిన ‘గోపాల గోపాల' ఆడియో విడుదలైంది. సినిమాల్లో ప్రత్యేకంగా డ్యూయెట్ సాంగ్స్ ఏమీ లేవు. ఎందుకంటే ఇది రెగ్యులర్ కమర్షియల్ చిత్రం కాదు. ఒక డిఫరెంట్ చిత్రం. సినిమాలో మొత్తం మూడు సాంగులు ఉన్నారు. సిచ్యువేషన్‌కు తగిన విధంగా ఆ సాంగులు సాగి పోతూ ఉంటాయి.

    సాంగ్ 1: భజే భజే
    ‘గోపాల గోపాల' ఆల్బంలో మొదటి సాంగ్ అయిన ‘భజే భజే' రెండు మూడు రోజుల క్రితమే విడుదలైంది. ఒక సెలబ్రేషన్స్‌కు సంబంధించిన సిచ్యువేషన్ సాంగ్. మంచి టెంపోతో ఎనర్జిటిక్‌గా ఉంది. ఆల్బంలో ఈ పాటను మంచి ఊపున్న పాటగా చెప్పొచ్చు.

    సాంగ్ 2: ఎందుకో ఎందుకో
    ‘గోపాల గోపాల' ఆల్బంలో ఇది బెస్ట్ సాంగ్ అని చెప్పొచ్చు. ఈ పాటను ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కైలాష్ ఖేర్ పాడారు. వినడానికి ఎంతో బాగుంది.

    సాంగ్ 3: నీదే నీదే
    ఆల్బంలో ఇది లాస్ట్ సాంగ్. బాధను వర్ణిస్తూ సాగే ఒక టిపకల్ సాంగ్.

    Gopala Gopala Music Review

    ఓవరాల్ గా చెప్పాలంటే ‘గోపాల గోపాల' ఆల్బం ఫీల్ గుడ్ ఆల్బం. సిచ్యువేషన్‌కు తగిన విధంగా సాగే పాటలతో బాగుంది. సినిమాక అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ప్లస్సవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

    ఆడియో వేడుక విశేషాలు
    గోపాల గోపాల ఆడియో ఫంక్షనులో పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి సంగతులు గుర్తు చేసుకున్నారు. దీంతో పాటు చిన్న తనంలో తాను పారిపోదామన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ఆయన పారి పోయి ఉంటే......పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి కూడా అభిమానులు ఇష్టం పడటం లేదు.

    ఒక వేళ ఆయన అడవుల్లోకి పారి పోయి సినిమాల్లోకి రాక పోయి ఉంటే.....తమ పరిస్థితి ఎలా ఉండేదో? అసలు తాము ఎన్నో మంచి పనులు చేయడం మిస్సయ్యే వాళ్లం. ముఖ్యంగా జన సేన పార్టీ అనేది అసలు ఉండేదా? అంటూ అభిమానులు అసలు పవన్ కళ్యాణ్ పారి పోయాడన్న విషయాన్ని గుర్తు చేసుకోవడానికి కూడా ఇష్ట పడటం లేదు.

    ''చిన్నప్పట్నుంచి నాకు ఏం అవ్వాలో తెలిసేది కాదు. మా అమ్మ అడిగినా, అన్నయ్యలు అడిగినా నాకు ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు. చివరికి ఈ ప్రపంచంలో ఇమడలేనని భావించి స్నేహితుడితో కలిసి శ్రీశైలం అడవుల్లోకి పారిపోదామనుకొన్నా'' అన్నారు పవన్‌ కల్యాణ్‌. అదే సమయంలోనే హైదరాబాద్‌ నుంచి అన్నయ్య ఫోన్‌ చేశారు. హైదరాబాద్‌కి వచ్చేసెయ్‌ అన్నారు. ఇక్కడికొచ్చాక ఎవరో దీక్ష ఇచ్చారు. అక్కడ ధ్యానం నేర్చుకొన్నా.

    అన్నయ్య దెబ్బలు తగిలించుకొని ఇంటికొస్తే నేను యోగా, ధ్యానం అంటూ రోజూ కథలు కథలుగా చెప్పేవాణ్ని. 'అన్నీ సమకూరుతున్నప్పుడు సలహాలు చెప్పడం కాదు. నీ వంతు నువ్వు కష్టపడి ఇలాంటివి చెప్పు. అప్పుడు నువ్వు చెప్పింది నమ్ముతా' అన్నారు. ఆ మాటలు చెంపపెట్టులా అనిపించాయి అన్నారు పవన్.

    'ఖుషి' తర్వాత నాకు విజయాలు లేవు. అన్నా ఒక్క విజయం ఇవ్వు... అంటూ అభిమానులు గోల చేసేవాళ్లు. 'గబ్బర్‌సింగ్‌' చిత్రీకరణ సమయంలోనూ సెట్‌కి వచ్చి 'హిట్టు ఇవ్వు అన్నా.. కావాలంటే మేం స్క్రిప్టు ఇస్తాం' అని వేడుకొన్నారు. అప్పుడు వారి అభిమానం ఏంటో అర్థమైంది.

    అప్పటివరకు నేను భగవంతుడిని ఏమీ కోరలేదు. ఆ రోజు తొలిసారి 'దేవుడా నాకొక్క విజయం ఇవ్వు, ఇక సినిమాలు వదిలి వెళ్లిపోతా' అని కోరుకొన్నా. అప్పట్నుంచి దేవుడు విజయాలు ఇస్తూనే ఉన్నాడు. జయాపజయాలు అనేవి నా చేతుల్లో లేవు. కష్టపడటం ఒక్కటే నా చేతుల్లో ఉంది. నా తెలివితేటలతో విజయాలు రాలేదు. అవన్నీ అభిమానులు ఇచ్చినవే. ఎప్పుడూ నన్ను వదిలిపెట్టి వెళ్లలేదు అభిమానులు. వాళ్ల నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయను అన్నారు పవన్.

    అన్నీ వదిలేసి పారిపోవడం కాదు, అన్ని పనులు ఇక్కడే చేయాలి. అదే సమయంలో భగవంతుడి మార్గమూ వదులుకోకూడదు. అన్నయ్య ఆరోజు చెప్పిన మాటలు ఎప్పుడూ దృష్టిలో పెట్టుకొంటా. అభిమానులు, అన్నయ్య ఇలా ఎంతమంది ఉన్నా సరే విశ్వం ముందు, భగవంతుడి ముందు మోకరిల్లుతా అని పవన్ అన్నారు.

    నాకు కథలు ఎంపిక చేయటం రాదని కొందరు చెప్తారు కానీ.., కథలు ఎలా ఎంచుకోవాలో ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లోనే అన్నయ్య చిరంజీవి నేర్పించారు. ఇంతకుముందు సినిమాల్లో పాటలు వస్తే నడుస్తూ వెళ్లే తాను ఈ మూవీలో అయితే కాస్త డాన్స్ చేశానని చెప్పారు.

    English summary
    Gopala Gopala's audio has songs which are completely situational. There are only three tracks in the album, and all of them gel with theme of the film. Enduko and Bhaje Bhaje are our picks and will be liked by everyone.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X