For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  స్ఫూఫ్ లమయం (''సౌఖ్యం'' రివ్యూ)

  By Srikanya
  |

  Rating:
  1.5/5

  --సూర్య ప్రకాష్ జోశ్యుల

  సినిమా అంటే ప్రస్తుతం ఫామ్ లో ఉన్న ఫృధ్వీ, బ్రహ్మానందం, సప్తగిరి డేట్స్ చూసుకుని వారిపై నాలుగు హిట్ సినిమాలు స్ఫూఫ్ లు కలిపి వండి వార్చేసి, మధ్యలో హీరో, హీరోయిన్ రొటీన్ లవ్ ట్రాక్ కలిపిస్తే సరిపోతుందా..ఏమో దర్శకుడు, కథ రచయితలు అలాగే ఫిక్సైనట్లున్నారు. కామెడీ చూస్తారు కానీ నవ్విస్తామని స్ఫూఫ్ లతో నడిపేస్తే సూప్ లో పడినట్లే. రొటీన్ కథకు, రొటీన్ సీన్స్ వేసుకుని దానికి పరమ రొటీన్ స్క్రీన్ ప్లే కలుపుకుంటే చూసేవారికి సౌఖ్యం ఎక్కడుంటుంది. హీరో మాత్రం ఏం చేయగలడు...అలాంటి కథలో చేయటానికి ఏముంటుంది.

  శ్రీను(గోపించంద్) అచ్చ తెలుగు సినిమా బేవార్స్ ..బ్యాచులర్. అతను ఓ రోజున శైలజ(రెజీన) నని చూసి ప్రేమలో పడతాడు. రెండు పాటులు ఓపిగ్గా వేసుకున్న తర్వాత ... ఆమే ఓకే చేస్తుంది. సర్లే వీళ్లద్దరూ ఓకే చేసారు కదా ఇక మనం రంగంలోకి దిగాల్సిన టైం వచ్చిందని విలన్ భావూజీ(ప్రదీప్ రావత్) ఎంట్రీ. ఆ తర్వాత విలన్స్ శైలజ ని ఎత్తుకుబోతారు. అప్పుడు పని దొరికిందన్నట్లు ఉత్సాహంగా... శ్రీను.. సీన్ లోకి దూకి...ఎంత తెలివిగా అందరినీ మస్కా కొట్టి ఆమెను చేజిక్కించుకున్నాడు.. ఆమెను ఇంట్లో వాళ్ల దగ్గర ఒప్పించటానికి ఏం చేసాడు...ఈ సారి హీరో ఎవర్ని బకరా చేసి వాడుకున్నాడు ...ట్రైలర్ చూపెట్టిన పృద్వి, బ్రహ్మానందం, సప్తగిరి ఎప్పుడు వస్తారు..వారి పాత్రలేంటి...కథకు వారికి ఏమన్నా సంభందం ఉందా...వంటి విషయాలు తెలియాలంటే సినిమా చివరివరకూ చూడాల్సిందే.

  ట్రైలర్ కట్ చేసిన విధానం చూసి గోపిచంద్ గత చిత్రం లౌక్యంలా కామెడీ మరో సారి ట్రై చేసాడేమో అనిపిస్తుంది. అయితే చిత్రం ఏమిటంటే... సినిమా అంతా కామెడీ సీన్స్ కుప్పలు తెప్పలుగా ఉంటాయి కానీ నిజంగా నవ్వించే కామెడీ సీన్ ఒక్కటీ అరా తప్ప లేవు. దానికి తోడు ఓవర్ బిల్డప్ తో బాహుబలి,శ్రీమంతుడు స్ఫూఫ్ లు చేసారు. అవి కథకు ఉపయోగపడలేదు. నవ్వించలేకపోయాయి. అసలు తెలుగు తెరపై ఇన్ని సార్లు వచ్చిన ఈ కథను హీరో గోపిచంద్ ఒప్పుకోవటంలో ఆంతర్యం ఏమిటో అర్దం కాదు. కోన వెంకట్, శ్రీను వైట్ల లు తెగ వాడేసిన బోర్ కొట్టే రెడీ కథ నే మళ్లీ తీయాలంటే ఎంత ధైర్యం ఉండాలి దర్శకుడుకి అనిపిస్తుంది.

  అయినా గోపిచంద్ కూడా అల్లరి నరేష్ తరహా చిత్రాలు చేయటం ఎందుకో అర్దం కాదు. దానికి తోడు పెద్ద మైనస్ హీరోకు , విలన్ కు స్టైయిట్ తగువు ఉండదు. దాంతో విలన్ ప్రదీప్ రావత్ ఇంటర్వెల్ కు వచ్చేసరికి ..హీరో ని నేను ఏమీ చేయలేను... అతని కన్నా పెద్ద వాడి దగ్గర ఇరికించాను అటాడు కానీ ఎప్పుడైతే వేరే నేను ఏమీ చేయలేను అని చేతులు ఎత్తేసాడో అక్కడ కథ వెనక్కి వెళ్లిపోయింది. పోనీ తన కన్నా గొప్పవాడి దగ్గర ఇరికించాడా అంటే ... ఆ విలన్ (దేవా) మరీ నీరసంగా ఉంటాడు. బిల్డప్ షాట్స్ కు తప్ప దేనికి పనికిరాడు. అలాంటప్పుడు కథ ఏముంటుంది... కథనం పరుగెత్త లేక చతికిలపడిపోయింది. కోన వెంకట్, గోపి మోహన్ ..అరిగిపోయిన రికార్డులా అవే రెడీ,ఢీ నాటి పాత్రలు రాయకుండా ఉంటే ఉన్నంతలో బోర్ తప్పేది.

  స్లైడ్ షోలో మిగతా రివ్యూ...

  ఇన్నా

  ఇన్నా

  ఈ సినిమా ప్రారంభం సీనే రెడీలో తొలి సీన్ ని గుర్తు చేస్తుంది..తర్వాత రవితేజ ...వెంకీ లో ట్రైన్ ట్రాక్ తెచ్చుకుంటుంది. ఇంటర్వెల్ కు వచ్చేసరికి...టెంపుల్ ఫైట్...రెబల్ ని గుర్తు చేస్తే...సెకండాఫ్ ...మొత్తం అందరూ ఒక చోట చేరి చేసే కన్ఫూజన్ కామెడీ... ఒక సినిమా అని లేదు..ఎన్నిటిలో చూసిందే.

  లౌక్యం లోనే...

  లౌక్యం లోనే...

  నిజానికి గోపీచంద్ గత హిట్ చిత్రం లౌక్యం కథలేకుండా సాగినా..బాయిలింగ్ స్టార్ అంటూ పృద్వీ, పప్పి-సిప్పి అంటూ బ్రహ్మానందం-చంద్రమోహన్ ఎపిసోడ్స్ నిలబెట్టేసాయి. ఇక్కడ అలాంటి మ్యాజిక్ జరగలేదు.

  దారుణం

  దారుణం

  ఈ సినిమాలో క్లైమాక్స్ పూర్తి దారుణమైన ఎపిసోడ్ తో సాగుతుంది. హీరోని ప్రక్కన పెట్టి ...రేసు గుర్రు గుర్తు చేసే పాత్రలో బ్రహ్మానందంని దింపి ..విలన్ గ్యాంగ్ చేత ..పాటలు పాడించారు. ఏవీ పేలలేదు. ఎమోషన్ లేని కామిడీ,ఫైట్స్ పనికిరావని మరోసారి తేలింది.

  ఫలితం లేదు...

  ఫలితం లేదు...

  ఈ చిత్రానికి కథ మాత్రమే కాదు డైలాగ్స్ కూడా పస లేని ప్రాస డైలాగులతో సాగి విసిగించాయి. స్క్రీన్ ప్లే అయితే రాబోయే ఇరవయ్యో సీన్ కూడా ఊహకు అందేలా ఉంది

  ప్లస్ పాయింట్

  ప్లస్ పాయింట్

  ఈ సినిమాలో ఏకైక ప్లస్ పాయింట్.. ప్రసాద్ మురెళ్ల కెమెరా వర్క్. ఉన్నంతలో జయప్రకాష్ రెడ్డి కామెడీ. ప్రారంభంలో వచ్చే ట్రైన్ ఎపిసోడ్ లో పోసాని కామెడీ.

  సంగీతం

  సంగీతం

  ఈ సినిమాకు సంగీతం పెద్ద మైనస్ గా నిలిచింది. ఒక్కటి కూడా ఆకట్టుకునే ట్యూన్ ...హమ్ చేసుకుంటూ బయిటకు వచ్చేలా డిజైన్ చేయలేదు. రీరికార్డింగ్ కూడా అంతంత మాత్రమే.

  ఎడిటింగ్, దర్శకత్వం

  ఎడిటింగ్, దర్శకత్వం

  ఈ సినిమా చూస్తూంటే ఎడిటర్ మీద కోపం వస్తుంది. ఇంకాస్త ట్రిమ్ చేస్తే కాస్త బోర్ తగ్గేదికదా అనిపించటం ఖాయం. ఇక ఈ దర్శకుడేనా గోపిచంద్ తో యజ్ఞం తీసింది అనే డౌట్ వచ్చేలా సాగింది.

  నటీనటులు

  నటీనటులు

  బ్యానర్ : భవ్య క్రియేషన్స్
  నటీనటులు :గోపీచంద్‌, రెజీనా , షావుకారు జాన‌కి, బ్ర‌హ్మానందం, పోసాని కృష్ణ ముర‌ళి, జ‌య‌ప్రకాష్ రెడ్డి, జీవా, ర‌ఘుబాబు, కృష్ణ‌భ‌గ‌వాన్‌, ముఖేష్ రుషి, దేవా, పృథ్వి, ర‌ఘు, శివాజీరాజా, సురేఖావాణి, స‌త్యకృష్ణ , స‌త్యం రాజేష్ తదితరులు.
  క‌థ‌, మాట‌లు: శ్రీధ‌ర్ సీపాన‌,
  సంగీతం: అనూప్ రూబెన్స్,
  స్క్రీన్‌ప్లే: కోన వెంక‌ట్‌, గోపీ మోహ‌న్‌,
  కెమెరా: ప్రసాద్ మూరెళ్ల,
  ఎడిట‌ర్‌: గౌతంరాజు,
  ఆర్ట్ : వివేక్‌,
  నిర్మాత‌: వి.ఆనంద్‌ప్రసాద్‌.
  దర్శకత్వం: ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి
  విడుదల తేదీ: 24-12-2015

  ఫైనల్ గా...రొటీన్ తెలుగు సినిమాలను కూడా క్షమించి రెగ్యులర్ గా చూసేవారికి కూడా ఈ సినిమా కంటికి అడ్డం పడుతుంది. అయితే కమిడయిన్స్ చేసిన ఈ కామెడీ బిట్స్ సినిమాకు కొంచెం కూడా ఉపయోగపడకపోయినా టీవీ ఛానెల్స్ వారికి ఖచ్చితంగా ఉపయోగపడతాయి.

  (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

  English summary
  Gopichand's Soukhyam same predictable drama a thousand times by now in Telugu films.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X