twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పక్కా బాలకృష్ణ మార్క్‌!

    By Staff
    |

    Goppinti Alludu
    చిత్రం: గొప్పింటి అల్లుడు
    నటీనటులు: బాలకృష్ణ, సిమ్రాన్‌, సంఘవి, సాధిక, బాలు, సత్యనారయణ
    సంగీతం: కోటి
    ఫోటోగ్రఫీ: నందమూరి మోహనకృష్ణ
    నిర్మాత: రామకృష్ణ
    స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: ఇవివి సత్యనారయణ

    స్విట్జర్లాండ్‌, యూరోప్‌ దేశాల రోడ్లపై గంతులు, పాటలు, డాన్స్‌ లు, ఆ తర్వాత కొన్ని రీళ్ళు మెలోడ్రామా, ఆ పై కొంత డ్రామా..... ఇలాంటి సన్నివేశాలున్న చిత్రాలు తెలుగులో ఎన్నో వచ్చాయి. అలాంటి వాటి కోవలోకి మరో చిత్రం-గొప్పింటి అల్లుడు- వచ్చి చేరింది. బాలకృష్ణ, ఇవివి సత్యనారయణ లు ఎంతో ఆర్భాటంగా తీసిన ఈ భారీ చిత్రం అతి సాధారణ సినిమా. ఐదారుగురు రచయితలు కలిసి వండిన ఈ సినిమాలో నవ్యత అంటూ లేదు. సన్నివేశాలన్నీ ఎదో ఓ సినిమాలోని సన్నివేశాలను గుర్తుకు తెస్తాయి. ఎందుకంటే పాతకథకు పాత సన్నివేశాలనే జోడించడం ఈ సినిమా ప్రత్యేకత. కాకపోతే ఈ సారి హీరో మారాడు. హీరోయిన్‌ లు మారారు. అలాగే బాలకృష్ణ సినిమాలో సహజంగా ఉండే ద్వందార్థాలతో కూడిన మాటలూ ఇందులో పుష్కలం. కాకపోతే వాటికి గ్రాఫికల్‌ ఎక్స్‌ ప్రెషన్స్‌ కూడా చేర్చడం ఈ చిత్రంలో 'విశేషం'.

    బాలకృష్ణ పారిశ్రామిక వేత్త ఎస్వీఆర్‌(బాల సుబ్రమణ్యం) కొడుకు. స్విట్జర్లాండ్‌ లో అప్పుడే చదువు ముగించుకొని వస్తాడు.(బాలకృష్ణకు అంత చిన్న ఏజా అనడగకండి). ఒక్కగానొక్క పుత్రరత్నం అంటే బాలసుబ్రమణ్యంకు చాలా ఇష్టం. ధనవంతుడైన సత్యనారయణకు ముగ్గురు కూతుళ్ళు. ఇద్దరు మనవరాళ్ళు. పెద్ద మనవరాలు సిమ్రాన్‌. రెండో మనవరాలు సంఘవి. సత్యనారయణ కొడుకుకు పెళ్ళి వల్ల పుట్టిన అమ్మాయి సంఘవైతే, అక్రమంగా పుట్టిన అమ్మాయి సిమ్రాన్‌. ఈ అక్రమ సంబంధం తెల్సిన సంఘవి తల్లి ఆత్మహత్య చేసుకుంటుంది. దాంతో సంఘవి సిమ్రాన్‌ పై కక్ష పెంచుకుంటుంది. మరో వైపు బాలకృష్ణకు పెళ్ళిసంబంధం చూస్తాడు బాలసుబ్రమణ్యం. అది ఇష్టం లేక బాలకృష్ణ స్విట్జర్లాండ్‌ పారిపోతాడు. కొడుకును వెంబడిస్తూ తండ్రీ స్విట్జర్లాండ్‌ పయనమవుతాడు.

    అదే దేశంలో జాబ్‌ కోసం బయలుదేరిన సిమ్రాన్‌, బాలకృష్ణకు పరిచయమవుతుంది. (ఎలాగంటారా? ఆ మాత్రం ఊహించలేరా! అన్నీ తెలుగు సినిమాల మాదిరిగానే బాలకృష్ణ, సిమ్రాన్‌ లు ఒకర్నొకరు చూడకుండా ఢీకొంటారు). అలా వారిద్దరూ ప్రేమలోనూ పడుతారు. వీరి పెళ్ళికి బాలూ అంగీకరించడంతో అందరూ ఇండియాకు వస్తారు. ఇక్కడో చిన్న ట్విస్ట్‌. ఒకసారి బాలసుబ్రమణ్యం కారులో వస్తుండగా, కారును లారీ ఢీకొంటుంది. దాంతో కారు వెళ్ళి అటుగా వస్తున్న సత్యనారయణను గుద్దుతుంది. సత్యనారయణ కాళ్లు విరుగుతాయి. దాంతో బాలసుబ్రమణ్యం కొడుకుతో పెళ్ళికి సత్యనారయణ ఒప్పుకోడు. చివరికి సిమ్రాన్‌ ను బాలకృష్ణ ఎలా పెళ్ళి చేసుకుంటాడనేదే ముగింపు.

    ఈ సినిమాలో సిమ్రాన్‌ నటనే కాస్త రిలీఫ్‌. చక్కటి డ్రెస్స్‌ లను సెలక్ట్‌ చేసుకొని చాలా అందంగానూ కనిపించింది. సాడిస్ట్‌ పాత్రలో సంఘవి, బాల సుబ్రమణ్యం, సత్యనారయణలు తమ పాత్రలను చక్కగా పోషించారు. కోటి సంగీతం అందించిన ఈ చిత్రంలో అన్ని ఫక్కా మాస్‌ పాటలే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X