O Kala Review: డిప్రెషన్ నుంచి బయటపడేసే మూవీ.. 'ఓ కల' ఎలా ఉందంటే?

రేటింగ్: 2.5/5

టైటిల్: ఓ కల
నటీనటులు: గౌరీష్ యేలేటి, రోషిణి సహోట, ప్రాచీ ఠాకర్, దేవి ప్రసాద్, అలీ, వైవా రాఘవ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: అఖిల్ వల్లూరి
సంగీతం: నీలేష్ మందలపు
నిర్మాతలు: లక్ష్మీ నవ్య మోటూరు, రంజిక్ కుమార్ కొడాలి
దర్శకత్వం: దీపక్ కొలిపాక
ఓటీటీ విడుదల తేది: ఏప్రిల్ 13, 2023
ఓటీటీ వేదిక: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

ఇటీవల కాలంలో ఓటీటీలు న్యూ టాలెంట్ నటీనటులకు మంచి వేదికలుగా నిలుస్తున్నాయి. కంటెంట్ ఉంటే స్టార్ యాక్టర్స్ లేకపోయిన సరే ప్రేక్షకులు మంచి ఆదరణ కనబరుస్తున్నారు. అందుకే నూతన నటీనటులు, దర్శక నిర్మాతలు కంటెంట్ తో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పై సినిమాలను విడుదల చేస్తున్నారు. అలా నూతన తారలతో వచ్చిన చిత్రమే 'ఓ కల' (O Kala Movie). డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఏప్రిల్ 13 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఓ కల మూవీ ఎలా ఉందో రివ్యూలో (O Kala Movie Review) తెలుసుకుందాం.

Gourish Yeleti Roshni Sahota O Kala Movie Review And Rating In Telugu

కథ: హారిక వర్మ (రోషిణి సహోట) ఎంబీఏ చేస్తుంది. ఓ మంచి కంపెనీలో వచ్చిన ఉద్యోగాన్ని వదులుకుని కొత్త స్టార్టప్ పెడుతుంది. ఈ వ్యాపారంలో ముందుగా మంచి లాభాలు వస్తాయి. కానీ బిజినెస్ అండ్ లైఫ్ పార్టనర్ మోసం చేయడంతో నష్టాలు వస్తాయి. సొంత ఇల్లు తాకట్టుపెట్టి నష్టాలు భర్తీ చేద్దామని ప్రయత్నించినా ఫలించదు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. ఈ క్రమంలోనే బార్ కు వెళ్లిన హారికకు హర్ష (గౌరీష్ యేలేటి) పరిచయం అవుతాడు.

హర్ష ఎవరు?: హర్ష పరిచయం కావడంతో అతనితో కలిసి కశ్మీర్ వెళ్తుంది హారిక. కశ్మీర్ కు వెళ్లిన హారిక జీవితంలో హర్ష తీసుకొచ్చిన మార్పు ఏంటీ? అసలు హర్ష ఎవరు? ఫొటోగ్రాఫర్ అయిన హర్ష తనను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎందుకు పరిచయం చేసుకున్నాడు? హర్ష గురించి హారిక ఏం తెలుసుకుంది? హర్ష గర్ల్ ఫ్రెండ్ ప్రత్యూష (ప్రాచీ ఠాకర్), బెస్ట్ ఫ్రెండ్ తరుణ్ (వైవా రాఘవ్)ల గురించి ఏం చెప్పాడు? చివరిగా హారిక ఏం చేసింది? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

Gourish Yeleti Roshni Sahota O Kala Movie Review And Rating In Telugu

విశ్లేషణ: ఓ కల ఒక ఫీల్ గుడ్ అండ్ మెసేజ్ ఒరియెంటెడ్ మూవీ. డైరెక్టర్ దీపక్ కొలిపాక చెప్పాలనుకున్న పాయింట్ ను కరెక్ట్ గా చెప్పి చూపించారు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఒక అమ్మాయికి ఒక అబ్బాయి పరిచయం ఎలాంటి మలుపు తిప్పిందనే నేరేషన్ తో సూసైడ్ కరెక్ట్ కాదనే సందేశం ఇచ్చారు. "ఇవాళ రాత్రి మనం కళ్లు మూసుకుని మళ్లీ పొద్దున కళ్లు తెరిస్తేనే కదా మనం బతికి ఉన్నట్లు.. లేకపోతే చనిపోయినట్లే కదా. మనం కంట్రోల్ చేయలేని జీవితాన్ని, మనం కంట్రోల్ లోకి తీసుకోవద్దు. తీసుకుని ఇబ్బందులు పడొద్దు" ఇదే ఈ సినిమా ద్వారా డైరెక్టర్ చెప్పాలనుకున్నది.

గొప్పగా సన్నివేశాలు..: కథలో పెద్దగా ట్విస్టులు, ఆహా ఓహో అనే సన్నివేశాలు ఏం లేవు. కానీ చూస్తున్నంతసేపు చూడాలనిపిస్తుంది. రొమాన్స్ కంటే ఎక్కువగా డ్రామాపై ఫోకస్ చేశారు. వైవా రాఘవ్ కామెడీ బాగుంది. అలీ ట్రాక్ ఏం బాగోలేదు. కొన్ని లాజిక్స్ ను పక్కన పెడితే మూవీ ద్వారా ఏం చెప్పాలనుకున్నది ఆలోచిస్తే మంచి ఇంప్రెషన్ ఉంటుంది. "కింద పడితే ఓడిపోయినట్లు కాదు.. లేచి ప్రయత్నించకపోతేనే ఓడిపోయినట్లు" వంటి అర్థవంతమైన డైలాగ్స్ బాగున్నాయి. టెక్నికల్ టీమ్ బాగా పని చేసింది. చివర్లో వచ్చే ఓ కల సాంగ్ ఆకట్టుకుంటుంది.

Gourish Yeleti Roshni Sahota O Kala Movie Review And Rating In Telugu

ఎవరెలా చేశారంటే..: గౌరీష్ యేలేటి, రోషిణి సహోటలకు ఇదే తొలి సినిమా. కానీ బాగా నటించి ఆకట్టుకున్నారు. ఇద్దరి క్యారెక్టర్లు చాలా బాగున్నాయి. అమ్మాయిలు ధైర్యంగా నిలబడి అనుకున్నది సాధించాలనే పాత్రలో రోషిణి బాగా చేసింది. ఇక హీరో గర్ల్ ఫ్రెండ్ గా ప్రాచీ ఠాకర్ ఆకట్టుకుంది. ఇంతకుముందు ఆమె పటాస్, తదితర సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్ చేసింది. వైవా రాఘవ్ నటన బాగుంది. హీరోయిన్ తండ్రిగా దేవి ప్రసాద్ హుందాగా నటించారు. మిగతా పాత్రలన్నీ ఓకే. బీజీఎమ్ కూడా పర్వాలేదు.

ఫైనల్ గా చెప్పాలంటే..: ఓ కల ఒక మంచి సందేశాత్మక సినిమా. పెద్దగా మలుపులు, ఎమోషనల్ సన్నివేశాలు, గొప్పగా చెప్పుకునే తదితర విషయాలు ఏం లేవు. కానీ చూస్తున్నంతసేపు చూడాలనిపిస్తుంది. డిప్రెషన్ గురించి బాగా డిస్కస్ చేశారు. ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తే మంచి మోటివేషన్ సినిమా అవుతుంది. వీకెండ్ లో టైమ్ పాస్ కు చూడాలనుకుంటే 'ఓ కల'ను టచ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X