Governor First Review: గవర్నర్ మూవీ ఫస్ట్ రివ్యూ
బాలీవుడ్ స్టార్ యాక్టర్ మనోజ్ బాజ్‌పేయ్ నటించిన ఫైనాన్షియల్ థ్రిల్లర్ గవర్నర్. ఈ చిత్రానికి చిన్మయి డీ మండ్లేకర్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం అదా శర్, నషాద్ మహ్మద్ కుంజు, మధు శర్మ, ప్రీతోష్ సంద్ తదితరులు నటించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. సినిమాటోగ్రఫి: విశాల్ సిన్హా, మేఘ్న మంచందా సేన్, సంజయ్ శర్మ, మ్యూజిక్: అమిత్ త్రివేది, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: మన్నన్ షా తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ చిత్రం జూన్ 12వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) కార్యక్రమాల పూర్తి తర్వాత ఈ సినిమాపై వచ్చిన టాక్ గురించిన వివరాల్లోకి వెళితే..

గవర్నర్ చిత్రం కథ విషయానికి వస్తే.. 1990లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంగా తెరకెక్కింది. అలాంటి ఆర్థిక వ్యవస్థ విపత్కర పరిస్థితుల్లో ఉన్నతాధికారి రామన్ (మనోజ్ బాజ్‌పేయ్)ను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా నియమిస్తారు. ఆర్థిక వ్యవస్థ దివాళా తీస్తున్న సమయంలో ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, ఇంధన వనరుల క్షీణించడంతో దేశంలో ఆందోళన పరిస్థితులు నెలకొంటాయి. రామన్‌పై రాజకీయ ఒత్తిడులు పెరిగిపోతాయి. దారుణమైన ఆర్థిక మాంద్యం సవాల్‌గా మారుతుంది. ఆ పరిస్థితుల్లో రామన్ వ్యూహం ఏమిటి? ఆర్థిక వ్యవస్థను చక్క బెట్టడానికి ఆయన ఏం చేశాడు? ఎలాంటి రాజకీయ ఒత్తిడులు ఎదుర్కొన్నాడు? ఆర్థిక మాంద్యాన్ని ఎలా డీల్ చేశాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.
ఈ చిత్రం అంతా ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో రూపొందడంతో ఓ మాదిరిగా అకడమిక్ నేచర్ ఉన్న సినిమాగా మారింది. విద్యార్థులు, మేధావులను ఆలోచింపచేసే సినిమాగా రూపొందడం వల్ల సెన్సార్ సభ్యులు కూడా పెద్దగా అభ్యంతరం చెప్పలేకపోయారు. రాజకీయ నేతలను పోలీ ఉన్న పాత్రల పేర్లు, డైలాగ్స్‌ను మార్పులు చేర్పులు చేయడానలి సూచించారు. చిత్ర యూనిట్ సానుకూలంగా స్పందించారు. అలా ఈ సినిమాకు కొన్ని అభ్యంతరాలతో సినిమాకు క్లీన్ చిట్ ఇచ్చారు.
గవర్నర్ సినిమా విషయానికి వస్తే.. యూఏ (UA13+) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. అంటే ఈ చిత్రాన్ని 13 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరు చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు ఈ సినిమాను తల్లిదండ్రుల పర్యవేక్షణ, అనుమతితో చూడాల్సి ఉంటుంది అని సర్టిఫికెట్‌లో తెలిపారు. ఈ చిత్రం కంటెంట్ ప్రధానమైనది కావడం, అతి ఫిక్షన్‌కు చోటు లేకుండా వాస్తవాలు, గణాంకాల ఆధారంగా రూపొందడంతో నిడివి కూడా పరిమితిగానే ఉంది. ఈ సినిమా నిడివి 2 గంటల 2 నిమిషాలు. అంటే 122 నిమిషాల రన్‌టైమ్‌ను ఫిక్స్ చేసినట్టు సెన్సార్ సర్టిఫికెట్ స్పష్టం చేసింది.
అయితే సెన్సార్ టాక్ తర్వాత ఈ సినిమాలో మనోజ్ బాజ్‌పేయ్ పెర్ఫార్మెన్స్ ఎప్పటిలానే హైలెట్ కానున్నది. ఆదా శర్మ గ్లామర్ గానే కాకుండా నటించానికి స్కోప్ ఉన్న పాత్రలో కనిపించారు. మధు షా తదితరులు సినిమాకు బలంగా మారే పాత్రల్లో కనిపించారని తెలిసింది. ఈ సినిమా ఎక్స్‌క్లూజివ్ రివ్యూ, బాక్సాఫీస్ అప్‌డేట్స్ గురించి ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications