twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెంటిమెంటు గోవిందుడు...(అందరి వాడేలే రివ్యూ)

    By Bojja Kumar
    |

    Rating:
    3.0/5

    హైదరాబాద్: లవర్ బాయ్‌గా, మాస్ హీరోగా, యాక్షన్ హీరోగా ఇప్పటి వరకు తెరపై కనిపించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈ సారి కృష్ణ వంశీ దర్శకత్వంలో సరికొత్త ఇమేజ్ తెచ్చుకోవాలని, ఫ్యామిలీ హీరోగా మెప్పించాలనే ప్రయత్నం చేసాడు. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రం వరల్డ్ వైడ్‌‌గా గ్రాండ్‌గా విడుదలైంది.

    దర్శకుడు కృష్ణ వంశీ సినిమాలంటేనే తెలుగుదనం కొట్టొచ్చేలా ఉంటాయి. తెలుగు ఫ్యామిలీ బంధాలు, అనుబంధాలు, పంతాలు, ఆప్యాయతలు, బావ మరదళ్ల సరసాలతో ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతుంటాడు. ఇలాంటి అంశాలతో గతంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన నిన్నేపెళ్లాడతా, మురారి లాంటి చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తన నుండి ప్రేక్షకులు ఏం కోరుకుంటారో....తాజాగా ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రంలో అదే చూపించే ప్రయత్నం చేసారు కృష్ణ వంశీ. ఎవరి పనులు వారే చేసుకోవాలి, మన కుటుంబాన్ని మనమే కలుపుకోవలి అనే కాన్సెప్టుతో సినిమా సాగుతుంది.

    కథలోకి వెళితే....
    ఊరి పెద్ద బాలరాజు(ప్రకాష్ రాజ్) ఊరు బాగుంటే అంతా బాగుంటుందని నమ్మే వ్యక్తి. అందుకే తన పెద్ద కొడుకు చంద్రశేఖర్(రహమాన్)ను డాక్టర్ చదివించి ఊరిలోనే ఆసుపత్రి కట్టించి ప్రజలకు వైద్యం అందించాలని ఆశిస్తాడు. అయితే చంద్రశేఖర్ తండ్రిమాట పట్టించు కోకుండా విదేశాలు, డబ్బుపై మోజుతో తను ప్రేమించిన అమ్మాయి(బానుశ్రీ మెహ్రా)తో లండన్ వెళ్లి పోతాడు. తండ్రి మాటను కాదని తను చేసిన తప్పును తలచుకుని కుమిలిపోతున్న చంద్రశేఖర్ రావును తన ఫ్యామిలీతో కలిపే ప్రయత్నంలో లండన్ నుండి ఇండియా వస్తాడు అభిరామ్(రామ్ చరణ్). తను ఎవరో చెప్పకుండా బాలరాజు కుటుంబానికి దగ్గరవుతాడు. తండ్రిని, తాతను అభిరామ్ ఎలా కలిపాడు అనేది క్లైమాక్స్.

    మిగతా రివ్యూ స్లైడ్ షోలో....

    రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్

    రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్

    రామ్ చరణ్ తన పాత్రలో పర్ ఫెక్టుగా నటించాడు. సెంటిమెంటు సీన్లతో పాటు యాక్షన్, రొమాంటిక్ సీన్లలో మెప్పించాడు. ఈ సినిమా ద్వారా అతనికి ఫ్యామిలీ హీరో ఇమేజ్ రావడం ఖాయం.

    కాజల్...

    కాజల్...

    హీరోయిన్ కాజల్ ఉన్నంతలో పెర్ఫార్మెన్స్ పరంగా, అందచందాల పరంగా మెప్పించింది.

    ప్రకాష్ రాజ్

    ప్రకాష్ రాజ్

    సినిమాలో కీలకమైన బాలరాజు పాత్రలో ప్రకాష్ రాజ్ జీవించాడు. ఆయన స్థానంలో మరో వ్యక్తిని ఊహించలేం అనేంతగా నటించాడు. అందుకే 2 కోట్లు ఎక్కువ ఖర్చయినా లెక్క చేయకుండా రాజ్ కిరణ్ స్థానంలో మళ్లీ ప్రకాష్ రాజ్ పెట్టి రీషూట్ చేసారు. ప్రకాష్ రాజ్‌కు జోడీగా జయసుధ సెంటిమెంటు సీన్లు పండించింది.

    ఇతర పాత్రలు

    ఇతర పాత్రలు

    బాబాయ్ బంగారి పాత్రలో శ్రీకాంత్, అతని మరదలి పాత్రలో కమిలినీ ముఖర్జీ, విలన్ పాత్రల్లో కోట, రావు రమేష్, పోసాని, ఆదర్శ్ ఇతర నటీనటులు వారి వారి పాత్రల మేరకు రాణించారు.

    కృష్ణ వంశీ

    కృష్ణ వంశీ

    ఇలాంటి తరహా కథలు తెలుగులో గతంలో చాలా వచ్చాయి. స్టోరీలైన్ పాతదే అయినా....కొత్తగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేసాడు కృష్ణ వంశీ. ముఖ్యంగా ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఎమోషన్స్ పండించడంలో, నటీనటుల నుండి తనకు కావాల్సిన పెర్ఫార్మెన్స్ రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు.

    మైనస్ పాయింట్స్

    మైనస్ పాయింట్స్

    అయితే కథనం కాస్త స్లోగా ఉండటంతో ఫస్టాఫ్ కాస్త సాగదీసినట్లు ఉంది. ఇక సినిమా చూస్తున్న ప్రేక్షుకులకు నెక్ట్స్ సీన్ ఏంటి అనే ఆసక్తి లేకుండా...వారు ముందుగానే ఊహించే విధంగా ఉండటం మైనస్ పాయింటుగా చెప్పుకోవచ్చు. ఇక సినిమాలో కామెడీకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అది కూడా జోడించి ఉంటే సినిమా మరింత వినోదాత్మకంగా ఉండేది.

    టెక్నికల్ అంశాలు

    టెక్నికల్ అంశాలు

    టెక్నికల్ అంశాల విషయానికొస్తే....సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమా పెద్ద హైలెట్. ప్రతి సన్నివేశంలోనూ తన మార్కు చూపించాడు సమీర్ రెడ్డి. ఇక యువన్ శంకర్ రాజా అందించిన పాటలు బాగున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు తగిన విధంగా ఆకట్టుకుంది. ఎడిటింగ్ ఓకే. రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ సరికొత్తగా ఉన్నాయి.

    ఫైనల్ వర్డ్

    ఫైనల్ వర్డ్

    ఓవరాల్ గా సినిమా ఓల్డ్ స్టైల్ లో ఉన్నప్పటికీ, కథలో కొత్తదనం లేక పోయినప్పటికీ....సెంటిమెంటు, ఎమోషన్, రొమాంటిక్ ట్రాక్ కొనసాగిస్తూ ఫ్యామిలీ డ్రామా విసుగురాకుండా నడిపించారు. కృష్ణ వంశీ మార్కు ఫ్యామిలీ ఎంటర్టెనర్స్ ఇష్ట పడే వారికి ఈ సినిమా ఫర్వాలేదనిపిస్తుంది.

    తారాగణం, ఇతర వివరాలు

    తారాగణం, ఇతర వివరాలు

    బ్యానర్: పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్
    నటీనటులు : రామ్ చరణ్, కాజల్, శ్రీ కాంత్, కమలినీ ముఖర్జీ, ప్రకాష్‌రాజ్, జయసుధ, ఎం.ఎస్.నారాయణ, పరుచూరి వెంకటేశ్వరరావు, రఘుబాబు, పోసాని తదితరులు
    కెమెరా: సమీర్ రెడ్డి
    సంగీతం: యువన్‌శంకర్‌రాజా
    ఆర్ట్: అశోక్‌కుమార్
    ఎడిటింగ్: నవీన్
    ఫైట్స్: పీటర్ హెయిన్స్, రామ్‌లక్ష్మణ్
    రచన: పరుచూరి బ్రదర్స్,
    కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కృష్ణవంశీ
    నిర్మాత : బండ్ల గణేష్
    విడుదల తేదీ : అక్టోబర్ 1. 2014

    English summary
    Ram Charan Teja's much-talked about Telugu movie Govindudu Andarivadele (GAV) has Released. Govindudu AndariVadele is a decent family entertainer with lot of family emotions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X