Grandhalayam Review పుస్తకం చదివితే మృత్యువు ఒడిలోకి.. ఆకట్టుకొనే సస్పెన్స్ థ్రిల్లర్‌గా గ్రంథాలయం

Rating: 2.5/5

నటీనటులు: విన్ను మద్దిపాటి, స్మ్రిత రాణి బోర, కాలకేయ ప్రభాకర్‌, సోనియాచౌదరి, అలోక్‌ జైన్‌, జ్యోతి రానా, కాశీ శ్రీనాథ్‌, డాక్టర్ భద్రం, మేక రామకృష్ణ, పార్వతి, శివ, శ్రావణి, మురళీకృష్ణ, నవ్యశారద, నరేంద్రనాయుడు. స్నేహా గుప్త తదితరులు
రచన దర్శకత్వం: సాయి శివన్‌ జంపన
నిర్మాతలు: వైష్ణవి శ్రీ సూర్య దేవర, కిరణ్మయి దిగమర్తి
సినిమాటోగ్రఫి: భాస్కర్‌ సామల
సంగీతం: విష్ణు వర్ధన్‌ కే
ఎడిటర్‌: శేఖర్‌ పసుపులేటి
బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్: చిన్నా
ఆర్ట్‌డైరెక్టర్‌ : రవికుమార్‌ మండ్రు
బ్యానర్: వైష్ణవి శ్రీ క్రియేషన్స్‌
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అల్లంనేని అయ్యప్ప
రిలీజ్ డేట్: 2023-03-03

Grandhalayam Telugu movie Review

రఘుపతి గ్రంథాలయంలో విచిత్రమైన పరిస్థితి గ్రామస్థులను వెంటాడుతుంటుంది. 1965 సంవత్సరంలో ప్రచురించిన ఓ పుస్తకాన్ని చదివిన దాదాపు 100 మంది మృత్యువాత పడుతారు. దాంతో ఆ పుస్తకాన్ని చదవడానికి అందరూ భయపడుతుంటారు. ఇదిలా ఉంటే.. రాజా హరిశ్చంద్ర కృష్ణ ప్రసాద్ (విన్ను మద్దిపాటి), ఇందుమతి వాత్సల్య (స్మితారాణి బోర) పీకల్లోతు ప్రేమలో ఉంటారు. అనుకోకుండా ఇందుమతి ఆ పుస్తకాన్ని చదవడం ప్రారంభిస్తుంది. ఆ పుస్తకాన్ని చదివితే చనిపోతారనే తెలుసుకొన్న రాజా హరిశ్చంద్ర.. ఇందుమతిని చదవకుండా ప్రయత్నిస్తుంటాడు.

సుమారు 100 మంది ప్రాణాలు తీసిన ఆ పుస్తకం వెనుక కథ ఏమిటి? ఆ పుస్తకాన్ని చదివిన వారు ఎందుకు చనిపోతున్నారు? మృత్యువుకు చిరునామాగా మారిన ఆ పుస్తకాన్ని చదవకుండా ఇందుమతిని రాజా హరిశ్చంద్ర ఆపాడా? ఇందుమతి ఆ పుస్తకాన్ని చదివిందా? ఇందుమతిని రాజా హరిశ్చంద్ర రక్షించుకొన్నాడా? ఆ గ్రంథాలయంలోకి వెళ్లి పరిశోధన చేసిన రాజా హరిశ్చంద్రకు అసలు విషయం తెలిసిందా? ఆ పుస్తకం వెనుక ఉన్న మరణశాసనాన్ని రాజా హరిశ్చంద్ర తెలుసుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే గ్రంథాలయం సినిమా కథ.

దర్శకుడు సాయి శివన్‌ జంపన ఎంచుకొన్న పాయింట్ చాలా థ్రిలింగ్‌గా ఉంటుంది. ఆ పాయింట్‌ను బేస్ చేసుకొని యాక్షన్, రొమాంటిక్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా మార్చిన విధానం ఇంకా బాగుంది. అయితే కొత్తవారితో దర్శకుడు చేసిన ప్రయత్నం బాగున్నప్పటికీ.. ప్రేక్షకులకు తెలిసిన తారలు ఉండి ఉంటే.. మరింత రీచ్, క్రేజ్ ఉండేదనిపిస్తుంది. రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించిన తీరు.. లవ్ ట్రాక్‌ను అసలు పాయింట్‌కు జోడించిన విధానం బాగుంటుంది. స్క్రిప్టు పరంగా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. గ్రిప్పింగ్‌గా చెప్పిన కథనం వల్ల అవేమీ కనిపించకుండా పోయాయనిపిస్తుంది. థ్రిల్లింగ్ పాయింట్‌కు రొమాన్స్, యాక్షన్, సస్పెన్స్‌ను జోడించడమే కాకుండా పరిమితమైన బడ్జెట్, కొత్త నటీనటులతో తెరకెక్కించిన తీరుకు దర్శకుడు సాయి శివన్‌ను అభినందించాల్సిందే.

ప్రేయసి ప్రాణాలను రక్షించుకోవడానికి తెగించిన యువకుడు రాజా హరిశ్చంద్ర పాత్రలో విన్ను మద్దిపాటి ఒదిగిపోయాడు. ఇందుమతిగా స్మితరాణి గ్లామర్ పరంగా, నటనపరంగా ఆకట్టుకొన్నది. లావ్ ట్రాక్‌లో విన్ను, స్మిత కెమిస్ట్రీ బాగా పండింది. కాలకేయ ప్రభాకర్ తన మార్కు విలనిజాన్ని చూపించాడు. సోనియా చౌదరి, డాక్టర్ భద్రంతోపాటు మిగితా పాత్రల్లో నటించిన వారు వారి వారి పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు.

గ్రంథాలయం సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. గోదావరి నదీ తీరంలో సన్నివేశాలను చక్కగా కెమెరాలో బంధించారు. యాక్షన్ సీన్లను కూడా చాలా సహజంగా చిత్రీకరించాడు. చిన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోరు సినిమాకు మరింత బలాన్ని ఇచ్చింది. నబాకాంత్, సుబ్బు, డైమండ్ వెంకట్ తదితరులు డిజైన్ చేసిన ఫైట్స్ బాగున్నాయి. శేఖర్ ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. వైష్ణవీ శ్రీ క్రియేషన్స్ బ్యానర్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. రాజీ లేకుండా వైష్ణవి శ్రీ సూర్య దేవర, కిరణ్మయి దిగమర్తి నిర్మించిన తీరు వారికి సినిమాపై ఉన్న అభిరుచిని తెలియజెప్పింది.

లవ్, రొమాన్స్‌తోపాటు యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలు కలిసి ఉన్న చిత్రం గ్రంథాలయం. చిన్న చిత్రం, కొత్త నటీనటులు సమిష్టిగా ఈ సినిమాను ఫీల్‌గుడ్‌గా మలిచారనే ఫీలింగ్ కలుగుతుంది. మాస్ ప్రేక్షకులకు కావాల్సిన అంశాలు ఉన్నాయి. యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి గ్రంథాలయం సినిమా తప్పకుండా నచ్చుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X