twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గృహం మూవీ రివ్యూ: భయపడటం ఖాయం.. బీ కేర్ ఫుల్..

    దక్షిణాది చిత్ర పరిశ్రమలో లవర్ బాయ్, క్రేజీ హీరోగా పేరున్న సిద్ధార్థ్ గత కొద్దికాలంగా సక్సెస్‌లకు దూరమయ్యాడు. దాదాపు తెరపైన కనుమరుగై పోతున్నాడా అనే దశలో స్వీయ నిర్మాణ సారథ్యంలో సిద్ధార్థ్ రూపొందించిన

    By Rajababu
    |

    Rating:
    3.5/5
    Star Cast: సిద్ధార్థ్, ఆండియ్రా జెర్మియా, అనీషా ఏంజెలీనా విక్టర్, అతుల్ కులకర్ణి, సురేష్
    Director: మిలింద్ రావ్

    Recommended Video

    Gruham : Movie Public Talk గృహం మూవీ పబ్లిక్ టాక్

    దక్షిణాది చిత్ర పరిశ్రమలో లవర్ బాయ్, క్రేజీ హీరోగా పేరున్న సిద్ధార్థ్ గత కొద్దికాలంగా సక్సెస్‌లకు దూరమయ్యాడు. దాదాపు తెరపైన కనుమరుగై పోతున్నాడా అనే దశలో స్వీయ నిర్మాణ సారథ్యంలో సిద్ధార్థ్ రూపొందించిన చిత్రం గృహం. తన ఇమేజ్‌కు భిన్నంగా హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రం గృహంతో నవంబర్ 17న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గృహం చిత్రం సిద్ధార్థ్‌కు మంచి సక్సెస్‌ను అందించిందా? అసలు ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచింది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథ ఏంటో తెలుసుకొందాం..

     కథ ఇదే..

    కథ ఇదే..

    కృష్ణమోహన్ అలియాస్ క్రిష్ (సిద్ధార్థ్) పేరున్న బ్రెయిన్ సర్జన్. హిమాచల్ ప్రదేశ్ పర్వత ప్రాంతంలో తన భార్య లక్ష్మీ (ఆండ్రియా జెర్మియా)తో సంతోషంగా దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తుంటాడు. అలాంటి పరిస్థితుల్లో పక్కనే ఉన్న ఇంట్లోకి పాల్ (అతుల్ కులకర్ణి) ఫ్యామిలీ చేరుతుంది. ఆ ఇంట్లో పాల్ కూతురు జెన్నీ (అనీషా విక్టర్) విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. పాల్ ఇంట్లో చోటుచేసుకొన్న భయంకరమైన పరిస్థితులు ఏమిటీ? వాటిని ఎలా పరిష్కరించారు? ఆ ఇంటికి క్రిష్‌కు సంబంధమేమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే గృహం చిత్ర కథ.

     విశ్లేషణ

    విశ్లేషణ

    హారర్ చిత్రాలన్నా, దెయ్యాలన్నా కామెడీగా మారుతున్న క్రమంలో పక్కాగా హారర్, థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం గృహం. ముఖ్యంగా హారర్ సినిమా అని చెప్పి హాస్యాన్ని అపహాస్యం చేస్తూ, ద్వందార్థాలతో రోత పుట్టిస్తున్న సమయంలో హారర్ సినిమా అంటే ఇది అనే భ్రమను కలిగిస్తుంది గృహం. ఈవిల్ డెడ్ లాంటి హాలీవుడ్ చిత్రాన్ని గుర్తుకు విధంగా గృహం ఉంటుంది. స్కిప్ట్‌లో నిజాయితీ, టేకింగ్‌లో అంకితభావం, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలాంటి అంశాలు గృహం చిత్రాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాయి. నిజమైన హారర్, థ్రిల్లర్ చిత్రాలను ఆస్వాదించే ప్రేక్షకులకు 100 శాతం మంచి అనుభూతిని పంచుతుందనే గ్యారంటీ గృహం కల్పిస్తుంది.

     ఫస్టాఫ్

    ఫస్టాఫ్

    1930లో బ్రిటీష్ పాలిత భారత్‌లో చైనా దంపతుల కథతో గృహం చిత్రం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కథ సాగుతుంది. తొలి భాగంలో సిద్ధార్థ్, ఆండ్రియా రొమాంటిక్ లైఫ్‌ను చాలా సెన్సిటివ్‌గా ఎస్టాబ్లిష్ చేస్తూ పాత్రల పరిచయం జరుగుతుంది. బ్రెయిన్ సర్జర్‌గా సిద్ధార్థ్ పాత్ర ఏమిటి అనే విషయాన్ని చకచకా చెప్పి ముగించేశాడు. సీనియర్ నటుడు సురేష్ సైక్రియాటిస్ట్ పాత్రను ఇంట్రడ్యూస్ చేసి కథకు ఏ విధంగా ఉపయోగపడునున్నాడో అనే హింట్ ఇవ్వడం జరుగుతుంది. పక్క ఇంట్లోకి అతుల్ కులకర్ణి రావడం, ఆ ఇంట్లో జరిగే భయంకర పరిస్థితుల్లోకి ప్రేక్షకుడిని తీసుకెళ్లి దర్శకుడు ప్రేక్షకుడి ధైర్యానికి సవాల్ విసురుతాడు. తొలిభాగంలో అనిషా నటన, ఆమె చూపించిన హావభావాలు సినిమాకు హైలెట్ అని చెప్పవచ్చు. ఓ చక్కటి ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ ఇవ్వడంతో సినిమా రెండో భాగంపై ఆసక్తి పెరుగుతుంది.

     సెకండాఫ్

    సెకండాఫ్

    రెండో భాగంలో సిద్ధార్థ్, అతుల్ కులకర్ణి, సురేష్, ఆండ్రియా ఇతర పాత్రలు బిహేవ్ చేసే విధానం సినిమాకు ప్రాణంగా నిలిచాయి. చివరి 20 నిమిషాల సినిమాలో సిద్ధార్థ్ నటన ఆయన ప్రతిభకు అద్ధం పట్టింది. లవర్ బాయ్‌గానే చూసిన ప్రేక్షకుడికి సిద్ధార్థ్‌లో ఈ కోణం కూడా ఉందా అనే ఆశ్చర్యం కూడా కలుగుతుంది. సిద్ధార్థ్ టాలెంట్‌కు గృహం చిత్రం ఓ గీటురాయిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

    దర్శకుడు మిలింద్ ప్రతిభ

    దర్శకుడు మిలింద్ ప్రతిభ

    ప్రేక్షకుడి నానా రకాలుగా హింసిస్తూ హారర్ చిత్రాలకు కాలం చెల్లిందనే భ్రమ కలుగుతున్న క్రమంలో మంచి కథ, కథనంతో వస్తే సినిమాను ఆదరిస్తారు అనే విశ్వాసాన్ని దర్శకుడు మిలింద్ రావ్‌ కలిగించారు. అందుకు సాక్ష్యమే గృహం. సిద్ధార్థ్‌తో కలిసి స్కిప్టును రూపొందించిన విధానం దర్శకుడు మిలింద్ ప్రతిభకు అద్దం పట్టింది. ప్రేక్షకుడికి మంచి మూడ్‌ను కలిగించడానికి, హారర్ చిత్రానికి అవసరమయ్యే కలర్ కాంబినేషన్, చిన్న చిన్న శబ్దాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దర్శకుడు తీసుకొన్న జాగ్రత్తలు సినిమాకు హైలెట్ అయ్యాయి. కొత్తదనం చూపించాలనే దర్శకుడి తాపత్రయం ప్రతీ ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. అందుకే తమిళంలో ఈ చిత్రం ద్వారా మంచి విజయాన్ని అందుకొన్నాడు.

     మల్టీటాలెంటెడ్ సిద్ధార్థ్

    మల్టీటాలెంటెడ్ సిద్ధార్థ్

    గృహం చిత్రానికి కర్త, కర్మ, క్రియ సిద్ధార్థ్. నటుడిగా, నిర్మాతగా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా సిద్ధార్‌లో కొత్త కోణం కనిపిస్తుంది. క్రిష్ పాత్రను ఎంత గొప్పగా పోషించాడో నిర్మాతగా అంతే మొత్తంలో సక్సెస్ అయ్యాడు. హీరోగా ఆయనపై ఉన్న అపవాదులన్నింటినీ చెరిపివేసుకోవడానికి గృహం చిత్రం తోడ్పాటునందిస్తుంది. సినిమా క్లైమాక్స్‌లో సిద్ధార్థ్ యాక్టింగ్ హైలెట్ అని చెప్పవచ్చు.

    అండ్రియా గ్లామర్

    అండ్రియా గ్లామర్

    దక్షిణాదిలో ఆండ్రియా వరుస విజయాలను దక్కించుకొంటున్న సమయం ఇది. డిటెక్టివ్ చిత్రంతో ఇప్పటికే ప్రేక్షకులకు తానేంటో తెలియజెప్పింది ఆండ్రియా. ఇక ఈ చిత్రంలో సాధారణ గృహిణి పాత్రతో మెప్పించింది. తెరపైన సిద్ధార్థ్‌తో కలిసి చేసిన రొమాన్స్ ప్రేక్షకుడికి గిలిగింతలు పెడుతుంది. సున్నితమైన శృంగారం, ముద్దు ముచ్చటతో దాంపత్యమంటే ఇలా ఉండాలి అనే భావనను ఆండ్రియా కల్పించింది. కేవలం రొమాన్స్‌కే పరిమితం కాలేదు. కీలక సన్నివేశాల్లో తన నటనతో ఆకట్టుకొన్నది.

     అనీషా విక్టర్ నటన అద్భుతం

    అనీషా విక్టర్ నటన అద్భుతం

    గృహం చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జెన్ని పాత్ర గురించి. ఈ పాత్రను సినిమా ప్రపంచానికి కొత్తగా పరిచమైన అనిషా విక్టర్ పోషించింది. కథకు వెన్నముకగా నిలిచే పాత్రను ఓ 100 సినిమాల అనుభవం ఉన్న నటిగా పోషించింది. తనకు లభించిన అవకాశానికి వందశాతం న్యాయం చేసింది. ఈ పాత్రలో మరొకరిని ఊహించుకోలేనంతగా ప్రేక్షకుడికి ఓ ఫీలింగ్ కలిగిస్తుంది. తొలి చిత్రమైనా ఇతర నటీనటులను మైమరిపించే విధంగా అద్భుతంగా నటించింది.

     సురేష్.. అతుల్ మరోసారి

    సురేష్.. అతుల్ మరోసారి

    సీనియర్ నటుడు సురేష్ (ప్రసాద్) మరోసారి తెరపైన ఓ కీలకపాత్రతో మెరిసాడు. తనదైన శైలిలో నటనను ప్రదర్శించి మెప్పించాడు. ఇక అతుల్ కులకర్ణి పాత్ర కూడా చాలా గొప్పగా తీర్చిదిద్దారు. అతుల్ నటన గురించి కొత్తగా చెప్పేది అక్కర్లేదు. ఎందుకంటే ఏ పాత్రనైనా అవలీలగా పోషించే తత్వం ఆయన సొంతం.

     గిరీష్ మ్యూజిక్ సూపర్

    గిరీష్ మ్యూజిక్ సూపర్

    గృహం చిత్రానికి గిరీష్ అందించిన సంగీతం అమోఘం. హరర్ చిత్రమంటే హోరెత్తే సంగీతం ఈ చిత్రంలో కనిపించదు. పక్కాగా క్వాలిటీ, క్వాంటిటీ మ్యూజిక్ మీకు వినిపిస్తుంది. తెరపైన కనిపిస్తుంది. చిన్న చిన్న శబ్దాలు కూడా ప్రేక్షకుడిని భయపెట్టించే విధంగా, కొత్త అనుభూతిని పంచేలా ఉంటాయి. గిరీష్ అందించిన సంగీతం అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోలేదు అంటే అతిశయోక్తి కాదు.

     సినిమాటోగ్రఫీ సూపర్

    సినిమాటోగ్రఫీ సూపర్

    ఇక శ్రేయాస్ కృష్ణ అందించిన సినిమాటోగ్రఫీ కన్నుల పండువగా ఉంటుంది. ప్రతీ ఫ్రేమ్‌ను చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు. తెరపైన ఉపయోగించిన కలర్ కాంబినేషన్ ప్రేక్షకుడిని కొత్త ప్రపంచాన్నిచూపిస్తుంది. వినియోగించిన లైటింగ్ సూపర్ అనిపిస్తుంది. సన్నివేశాలకు అనుగుణంగా తీసుకొన్న జాగ్రత్తలు సినిమాను మరో మెట్టెక్కించాయి.

     లారెన్స్ ప్రతిభ

    లారెన్స్ ప్రతిభ

    లారెన్స్ కిషోర్ ఎడిటింగ్ సినిమా ఆసక్తికరంగా మారేందుకు బాగా ఉపయోగపడింది. ఎక్కడ అనవసరపు సీన్లుగానీ, నిడివిగానీ ఎక్కడా కనిపించవు. తెర మీద సన్నివేశాలు పరుగులు పెట్టే విధంగా ఉంటాయి. అందుకు లారెన్స్ ప్రతిభే కారణం.

     నిర్మాణ విలువలు

    నిర్మాణ విలువలు

    గృహం చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్‌తో కలిసి సిద్ధార్థ్ నిర్మించాడు. ఈ సినిమా బడ్జెట్ సుమారు 15 కోట్లు. గృహం సినిమా నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. ప్రేక్షకుడు పెట్టే ప్రతీ పైసాకు ప్రతిఫలాన్ని అందించే భరోసాను సిద్ధార్థ్ ఇచ్చాడనే చెప్పవచ్చు.

     పాజిటివ్ పాయింట్స్

    పాజిటివ్ పాయింట్స్

    సిద్ధార్థ్, అండ్రియా, అనిషా నటన

    కథ, కథనం
    మ్యూజిక్
    సినిమాటోగ్రఫీ

    నెగిటివ్ పాయింట్స్
    ఏమీ లేవు

    స్టార్స్ అండ్ టెక్నిషియన్స్

    స్టార్స్ అండ్ టెక్నిషియన్స్

    నటీనటులు: సిద్ధార్థ్, ఆండియ్రా జెర్మియా, అనీషా ఏంజెలీనా విక్టర్, అతుల్ కులకర్ణి, సురేష్,

    దర్శకత్వం: మిలింద్ రావ్
    నిర్మాత: సిద్ధార్థ్
    సంగీతం: గిరీష్
    సినిమాటోగ్రఫీ: శ్రేయాస్ కృష్ణ
    ఎడిటింగ్: లారెన్స్ కిషోర్
    కథ, స్క్రీన్ ప్లే: మిలింద్ రావ్, సిద్ధార్థ్
    రిలీజ్ డేట్: 17 నవంబర్ 2017
    నిడివి: 137 నిమిషాలు

    English summary
    Director Milind Rau and Siddharth, who has produced and co-written the Gruham film. This film is serious note and warning for who love Horror films much. The entire film Gruham is treated with the same level of seriousness, and there’s never a dip in the tone. Cinematography, music, script, Editing departments are backbone for the Gruham. Siddharth, Andrea, Anisha victor acting skills are another attraction.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X