Guard Movie Review: గార్డ్ తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్
మూవీ: గార్డ్
నటీనటులు: విరాజ్ రెడ్డి చీలం, మిమీ లియోనార్డ్, శిల్ప బాలకృష్ణ, కమల్ కృష్ణ, మురళీ పరిసే తదితరులు
దర్శకత్వం: జగా పెద్ది
నిర్మాత: అనసూయ రెడ్డి
మ్యూజిక్ డైరెక్టర్: ప్రణయ్ కాలేరు (సాంగ్స్)
మ్యూజిక్ డైరెక్టర్: సిద్దార్థ్ ఎస్ ఆడశివుని (బీజీఎం)
సినిమాటోగ్రాఫర్: మార్క్ కెన్‌ఫీల్డ్
ఎడిటర్: రాజ్ మేడ
బ్యానర్: అను ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2025-02-28
లైఫ్‌ను జాలీగా లీడ్ చేస్తున్న తెలుగు కుర్రాడు సుశాంత్ (విరాజ్ రెడ్డి చీలం) ఆస్ట్రేలియాలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుంటాడు. దుండుగల బారి నుంచి ఓ అమ్మాయిని రక్షించే క్రమంలో డాక్టర్ సామ్ (మిమి లియోనార్డ్) పరిచయం అవుతుంది. ఆ పరిచయం వారిద్ది ప్రేమగా మారుతుంది. వారి లవ్ అఫైర్ కొనసాగుతుండడగా సామ్ శరీరంలోకి అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయిన అనిత (శిల్ప బాలకృష్ణ) ఆత్మ ప్రవేశిస్తుంది.

సెక్యూరిటీ గార్డుగా పనిచేసే సుశాంత్ ఓ అమ్మాయిని రక్షించిన తర్వాత ఏం జరిగింది? డాక్టర్ సామ్ నుంచి సుశాంత్ క్లీన్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి వచ్చింది? తొలి చూపులోనే ప్రేమలో పడిన సుశాంత్ ప్రపోజల్‌ను సామ్ ఒప్పుకొన్నాదా? సుశాంత్, సామ్ రొమాంటిక్ లైఫ్ ఎలా సాగింది? ఎలాంటి పరిస్థితుల్లో సామ్‌ను అనిత ఆత్మ ఆవహించింది? సామ్‌ను ఆత్మ ఆవహించిన తర్వాత సుశాంత్ పరిస్థితి ఏమిటి? సామ్‌నే అనిత ఆత్మ ఆవహించడానికి కారణం ఏమిటి? చివరకు అనిత ఆత్మ రివేంజ్ ఎలా తీర్చుకొన్నదనే ప్రశ్నలకు సమాధానమే గార్డ్ సినిమా కథ.
ఆస్ట్రేలియాలో స్థిరపడిన తెలుగు యువకులు.. సినిమా నిర్మాణంపై ఉన్న తపన, అభిరుచిని చాటుకోవడానికి చేసిన హారర్, థ్రిల్లర్ జోనర్ ప్రయత్నమే గార్డ్ సినిమా. దెయ్యం కథలు తెలుగు సినిమాకు రొటీన్, రెగ్యులర్ పాయింట్ అయినప్పటికీ.. ఆస్ట్రేలియా బ్యాక్ డ్రాప్‌లో ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. లవ్, రొమాన్స్, హారర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్సతో దర్శకుడు జగా పెద్ది ప్రయత్నం లోపాన్ని ఎలాంటి తప్పు పట్టనక్కర్లేదు. తన విజన్ ప్రకారం నిజాయితీగా కథను చెప్పే ప్రయత్నం చేశారు. కాకపోతే తెలుగు నేటివిటి మిస్ అయిందనిపిస్తుంది.. ఇంగ్లీష్ ప్రభావం ఉండకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే తెలుగు ఆడియెన్స్‌కు మరింత కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉండేదనిపిస్తుంది.

ఇక నటీనటుల విషయానికి వస్తే.. సుశాంత్ పాత్రతో హీరోగా నటించిన సుశాంత్ కొత్తవాడైనప్పటికీ.. అనుభవం ఉన్న కుర్ర హీరోల నటించాడు. డైలాగ్ చెప్పడంలో ఈజ్, కీలక సన్నివేశాల్లో బాడీ లాగ్వేంజ్, హవభావాలను చక్కగా పలికించాడు. నటన పరంగా ఇంకాస్త మెరుగు పరుచుకొంటే యాక్టర్‌గా ఇంకా బెటర్‌గా రాణించే అవకాశం ఉందనిపించింది. సుశాంత్, సామ్ పాత్రల మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. పాత్ర పరిధి మేరకు మిమి లియోనార్డ్ కూడా బెటర్‌గా ఫెర్ఫార్మెన్స్ చేసింది. శిల్ప బాలకృష్ణ గ్లామరస్‌గా కనిపించడమే కాకుండా తన పాత్రలో ఒదిగిపోయారు. నెగిటివ్ షేడ్ క్యారెక్టర్‌లో మురళి పరిసే నేచురల్‌గా, స్క్రీన్ ప్రజెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. సెకండాఫ్‌లో కథను మలుపు తిప్పే సన్నివేశాల్లో తనదైన నటనను ప్రదర్శించాడు. నటనకు కొత్తవాడైనా ఎక్స్‌పీరియెన్స్ యాక్టర్‌గా కనిపించాడు. మిగితా నటీనటులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా కనిపిస్తాయి. ఆస్ట్రేలియాలోని అందమైన ప్రదేశాలను సినిమాటోగ్రాఫర్ మార్క్ కెన్‌ఫీల్డ్ కెమెరాలో బంధించిన తీరు బాగుంది. సన్నివేశాలను ఎలివేట్ చేసే విధంగా సిద్దార్థ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఈ సినిమాను క్వాలిటీపరంగా, రిచ్‌గా చూపించడానికి నిర్మాత అనసూయ రెడ్డి, అను ప్రొడక్ష్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
హరర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌కు ప్రేమ కథను జోడించి అందించిన చిత్రం గార్డ్. రొటీన్ కథ, రెగ్యులర్ స్క్రీన్ ప్లేను అనుసరించినప్పటికీ.. గ్రిప్పింగ్‌గా చెప్పిన విధానం ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. కథ, కథనాలపై మరింతగా దృష్టి పెట్టి ఉంటే.. హరర్ జోనర్‌లో ఫీల్ గుడ్ సినిమా అయి ఉండేదనిపిస్తుంది. కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులు అందించే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను చూసే వారికి ఈ మూవీ నచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











