Guardians of the Galaxy Vol.3 review..విజువల్ ట్రీట్‌గా మార్వెల్ మూవీ..గార్డియెన్స్ ఆఫ్ ది గెలాక్సీ ఎలా ఉంది?
Rating: 3/5
నటీనటులు: రాకెట్ (బ్రాడ్లీ కూపర్), ఆయేషా (ఎలిజెబెత్ డెబుకీ), ది హై ఎవల్యూషనరీ (చుక్‌ఉడి ఐఊజీ), గ్రూట్ (విన్ డీజిల్), నెబ్యూల్లా (కారెన్ గిలాన్), గ్యామోరా (జో సల్దానా), పీటర్ క్విల్ అలియాస్ స్టార్ లార్డ్ (క్రిస్ ప్రాట్), స్టాకర్ ఒగార్డ్ (సిల్వెస్టర్ స్టాలోన్) తదితరులు
రచన, దర్శకత్వం: జేమ్స్ గన్
నిర్మాత: కెవిన్ ఫీజ్
మూలం: మార్వెల్ కామిక్స్
సినిమాటోగ్రఫి: హెన్నీ బ్రాహమ్
ఎడిటింగ్: ఫ్రెండ్ రస్కిన్, గ్రెగ్ డారియా
మ్యూజిక్: జాన్ మర్ఫీ
బ్యానర్: మార్వెల్ స్టూడియోస్
రిలీజ్ డేట్: 2023-05-05
గార్డియెన్స్ ఆఫ్ ది గెలాక్సీ కథ ఏమిటంటే?: గార్డియన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని రాణి ఆయేషా (ఎలిజెబెత్ డెబుకీ) అదనుకోసం ఎదురు చూస్తుంటుంది. తల్లి ఆయేషా ఆదేశాలతో ఆడమ్ వర్లాక్ (విల్ పౌల్టర్) దాడికి సిద్దమవుతాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఆడమ్ చేతిలో తీవ్రంగా గాయపడిన రాకెట్ రకూన్ (బ్రాడ్లీ కూపర్)ను కూడా కిడ్నాప్ చేసి హై ఎవల్యూషనరీ (చుక్‌ఉడి ఐఊజీ) కి అప్పగించాలని ఆయేషా రాణి ప్లాన్ చేస్తుంది.
కథలో ట్విస్టులు: గార్డియనెన్స్ ఆఫ్ గెలాక్సీపై రాణి ఆయేషా ఎందుకు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకొన్నది? రాకెట్ రకూన్ ఎలా గాయపడింది. గాయపడిన రకూన్‌ను హై ఎవల్యూషనరీ ఎందుకు టార్చర్ చేస్తాడు? ఈ కథలో గ్రూట్ (విన్ డీజీల్) పాత్ర ఏమిటి? ఆల్టర్ నేటివ్ గ్యామోరా (జో సల్తానా)తో పీటర్ క్విల్ అలియాస్ స్టార్ లార్డ్ (క్రిస్ ప్రాట్) బ్రేకప్ ఎలా జరిగింది? స్టార్ లార్డ్‌తో ప్రేమ కథను ఎందుకు మరిచిపోయింది? రాకెట్ రకూన్‌ను కిడ్నాప్ చేశారా? రకూన్ సృష్టించిన హై ఎవల్యూషనరీ.. గాయపడిన తర్వాత చికిత్స చేశాడా? గార్డియన్ ఆఫ్ గెలాక్సీపై ఆయేషా రాణి ప్లాన్ సఫలమైందా అనే ప్రశ్నలకు సమాధానమే గార్డియన్ ఆఫ్ గెలాక్సీ వాల్యూమ్ 3 కథ.

దర్శకుడు జేమ్స్ గన్ టేకింగ్ గురించి: దర్శకుడు జేమ్స్ గన్ పాత్రలను ఎస్టాబ్లిష్ చేయడానికి, కథలోకి వెళ్లడానికి కాస్త సమయం ఎక్కువగానే తీసుకోవడంతో మూవీ చాలా స్లోగా సాగినట్టు అనిపిస్తుంది. ఫస్టాఫ్ మొత్తం స్టోరీ డిటైలింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వడంతో కాస్త బోర్‌గానే అనిపిస్తుంది. గ్యామోరా, స్టార్ లార్డ్ మధ్య లవ్ ట్రాక్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. సెకండాఫ్‌లోకి వెళ్లిన తర్వాత రకూన్ కిడ్నాప్ చేసే ప్రయత్నాలు ఆకట్టుకొనేలా ఉంటాయి. గెలాక్సీ నుంచి గార్డియన్స్‌పై దాడి, క్లైమాక్స్ మంచి జోష్‌ను కలిగిస్తాయి.
గార్డియెన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3 ఎలా ఉందంటే?: మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) అవెంజర్స్: ఇన్ఫినిటి వార్ లాంటి సినిమాల తర్వాత గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3 ని రూపొందించడంలో జేమ్స్ గన్ కత్తి మీద సాము లాంటి పరిస్థితిని అధిగమించాడనే చెప్పాలి. మార్వెల్ ఫిల్మ్స్‌లో ఉండే ఎమోషన్స్ కంటే ఈ సినిమాలో భావోద్వేగాన్ని ఎక్కువ మోతాదులో పండించారనే చెప్పాలి. పీటర్ క్విల్, కొత్త గ్యామోరా మధ్య రిలేషన్స్‌కు మంచి ఎమోషనల్ టచ్ ఇచ్చారు.

నటీనటులు ఫెర్ఫార్మెన్స్ గురించి: గార్డియెన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3 మూవీలో ప్రధానంగా రాకెట్ పాత్ర చుట్టే కథ తిరుగుతుంది. రాకెట్ నేపథ్యంగా సాగే పాత్రలన్ని బాగా పెర్ఫార్మ్ చేశారు. రాకెట్‌గా బ్రాడ్లీ కూపర్, ఆయేషాగా ఎలిజెబెత్ డెబుకీ, ది హై ఎవల్యూషనరీగా చుక్‌ఉడి ఐఊజీ, గ్రూట్‌గా విన్ డీజిల్, నెబ్యూల్లా పాత్రలో కారెన్ గిలాన్, గ్యామోరా జో సల్దానా, పీటర్ క్విల్ అలియాస్ స్టార్ లార్డ్ పాత్రలో క్రిస్ ప్రాట్ తమ పాత్రల పరిధి మేరకు అద్బుతంగా నటించారు. స్టాకర్ ఒగార్డ్‌గా సిల్వెస్టర్ స్టాలోన్ స్పెషల్ అప్పీరియన్స్ ఫ్యాన్స్‌కు పండగ లాంటి ఫీలింగ్ కలిగిస్తుంది.
టెక్నికల్‌గా ఎలా ఉందంటే?: సాంకేతిక విభాగాల్లో హెన్నీ బ్రాహమ్ పూర్తి మార్కులు కొట్టేశారు. వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా బాగుంది. సెకండాఫ్‌లో వార్ సీక్వెన్స్ అద్బుతంగా డిజైన్ చేశారు. జాన్ మర్ఫీ మ్యూజిక్ బాగుంది. ఫ్రెడ్ రస్కిన్ ఎడిటింగ్ విషయంలో ఫర్‌ఫెక్షన్ చాటాడు. మార్వెల్ స్టూడియోస్ అనుసరించిన నిర్మాణ విలువలు టాప్ క్లాస్ అనిపిస్తాయి.

ఫైనల్‌గా మెప్పించిందా?:
లవ్, ఎమోషన్స్, రివెంజ్ అంశాలతో సాగే హై విజువల్ ట్రీట్‌గా అనిపించే చిత్రం గార్డియెన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3. గత రెండు పార్టులను చూసిన ప్రేక్షకులు తొందరగా కనెక్ట్ అవుతారు. తొలిసారి ఈ సిరీస్‌ను చూస్తే అర్ధం చేసుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. విజువల్‌గా మంచి ట్రీట్‌లా ఉంటుంది. మార్వెల్ సిరీస్ అందించే అనుభూతిని తప్పకుండా పొందుతారు.


Click it and Unblock the Notifications











