twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గులాబో సితాబో మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating:
    2.0/5
    Star Cast: అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా, విజయ్ రాజ్
    Director: షుజిత్ సర్కార్

    ఇండియన్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, టాలెంటెడ్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానాతో సెన్సిబుల్ డైరెక్టర్ షుజిత్ సర్కార్ రూపొందించిన చిత్రం గులాబో సితాబో. వాస్తవానికి ఈ చిత్రాన్ని థియేటర్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే కొవిడ్ 19 పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని జూన్ 12న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేశారు. ఈ సినిమా రివ్యూ తెలుగు ఫిల్మీబీట్ ప్రేక్షకుల కోసం..

    గులాబో సితాబో కథ..

    గులాబో సితాబో కథ..

    లక్నోలోని పాడుబడిన ఓ హవేలికి మీర్జా షేక్ (అమితాబ్ బచ్చన్) యజమాని. అందులో కిరాయికి ఉండే కుటుంబాల్లో బ్యాంకీ రస్తోగి (ఆయుష్మాన్ ఖురానా) ఫ్యామిలీ ఒకటి. అయితే ఎన్నో ఏళ్లుగా ఉంటూ అద్దె పెంచడానికి కూడా అంగీకరించకుండా మీర్జాను బాంకీ ఇబ్బంది పెడుతుంటారు. ఇలా వారిద్దరి మధ్య జరిగిన చిన్న చిన్న తగదాలు కోర్టు మెట్లు ఎక్కేలా చేస్తాయి. ఇలాంటి క్రమంలో ఓ ప్రాంతంలో 100 టన్నుల బంగారం ఉన్నవ్‌లో పాతిపెట్టినట్టు కల వచ్చిందని ఓ బాబా చెప్పడంతో లక్నోలో అలజడి మొదలవుతుంది. ఆర్కియాలజీ సర్వే అధికారులు తవ్వకాలు చేపడుతారు.

     గులాబో సితాబో మూవీలో ట్విస్టులు

    గులాబో సితాబో మూవీలో ట్విస్టులు

    కోర్టుకు వెళ్లిన మీర్జాకు ఎదురైన సమస్యలు ఏమిటి? బాంకీని ఖాళీ చేయించారా? బాబా చెప్పినట్టు బంగారం ఎక్కడ పాతిపెట్టారు? బంగారం నిధులకు, మీర్జా హవేలికి ఏమైనా సంబంధం ఉందా? చివరకు మిర్జా హవేలి వివాదంలో ఏం జరిగింది? మిర్జా, బ్యాంకీ మధ్య ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకొన్నాయి? చివరకు హవేలీ ఎవరికి దక్కింది అనే ప్రశ్నలకు సమాధానమే గులాబో సితాబో కథ.

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే

    పేదరికంతో బాధపడుతున్న ఒంటరి హవేలి యజమాని మిర్జా, కిరాయిదారు బ్యాంకీకి మధ్య జరిగే తగాదాలు, అద్దె పెంపు లాంటి అంశాలతో కథ మొదలవుతుంది. అలా సాదాసీదా సాగుతున్న కథలో బాబా చెప్పిన వంద టన్నుల బంగారు నిధులు అంశం కథను ఓ మలుపుతిప్పుతుంది. తన హవేలీని రక్షించుకోవడానికి ఓ పక్క మిర్జా ప్రయత్నాలు, మరో పక్క బ్యాంకీ ఇతర కిరాయిదారులు హవేలీలో తిష్టవేసే ప్రయత్నాల మధ్య కొంత ఎమోషనల్‌గా మారుతుంది.

     సెకండాఫ్ రివ్యూ

    సెకండాఫ్ రివ్యూ

    ఇక రెండో భాగంలో పురావస్తు శాఖ అధికారులు జోక్యం, కోర్టు, లాయర్ల చుట్టు మిర్జా తీరిగే అంశాలతో రొటీన్‌గా సాగుతుంది. కథలో ఎలాంటి వేగం లేకపోవడం వల్ల సహనానికి పరీక్ష పెట్టినట్టు అనిపిస్తుంది.

    అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ యాక్టింగ్

    అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ యాక్టింగ్

    నటీనటులు ప్రతిభ విషయానికి వస్తే.. అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానాలే ఈ సినిమాకు వెన్నుముక. బిగ్ బీ, ఖురానా తమ పాత్రలకు న్యాయం చేశారనిపిస్తుంది. కథలో బలం లేకపోవడం, కథనంలో వేగం లేకపోవడం, పాత్రల డిజైన్‌లో పలు లోపాలు కొట్టొచ్చినట్టు ఉండటం వల్ల ఈ ఇద్దరు గొప్ప నటులు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచడంలో విఫలమయ్యారనే చెప్పవచ్చు. కథలో ఎమోషనల్ పాయింట్స్ లేకపోవడం వల్ల రెండో భాగం కూడా ఆకట్టుకోలేకపోయింది.

    టెక్నికల్‌ అంశాల గురించి

    టెక్నికల్‌ అంశాల గురించి

    సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. పురాతన లక్నో నగర వాతావరణాన్ని చక్కగా తెరకెక్కించారు. అవిక్ ముఖోపాధ్యాయ సినిమాటోగ్రఫి బాగుంది. కథకు తగినట్టు సంగీతం చాలా తక్కువగానే వినిపిస్తుంది. ఇక షూజిత్ సర్కార్ దర్శకత్వ ప్రతిభ కూడా పెద్దగా చెప్పుకొనేంతగా లేదు. ఇద్దరు టాలెంటెడ్ యాక్టర్లతో సాదాసీదాగా సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశారు.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    గులాబో సితాబో సినిమా గురించి ఫైనల్‌గా చెప్పుకోవాలంటే కథ పసలేకుండా, కథనంలో ఆసక్తి లేకుండా తెరకెక్కించిన చిత్రమనే ఫీలింగ్ కలుగుతుంది. బాలీవుడ్ ప్రమాణాలకు దూరంగా తెరకెక్కించిన చిత్రంగా కనిపిస్తుంది. కమర్షియల్ హంగులు కోరుకొనే ప్రేక్షకులను మెప్పించడం కష్టమే అనిచెప్పవచ్చు. కమర్షియల్, ఆర్ట్ సినిమాకు మధ్య ఊగిసలాడిన సినిమాగా ఉందనే ఫీలింగ్ కలుగుతుంది.

    తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    నటీనటులు: అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా తదితరులు
    దర్శకత్వం: షుజిత్ సర్కార్
    నిర్మాత: రోని లహిరి, షీల్ కుమార్
    కథ: జుహి చతుర్వేది
    మ్యూజిక్: శంతను మోయిత్రా
    సినిమాటోగ్రఫి: అవిక్ ముఖోపాధ్యాయ
    ఎడిటింగ్: చంద్రశేఖర్ ప్రజాపతి
    రిలీజ్: 2020-06-12
    ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో

    English summary
    Gulabo Sitabo comedy-drama film directed by Shoojit Sircar, produced by Ronnie Lahiri and Sheel Kumar, and written by Juhi Chaturvedi. Set in Lucknow, it stars Amitabh Bachchan and Ayushmann Khurrana as warring men. Due to the COVID-19 pandemic, the film was not released theatrically, but was released worldwide on Amazon Prime Video on 12 June 2020.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X