twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గల్ఫ్ మూవీ రివ్యూ: వలస కార్మికుల వెతలు, జీవిత సత్యాలు

    By Rajababu
    |

    Rating:
    2.5/5

    Recommended Video

    గల్ఫ్ మూవీ రివ్యూ | Filmibeat Telugu

    సమాజంలోని సమస్యలపై సినీ అస్త్రాన్ని సంధిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న సమకాలీన దర్శకుల్లో పీ సునీల్ కుమార్ రెడ్డి ఒకరు. సునీల్ కుమార్ రెడ్డి రూపొందించే చిత్రాల్లో వాణిజ్య విలువల కంటే ప్రజల జీవితాలు, ఆ జీవితాల్లోని కష్టాలు స్పష్టంగా కనిపిస్తాయి. తాజాగా ఆయన రూపొందించిన చిత్రం గల్ఫ్. దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర సమస్యల్లో ఒకటైన అంశం గల్ఫ్ వలసలు.స్థానికంగా సరైన ఉపాధి లేక పొట్ట చేత పట్టుకొని కార్మికులుగా మారి గల్ఫ్ దేశాలకు వలస పోతుంటారు. ఊరుకాని ఊరులో భారతీయ కార్మికులు అనుభవించే కష్టాలు, వెతలు, బాధలు అంతా ఇంతా కావు. అలాంటి సమస్యను కథాంశంగా చేసుకొని రూపొందించిన చిత్రమే గల్ఫ్. ఈ చిత్రం అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకున్నదో అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

     గల్ఫ్ కథా ఇలా..

    గల్ఫ్ కథా ఇలా..

    ఉపాధి కోసం ప్రతీ ఏటా సొంత ఊరును వదిలి వలస వెళ్లే వందలాది సిరిసిల్లా చేనేత కార్మికుల్లో ఒకరిగా శివ (చేతన్ మద్దినేని) గల్ఫ్‌కు వెళ్తాడు. విమాన ప్రయాణంలో గల్ఫ్‌కు వెళ్తున్న మరో అమ్మాయి లక్ష్మీ (డింపుల్) పరిచయం అవుతున్నది. తొలిచూపులోనే వారి మధ్య ఓ ఆకర్షణ పుడుతుంది. ఆ ఆకర్షణ ఇష్టంగా మారి.. ఆ తర్వాత ప్రేమగా బలపడుతుంది. గల్ఫ్‌లో పనిచేస్తుండగా ఈ ప్రేమ జంటకు పలు కష్టాలు ఎదురవుతాయి.

     మోసాలు, అన్యాయాలు

    మోసాలు, అన్యాయాలు

    లక్ష్మీపై శారీరక దాడులు ఎక్కువైతాయి. లైంగిక వేధింపులు జరుగుతుంటాయి. జీవితం బాగుపడాలని పెట్టుకొన్న ఎన్నో ఆశలు కన్నీళ్లలో కరిగిపోతాయి. డబ్బు సంపాదించి కుటుంబాన్ని అప్పుల బాధను గట్టెక్కించాలనుకొన్న శివ గల్ఫ్‌లో మోసానికి గురవుతాడు. ఇలా గల్ఫ్‌లో జరుగుతున్న అన్యాయాలు, కష్టాల్లో ఉన్న బాధితుడిగా శివ మిగిలిపోతాడు. అలా కష్టాల్లో ఉన్న శివ, లక్ష్మీ తమ సమస్యలను ఎలా ఎదురించారు. గల్ఫ్‌లో వారితోపాటు భారతీయ కార్మికులు ఎలాంటి మోసాలకు గురి అవుతున్నారు అనే ప్రశ్నలకు సమాధానమే గల్ఫ్ చిత్రం.

     ప్రేమ కథా నేపథ్యంగా..

    ప్రేమ కథా నేపథ్యంగా..

    హీరో, హీరోయిన్లు చేతన్ మద్దినేని, డింపుల్ గల్ఫ్ ప్రయాణంతో సినిమా మొదలవుతుంది. వారి మధ్య పరిచయం, ఇతర కార్మికులు పడుతున్న కష్టాలతో సినిమా ముందుకు వెళ్తుంది. ప్రధానంగా పలు కార్మికుల కష్టాలు, వారి కుటుంబాలు పడుతున్న బాధలను తెరమీద పరిచయం చేయడం ద్వారా సినిమా ఫస్టాఫ్ పూర్తవుతుంది. గల్ఫ్‌లో జరిగే మోసాలకు బలవుతున్న కార్మికుల దుర్భర జీవితాలు హృదయాన్ని తాకుతాయి.

     షేక్‌ల మోసాలు

    షేక్‌ల మోసాలు

    సినిమా రెండో భాగంలో గల్ఫ్‌లో షేక్‌ల నుంచి తమకు ఎదురైన మోసాలను ఎదురించే క్రమంలో ఆయా పాత్రలు పడిన కష్టాలతో రెండో భాగం నడుస్తుంది. గల్ప్‌లో ఉపాధి ఓ డొల్ల అని తెలుసుకొన్న ఆయ పాత్రలు అక్కడి నుంచి తప్పించుకొని ఎలా స్వదేశానికి చేరుకొన్నారు అనేది ఈ చిత్ర ముగింపు. రెండో భాగంలో బలమైన సన్నివేశాలు లేకపోవడం, పేలవమైన స్రీన్ ప్లే ఈ సినిమాకు ఓ మైనస్.

    గల్ఫ్ కష్టాలకు ప్రతీరూపం

    గల్ఫ్ కష్టాలకు ప్రతీరూపం

    గల్ఫ్ చిత్రం సినిమా అనే కంటే పరాయి దేశంలో కొన్ని జీవితాలకు ప్రతిరూపం. కాసుల వేటలో మోసాల ఉచ్చులో కూరుకుపోయే అనేక సంఘటనలకు ఈ చిత్రం సాక్ష్యంగా నిలిస్తుంది. గల్ఫ్‌ ఉపాధి ఎండమావి లాంటిది అనే చెప్పడానికి దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి చేసిన ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. సినిమా పరంగా కొన్ని నిర్మాణ విలువలను మరింత మెరుగుపట్టాల్సిన అవసరం ఉందనే భావన కనిపిస్తుంది. ఏది ఏమైనా పలు రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యకు చక్కగా తెరరూపం కల్పించడం హర్షించాల్సిన విషయం.

     డైరెక్టర్‌గా సునీల్ కుమార్ రెడ్డి

    డైరెక్టర్‌గా సునీల్ కుమార్ రెడ్డి

    గల్ఫ్‌లో భారతీయ కార్మికుల ఉపాధి కష్టాలు, అక్కడికి వెళ్లే మహిళలపై దౌర్జన్యాలు, లైంగిక వేధింపులు, గృహ హింస తదితర అంశాలను భావోద్వేగంగా తెరకెక్కించడంలో దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి అనుసరించిన విధానం ఆకట్టుకొనేలా ఉంటుంది. సమాజంలోని బలమైన సమస్య ప్రేమ కథను నేపథ్యంగా ఎంచుకోవడం ఆయన ప్రతిభకు అద్దం పట్టింది.

     నటీనటుల ప్రతిభ

    నటీనటుల ప్రతిభ

    ఈ చిత్రంలో చేతన్ మద్దినేని, డింపుల్ చోపడే హీరో, హీరోయిన్లుగా ప్రధాన పాత్రలు పోషించారు. కొత్త వారైనా సమస్యను అర్థం చేసుకొని నటించడంతోపాటు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. మిగితా పాత్రల్లో సంతోష్ పవన్, అనిల్ కళ్యాణ్ పాత్రలు ప్రధానంగా ఆకట్టుకొంటాయి. సంతోష్ పవన్ నటనపరంగా మరింత మెరుగయ్యాడు.

     ఇతర పాత్రల్లో

    ఇతర పాత్రల్లో

    పోసాని, నాగినీడు, జీవ, నల్ల వేణు, ప్రభాస్ శ్రీను, తనికెళ్ళ భరణి, తోటపల్లి మధు, శంకరాభరణం రాజ్యలక్ష్మి, సన, తీర్థ, డిగ్గీ, బిత్తిరి సత్తి,భద్రం, మహేష్, ఎఫ్ ఎం బాబాయ్,
    పూజిత, సూర్య , శివ తమ పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు.

     మాటల రచయితగా పులగం

    మాటల రచయితగా పులగం

    గల్ఫ్ చిత్రానికి ప్రముఖ జర్నలిస్టు పులగం చిన్నారాయణ మాటలు అందించారు. ఈ చిత్ర కథలో తెలంగాణ అబ్బాయి, ఆంధ్ర పాంత్రం అమ్మాయి మధ్య జరిగే లవ్ స్టోరీ ఉంటుంది. అటు తెలంగాణ యాస, ఇటు ఆంధ్ర యాసను దృష్టిలో పెట్టుకొని మాటలు రాయడమంటే కత్తి మీద సామే. ఈ విషయంలో పులగం చిన్నారాయణ నూటికి నూరుపాళ్లు సఫలమయ్యాడు అని చెప్పవచ్చు. ఆయన అందించిన మాటలు గల్ఫ్ చిత్రానికి అదనపు ఆకర్షణగా మారాయి.

     టెక్నికల్ అంశాలు

    టెక్నికల్ అంశాలు

    గల్ఫ్ చిత్రం భావోద్వేగాల మేలవింపు. అలాంటి చిత్రానిక సంగీత దర్శకుడు ప్రవీణ్ ఇమ్మడి సంగీతం సమకూర్చారు. కీలక సన్నివేశాలలో రిరీకార్డింగ్ ఆకట్టుకున్నది. పాటలు ఆడియోపరంగానే కాకుండా తెరపైన కూడా బాగున్నాయి. గల్ఫ్ ప్రాంతాలను చక్కగా తెరకెక్కించడంలోనూ, అక్కడ ఉండే కార్మికుల వెతలను భావోద్వేగంగా తెరకెక్కించడంలో సినిమాటోగ్రాఫర్ సక్సెస్ అయ్యారు.

     ప్లస్ పాయింట్స్

    ప్లస్ పాయింట్స్

    కథ, మాటలు
    నటీనటుల ప్రతిభ
    డైరెక్షన్
    పాటలు

    మైనస్
    సెకండాఫ్
    స్క్రీన్ ప్లే

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    గల్ఫ్ చిత్రానికి కమర్షియల్ విలువలను అద్దడంలో దర్శకుడు సఫలమయ్యాడు అని చెప్పవచ్చు. కొన్ని విషయాల్లో మరింత దృష్టి పెట్టి ఉంటే సినిమా మరో స్థాయికి వెళ్లి ఉండేది.

     తెర వెనుక, తెర ముందు

    తెర వెనుక, తెర ముందు

    నటీనటులు: చేతన్ మద్దినేని, డింపుల్ చోపడే, సంతోష్ పవన్,అనిల్ కళ్యాణ్, పూజిత, సూర్య , శివ, పోసాని, నాగినీడు, జీవ, నల్ల వేణు, ప్రభాస్ శ్రీను, తనికెళ్ళ భరణి, తోటపల్లి మధు, శంకరాభరణం రాజ్యలక్ష్మి, సన, తీర్థ, డిగ్గీ, బిత్తిరి సత్తి,భద్రం, మహేష్, ఎఫ్ ఎం బాబాయ్
    దర్శకత్వం: పీ సునీల్ కుమార్ రెడ్డి
    సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి
    మాటలు: పులగం చిన్నారాయణ
    రిలీజ్: అక్టోబర్ 13, 2017

    English summary
    Gulf Movie is releasing on October 13th. This movie is directed by P Sunil Kumar Reddy. This movie story is based on Gulf Victims stories. Chetan M, Dimple are lea pair. Pulagam Chinnarayana given dialouges for the movie. Emmadi Praveen is the music director for the gulf.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X