For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Gully Rowdy Movie Review: సందీప్ కిషన్ మూవీ ఎలా ఉందంటే!

  |

  Rating:
  2.0/5
  Star Cast: సందీప్ కిషన్, నేహా శెట్టి, బాబీ సింహా, హర్ష చెముడు, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్
  Director: జీ నాగేశ్వర్ రెడ్డి

  సినిమా ప్రపంచంలో ఓటీటీ లాంటి కొత్త ఫ్లాట్‌ఫామ్స్ మీద నావెల్టీతో కూడిన కంటెంట్ చిత్రాలకు బ్రహ్మరథం పడుతున్నారు. ట్రెడిషినల్ మేకింగ్‌కు, మూస కథా చిత్రాలను ప్రేక్షకులు నిరభ్యంతరంగా తిరస్కరిస్తున్నారు. విలక్షణమైన కంటెంట్ ఉన్న చిత్రాలను బ్రహ్మండంగా ఆదరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యువ దర్శక, నిర్మాతలు సరికొత్త ఆలోచనలతో తమ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

  ఇలాంటి పరిస్థితుల్లో సందీప్ కిషన్ కూడా విభిన్నమైన చిత్రాలను ఎంచుకొంటూ ప్రేక్షకుల మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన నటించిన గల్లీ రౌడీ చిత్రం సెప్టెంబర్ 17వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం సందీప్ కిషన్ అభిరుచికి తగినట్టు ఉందా అనే విషయాన్ని ఓసారి పరిశీలించాంటే కథ, కథనాల గురించి విశ్లేషించుకోవాల్సిందే.

   గల్లీ రౌడీ సినిమా కథ..

  గల్లీ రౌడీ సినిమా కథ..

  విశాఖపట్నంలో రౌడీ కుటుంబానికి చెందిన వాసు (సందీప్ కిషన్) చిన్నతనంలో చదువుల్లో ఫస్ట్ ఉంటాడు. కానీ తన తాత (నాగినీడు), ఆయన సహాయకుడు (పోసాని మురళీ కష్ణ) వాసుని చదువు మాన్పించి రౌడీగా తయారు చేయాలనుకొంటారు. తాత కోరిక మేరకు అయిష్టంగానే రౌడీగా వాసు మారుతాడు.

  ఈ క్రమంలో పోలీస్ ఇన్స్‌పెక్టర్ పట్టపగలు వెంకటరావు (రాజేంద్ర ప్రసాద్) కూతురు సాహితి (నేహా శెట్టి)తో వాసు ప్రేమలో పడుతాడు. వెంకటరావు భూమిని బైరాగి (మైమ్ గోపి) అనే పేరు మోసిన రౌడీ కబ్జా చేస్తాడు. దాంతో వెంకటరావు కుటుంబం వాసుతో కలిసి బైరాగిని కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేస్తుంది. కిడ్నాప్ చేసే సమయంలో బైరాగి హత్యకు గురవుతాడు.

  గల్లీ రౌడీ సినిమాలో ట్విస్టులు

  గల్లీ రౌడీ సినిమాలో ట్విస్టులు

  వాసును తన తాత ఎందుకు రౌడీ చేయాలని అనుకొంటాడు? వాసు తండ్రి (ప్రకాశ్ రాజ్) మరణానికి కారణం ఏమిటి? బైరాగి, వాసు కుటుంబానికి మధ్య ఉన్న పగ, ప్రతీకారాలు ఎమిటి? బైరాగిని ఎవరు హత్య చేశారు? బైరాగి హత్య నేపథ్యంలో వెంకటరావు కుటుంబం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. బైరాగి హత్య కేసులో వాసుతో సహా వెంకటరావు కుటుంబం ఎలా బయటపడింది అనే ప్రశ్నలకు సమాధానం గల్లీ రౌడీ సినిమా కథ.

  రొటీన్ కథ, కథనాలతో

  రొటీన్ కథ, కథనాలతో

  గల్లీ రౌడీ కథ, ట్విస్టులను పరిశీలిస్తే స్టోరిలో ఎంత దమ్ము, ఏ మేరకు కొత్తదనం ఉందో అనే విషయం సులభంగానే అర్ధమవుతుంది. ఈ కాలపు ప్రేక్షకుల అభిరుచికి దూరంగా, అత్యంత రొటీన్ కథ, కథనాలతో గల్లీ రౌడీని చుట్టేసినట్టు కనిపిస్తుంది. పేలవమైన సబ్జెక్ట్‌తో జీ నాగేశ్వర్ రెడ్డి పెద్ద సాహసమే చేసి ఉంటారనే ఫిలింగ్ కలుగుతుంది. కథ పాతదైన కొత్తగా చెప్పే ప్రయత్నం చేసిన దాఖలాలు కనిపించవు. పక్కా ఫార్మూలతో 80వ దశకం నాటి సినిమాను చూసిన ఫీలింగ్ కలుగుతుంది. వెరసి అతి సాధారణమైన సినిమాను చూసిన అనుభవం, అనుభూతి కలుగుతుంది.

  మెప్పించని సందీప్ కిషన్

  మెప్పించని సందీప్ కిషన్

  నటుడిగానే కాకుండా, నిర్మాతగా మంచి కంటెంట్ ఉన్న చిత్రాలతో సందీప్ కిషన్ ఇటీవల కాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే తన అభిమానులు కూడా ఉహించిన కథలో సందీప్ నటించాడనే చెప్పవచ్చు. తన రేంజ్ సరిపడని కంటెంట్‌ ఉన్న చిత్రంలో నటించాడనే చెప్పాలి. దీంతో సినీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచలేకపోయాడనే చెప్పవచ్చు. హీరోయిన్‌తో ఎలాంటి కెమిస్ట్రీ కనిపించని వాసు పాత్రలో కనిపించాడు.

  నిరాశ పరిచిన బాబీ సింహ, రాజేంద్రప్రసాద్

  నిరాశ పరిచిన బాబీ సింహ, రాజేంద్రప్రసాద్

  ఇక రాజేంద్ర ప్రసాద్ విషయానికి వస్తే.. ఆయనకు కూడా రొటీన్ పాత్రే. తన పాత్ర పరిధి మేరకు పాత మేనరిజమ్స్‌తో అలా ముందుకు పోయాడు. ఇక హీరోయిన్ నేహ శెట్టికి కూడా పెద్దగా నటించడానికి స్కోప్ లేకపోయింది. బాబీ సింహా క్యారెక్టరైజేషన్ కూడా సరిగా లేదు. వెన్నెల కిషోర్ రెండు మూడు సీన్లలో నవ్వించే ప్రయత్నం చేశాడు. పోసాని, షకలక శంకర్‌, హర్ష శంకర్‌ది కూడా రొటీన్ పాత్రలే. ఇక బైరాగిగా మైమ్ గోపి పాత్ర కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది.

  పసలేని కథ, రొటీన్ స్క్రీన్ ప్లే

  పసలేని కథ, రొటీన్ స్క్రీన్ ప్లే

  గల్లీ రౌడీ సినిమా తెర వెనుక నిపుణుల విషయానికి వస్తే.. భాను భోగవరం అందించిన కథలో పస లేదు. దాంతో బలమైన స్క్రీన్ ప్లేకు కూడా అవకాశం లేకపోయింది. దాంతో చిత్రం నాసిరకంగా మారిపోయింది. వైజాగ్ అందాలను సుజాత సిద్ధార్థ్ చక్కగా కెమెరాలో బంధించాడు. పసలేని కథను కూర్పు చేయడానికి చోటా కే ప్రసాద్ తంటాలే పడి ఉంటాడు. సినిమా ల్యాగ్ లేకుండా కొంత మేరకు చోటా ప్రయత్నించాడనే విషయం కనిపిస్తుంది. ఈ సినిమాలో పాటలకు అంతగా స్కోప్ లేదు. కానీ రీరికార్డింగ్ వలన కొన్ని సన్నివేశాలు బలంగా కనిపించాయి.

  టార్గెట్ మిస్ అయిన కోన వెంకట్

  టార్గెట్ మిస్ అయిన కోన వెంకట్

  ఇక ప్రొడక్షన్ వ్యాల్యూస్ విషయానికి వస్తే.. కోన వెంకట్ సినిమా అంటే కొంత మినిమమ్‌గా కథ ఉంటుంది. అయితే గల్లీ రౌడీ విషయానికి వస్తే బైరాగికి సంబంధించిన ఇద్దరు కొడుకుల కథను పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారనే చెప్పవచ్చు. సినిమా పేలవంగా మారడానికి ఆ యాంగిల్‌ను లేట్‌గా టచ్ చేయడం ప్రధాన కారణమనే ఫీలింగ్ కలుగుతుంది. బాబీ సింహ పాత్రను మరింత బెటర్‌గా డిజైన్ చేసి ఉంటే సెకండాఫ్ సినిమాను నిలబెట్టడానికి అవకాశం ఉండేది. నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

  ఫైనల్‌ జడ్జిమెంట్

  ఫైనల్‌ జడ్జిమెంట్

  ఓ తండ్రి మరణానికి పగ తీర్చుకొనే కొడుకు, మరో తండ్రికి పుట్టిన ఇద్దరు కొడుకుల మధ్య భిన్నాభిప్రాయల నేపథ్యంగా గల్లీ రౌడీ తెరక్కెక్కింది. కథలోని బలమైన పాయింట్‌ను ఎస్టాబ్లిష్ చేయడానికి బదులు రాజేంద్ర ప్రసాద్ ఫ్యామిలీ చుట్టు కథ అల్లడంతో సినిమా తేలిపోయిందా అనే అంశం కొట్టొచ్చినట్టు అనిపిస్తుంది. సినిమా మొత్తంలో ఇంటర్వెల్ పాయింట్ కొంత ఆసక్తికరంగా అనిపిస్తుంది. పసలేని కథ, రొటీన్ స్క్రీన్ ప్లే, పాత తరం మేకింగ్ లాంటి అంశాలు గల్లీకే పరిమితమయ్యాయని చెప్పవచ్చు. కోన, సందీప్ కిషన్ అభిమానులకు గల్లీ రౌడి అసంతృప్తిని కలిగిస్తాడనే విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు.

  Bazaar Rowdy Movie Hero Sampoornesh Babu Exclusive Interview | Part 3
  గల్లీ రౌడీ చిత్రంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

  గల్లీ రౌడీ చిత్రంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

  నటీనటులు: సందీప్ కిషన్, నేహా శెట్టి, బాబీ సింహా, హర్ష చెముడు, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ మురళీ, షకలక శంకర్, మైమ్ గోపి తదితరులు
  స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జీ నాగేశ్వర్ రెడ్డి
  కథ: భాను భోగవరం
  రచన: నందు సావిరిగన
  నిర్మాతలు: కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ
  సినిమాటోగ్రఫి: సుజాత సిద్ధార్థ్
  ఎడిటింగ్: చోటా కే ప్రసాద్
  మ్యూజిక్: రవి మిర్యాల, సాయి కార్తీక్
  బ్యానర్: కోనా ఫిల్మ్ కార్పోరేషన్, ఎంవీవీ సినిమాస్
  రిలీజ్ డేట్: 2021-09-17

  English summary
  Sandeep Kishan's gully rowdy movie review: Its a murder mystery with outdated content. Neha Shetty, Posani, Myme Gopi, Bobby Simha are in lead role. This movie hits the screen on September 17th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X