For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుణ 369 మూవీ రివ్యూ అండ్ రేటింగ్

|

Rating:
3.5/5
Star Cast: కార్తీకేయ, అనఘ, నరేష్, ఆదిత్యమీనన్, జబర్దస్త్ మహేష్
Director: అర్జున్ జంధ్యాల

RX 100 తర్వాత కార్తీకేయ నటించిన గుణ 369 సినిమాపై సినీ వర్గాల్లో మొదటి నుంచే మంచి బజ్ ఏర్పడింది. జాపిక ప్రొడక్షన్స్, స్రింట్ ఫిల్మ్స్ ద్వారా అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి, ప్రవీణ కడియాల సినీ నిర్మాణంలోకి ప్రవేశించారు. వారు చేపట్టిన వినూత్న ప్రచారం, టీజర్లు, ట్రైలర్లు, ఆడియో ప్రమోషన్‌కు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమా ద్వారా ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శిష్యుడు అర్జున్ జంధ్యాల దర్శకుడిగా పరిచయం కావడం సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం నిర్మాతలకు, దర్శకుడు అర్జున్ జంధ్యాల, హీరో కార్తీకేయకు ఎలాంటి సక్సెస్‌ను అందించిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

గుణ 369 కథ..

గుణ 369 కథ..

ఒంగోలుకు చెందిన గుణ (కార్తీకేయ) బీటెక్ పాసవ్వడానికి కష్టపడుతూ ఓ గ్రానైట్ కంపెనీలో పనిచేస్తుంటాడు. ఎలాంటి గొడవలకు వెళ్లని మంచి అబ్బాయి. తన వీధిలోకి వచ్చిన గీత (అనఘ)తో ప్రేమలో పడుతాడు. జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో అదే ఊరికి చెందని రౌడీ గద్దలగుంట రాధ (ఆదిత్య మీనన్) హత్య కేసులో జైలుకు వెళ్తాడు.

గుణ 369 ట్విస్టులు

గుణ 369 ట్విస్టులు

రాధ హత్యకేసులో ఎందుకు జైలుకు వెళ్లాడు? రాధా హత్య తర్వాత గుణ జీవితంలో ఎలాంటి సమస్యలు చోటుచేసుకొన్నాయి. రాధాను హత్య చేసిందెవరు? రాధాను హత్య చేయడానికి కారణమేమిటి? గీతతో ప్రేమ సఫలమైందా? తన కుటుంబాన్ని ఇలాంటి ఇబ్బందుల నుంచి ఎలా కాపాడుకొన్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే గుణ 369 కథ.

ఫస్టాఫ్ ఎలా ఉందంటే

ఫస్టాఫ్ ఎలా ఉందంటే

ఒంగోలులోని ఓ గ్రామంలో ఓ దాడి ఘటనతో మంచి హై నోట్‌లో సినిమా మొదలవుతుంది. తొలి పది నిమిషాలు సినిమా పవర్ ఏంటో రుచి చూపిస్తుంది. ఆ తర్వాత నేరుగా కథలోకి వెళ్లిపోవడంతోపాటు కార్తీకేయ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడం, అనఘతో రొమాన్స్, అఫైర్ అంశాలతో కథ కొద్దిగా స్లో అవుతుంది. లవ్ ట్రాక్‌ సినిమా ఒకే అనిపించేలా ఉండటం కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ బ్యాంగ్‌తో సినిమా కథ చెప్పే స్వరూపమే మారిపోతుంది.

సెకండాఫ్ అనాలిసిస్

సెకండాఫ్ అనాలిసిస్

సెకండాఫ్‌తో గుణ 369కు ప్రాణంగా నిలిచింది. ఎమోషన్స్, కథలో ట్విస్టులు, ప్రతీ ఒక్కరి ఫెర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్‌గా నిలిచేలా ఉంటాయి. ఇక కథలో ఉండే ఇంటెన్సిటీ ప్రేక్షకుడిని కొత్త అనుభూతిని కలిగిస్తుంది. చివరి 20 నిమిషాలు ఎవరూ ఊహించని విధంగా ప్రేక్షకుడిని మెస్మరైజ్ చేస్తుంది.

డైరెక్టర్ టేకింగ్

డైరెక్టర్ టేకింగ్

తొలి చిత్ర దర్శకుడిగా అర్జున్ జంధ్యాల తన సత్తాను చాటుకొన్నాడనే చెప్పవచ్చు. తొలి భాగంలో లవ్ ట్రాక్‌ను నడిపించేందుకు కొంత తడబాటుకు గురైనట్టు కనిపించిన అర్జున్.. సెకండాఫ్‌లో చెలరేగిపోయాడు. హీరో కార్తీకేయలో ఉండే పాజిటివ్ ఎనర్జీని అవసరమైన ప్రతీ చోట బ్రహ్మండంగా వాడుకొన్నాడు. ఫస్టాఫ్‌లో ప్రారంభంలో వచ్చే కొన్ని సీన్లు, ఇంటర్వెల్ బ్యాంగ్‌ను అనుభవం ఉన్న దర్శకుడిగా హ్యాండిల్ చేశాడు. ఇక సెకండాఫ్‌‌లో అర్జున్ జంధ్యాల సత్తా ఏంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

హీరో కార్తీకేయ

హీరో కార్తీకేయ

ఇక గుణ 369 కార్తీకేయ నటనలోని మరో కోణాన్ని చూపిస్తుంది. గత రెండు చిత్రాల్లో కంటే గుణగా పూర్తి స్థాయి మెచ్యురిటీని చూపించాడు. సెకండాఫ్‌లో కథను పూర్తిగా తన భుజాల మీద వేసుకొని కథను నడిపించాడు. అన్ని రకాల పాత్రను పోషించగలను అనే సంకేతాలను ఒదిలాడు. సరైన కథలను ఎంచుకొంటే మంచి మాస్ హీరోగా ఎదగడం ఖాయం. మాస్, ఎమోషనల్ సీన్లలో అదరగొట్టాడని చెప్పవచ్చు. బలమైన రొమాంటిక్ సీన్ల లేకపోవడం వల్ల కొంత తడబాటు కనిపిస్తుంది.

హీరోయిన్ అనఘ

హీరోయిన్ అనఘ

గీత పాత్రలో అనఘ ఒదిగిపోయింది. నిజంగా పక్కింటి అమ్మాయి అనే ఫీలింగ్‌ను కలిగించడంలో వందశాతం సఫలమయ్యారు. నటనపరంగా అనఘ మెప్పిస్తుంది. గ్లామర్ పరంగా కూడా ఆకట్టుకొంటుంది. నటనలోని కొన్ని లోపాలను సవరించుకొంటే మరో నివేదా థామస్ లాంటి నటిని మనం చూడటానికి అవకాశం ఉంటుంది.

ఇతర పాత్రల్లో

ఇతర పాత్రల్లో

ఇతర పాత్రల్లో నరేష్, హేమ, ఆదిత్య మీనన్, జబర్దస్త్ మహేష్ నటించారు. గద్దలగుంట రాధగా ఆదిత్య మీనన్ పాత్ర సినిమాకు బలం అనిచెప్పవచ్చు. ఆదిత్య మీనన్ పాత్ర చుట్టే సినిమా అల్లుకోవడం వల్ల అతడి నటన ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. నరేష్, హేమలు మంచి స్వభావం ఉన్న తల్లిదండ్రులుగా ఆకట్టుకొంటారు. ప్రతీ ఇంట్లో చూసే తల్లిదండ్రులను వారు మరిపిస్తారు. జబర్దస్త్ మహేష్ నటన, కామెడీ టైమింగ్ బాగుంది. రంగస్థలం, మహానటి తర్వాత మరో అద్భుతమైన పాత్రలో కనిపిస్తాడు. ఎవరూ ఊహించిన విధంగా నటనతో మెప్పిస్తాడు.

టెక్నికల్ విభాగాల పనితీరు

టెక్నికల్ విభాగాల పనితీరు

టెక్నికల్ విభాగాల విషయానికి వస్తే, సినిమాటోగ్రాఫర్‌గా రామిరెడ్డి తన పనితీరుతో ఆకట్టుకొన్నాడు. జీయమ్‌ శేఖర్ ప్రతిభను చక్కగా వాడుకొన్నారు. ఊరి వాతావరణాన్ని చక్కగా ప్రతిబించేలా తెరకెక్కించారు. యాక్షన్ సీన్లు చాలా హైలెట్‌గా చిత్రీకరించారు.. గ్రాఫిక్స్ వర్క్ కూడా నీట్‌గా ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌ ఫైట్ సందర్భంగా ఇతర కొన్ని సన్నివేశాలు గ్రాఫిక్స్ బాగున్నాయి.

పాటల ప్లేస్‌మెంట్

పాటల ప్లేస్‌మెంట్

ఇక RX 100 సినిమాతో మంచి మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకొన్న చైతన్ భరద్వాజ్ ఆడియో పరంగా ఆకట్టుకొన్నాడు. పాటల ప్లేస్‌మెంట్ సరిగా లేకపోవడం వల్ల తెరమీద పాటలు రిజిస్టర్ కావడానికి సమస్యగా కనిపిస్తుంది. ఎడిటర్ తమ్మిరాజు మరోసారి తన కత్తెరకు పదను చూపించాడు. ఫస్టాఫ్‌లో సినిమాను కొంత ట్రిమ్ చేస్తే సినిమా మరింత బాగుంటుంది.

ప్రొడక్షన్ వ్యాల్యూస్

ప్రొడక్షన్ వ్యాల్యూస్

గుణ 369 చూసిన తర్వాత సరైన కథతోనే జాపిక ప్రొడక్షన్స్, స్రింట్ ఫిల్మ్స్ ద్వారా అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి, ప్రవీణ కడియాల సినీ నిర్మాణంలోకి ప్రవేశించారనే ఫీలింగ్ కలుగుతుంది. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ సినిమాను అందించడంలో సఫలమయ్యారని చెప్పవచ్చు. పాత్రల ఎంపిక, సాంకేతిక నిపుణుల కూర్పు బాగుంది. ఆడపిల్లలను వేధింపులకు గురిచేసే వారిని కఠినంగా శిక్షించాలనే సామాజిక సందేశాన్ని కమర్షియల్‌గా చెప్పడానికి చేసిన ప్రయత్నం అభినందనీయం.

ఫైనల్‌గా

ఫైనల్‌గా

సామాజిక సందేశం, వినోదం, మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన చిత్రం గుణ 369. సెకండాఫ్‌లో సినిమా కథ చాలా ఇంట్రెస్టింగ్, ఎమోషనల్‌గా తీర్చిదిద్దడంలో నూతన దర్శకుడు అర్జున్ జంధ్యాల తన మార్కును ఎస్టాబ్లిష్ చేసుకొన్నాడు. కార్తీకేయ కమర్షియల్‌ హీరోగా మరో మెట్టు ఎక్కుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనే విధంగా సినిమా రూపొందింది. బీ,సీ సెంటర్లలో ఉండే ఆదరణ బట్టి ఈ సినిమా సక్సెస్ ఏ రేంజ్ రెండు రోజులు స్పష్టమవ్వడం ఖాయం.

బలం, బలహీనత

బలం, బలహీనత

పాజిటివ్ పాయింట్స్

  • కార్తీకేయ పెర్ఫార్మెన్స్
  • అర్జున్ జంధ్యాల డైరెక్షన్, టేకింగ్
  • ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా

నెగిటివ్ పాయింట్స్

  • ఫస్టాఫ్‌లో లవ్ ట్రాక్
  • స్లో నరేషన్
నటీనటులు, సాంకేతిక వర్గం

నటీనటులు, సాంకేతిక వర్గం

తెరవెనుక, తెర ముందు

మూవీ: గుణ 369

నటీనటులు: కార్తీకేయ, అనఘ తదితరులు

కథ, దర్శకత్వం: అర్జున్ జంధ్యాల

నిర్మాత: అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి, ప్రవీణ కడియాల

సినిమాటోగ్రఫి: రాంరెడ్డి

మ్యూజిక్: చైతన్ భరద్వాజ్

ఆర్ట్‌ డైరెక్టర్‌ : జీయమ్‌ శేఖర్,

ఎడిటర్ : తమ్మిరాజు ,

డాన్స్ : రఘు,

ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌లు : స‌త్య కిశోర్‌, శివ మల్లాల.

రిలీజ్ డేట్: ఆగస్టు 2, 2019

English summary
After bagging a sensational hit with RX100, story that was reeled out of real life incidents, Actor Kartikeya seems to don another challenging role in his 3rd movie directed by debutant Arjun Jandyala. Produced by Anil Kadiyala, Tirumal Reddy under Gnapika Productions & Sprint Films, movie is titled as 'Guna 369' and it's announced to be a True Story turning around a real & rustic love drama. This movie released on August 2nd.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more