గోదారే... (‘గుండెల్లో గోదారి' రివ్యూ)

By Srikanya

-సూర్య ప్రకాష్ జోశ్యుల

Rating:
2.0/5
1986 నాటి దివిసీమ ఉప్పెన... ఆ నేపధ్యంలో ఓ ప్రేమ కథ... పొయిటిక్ టచ్ తో కూడిన గుండెల్లో గోదారి అనే టైటిల్, ఫీల్ తో కూడిన ప్రోమోలు ఇవన్నీ ప్రేక్షకుడ్ని థియోటర్ వరకూ లాక్కుని వెళ్లే అంశాలే. అందులోనూ బి.వియస్ రామారావు గారు రాసిన గోదావరి కథలు నుంచి ఓ కథ తీసుకుని... తెరకెక్కించి, సాహిత్యాభిమానుల్లోనూ ఆసక్తి రేపారు. అయితే ఆ ఆసక్తి తగినట్లు సినిమా నడపలేదు. మూడు, నాలుగు పేజీల చిన్న కథను తెరకు ఎక్కించటానికి చేసిన స్క్రీన్ ప్లే కుదరలేదనిపిస్తుంది. ఫస్టాఫ్ సింపుల్ గా చక్కగా లాక్కెళ్లి పోయి శభాష్ అనిపించుకున్నా.. సెకండాఫ్ కి వచ్చేసరికి... శృతిమించిన సెంటిమెంట్, మెలో డ్రామా కలగలిసి సహన పరీక్ష పెట్టాయి. తెలుగుకి ఓవర్ డోస్ అనిపించిన ఈ చిత్రం..తమిళ ప్రేక్షకులకు ఎక్కుతుందేమో చూడాలి.

చేపలు పట్టుకు బ్రతికే మల్లి(ఆది), స్లమ్ ఏరియాకు చెందిన చిత్ర(మంచు లక్ష్మి ప్రసన్న) వివాహం జరుగుతున్న సమయంలో గోదావరి ఒడ్డున ఉన్న ఆ గ్రామాన్ని వరదలు ముంచెత్తుతాయి. వీరిద్దరూ ప్రాణాలు దక్కించుకోవటానికి ఓ గడ్డివాము మీదకు చేరుతారు. ప్రాణాలు ఉంటాయో.. పోతాయో తెలియని ఆ స్ధితిలో తమ గురించిన నిజాలు ఒకరికొకరు చెప్పుకోవాలని నిర్ణయించుని తమ గతాన్ని ఆవిష్కరించుకుంటారు. ఇంతకూ ఆ గతం ఏమిటి... చివరకు వీరిద్దరూ బ్రతికి బయిటపడ్డారా.. సినిమాలో సందీప్, తాప్సీ పాత్రలు ఏమిటి అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

'టైటానిక్' సినిమాతో పోల్చుతూ వచ్చిన ఈ చిత్రం...గోదావరిలో ఓ జంట తమను తాము ఆవిష్కరించుకున్న కథనం... తెలుగుకి ఓ కొత్త ప్రయోగమే. కమర్షియల్ ఒరవడిలో కొట్టుకుపోతున్న తెలుగు సినీ పరిశ్రమలో పరిచయం కాబోతున్న ఓ కొత్త దర్శకుడు.. దాన్ని విభేదిస్తూ... ఇలాంటి కథతో పరిచయం కావాలనుకోవటం ఖచ్చితంగా అభినందించతగ్గ ఆలోచనే. ఆ ఉత్సాహానికి లక్ష్మి ప్రసన్న వంటి నిర్మాత మంచి బడ్జెట్ తో ప్రాణం పోసి తోడవటం ఆనందకర విషయం. అయితే ఎంచుకున్న కథపై మరింతగా కసరత్తు చేసి కథనం రూపొందించుకుంటే బావుండేది. ప్లాష్ బ్యాక్ నేరేషన్ లో చెప్పిన ఈ కథ.. ఇద్దరు జీవితాలకు చెందిన గతాన్ని విప్పి చెప్తుంది. ఫస్టాఫ్ లో హీరో ఆది తన గురించి చెప్పిన గతం తాప్సీ.. తో రొమాన్స్ కలగలసి కలర్ ఫుల్ గా... ఉషారుగా సాగిపోయింది. అదే సెకండాఫ్ కి వచ్చేసరికి.. లక్ష్మి ప్రసన్న ప్లాష్ బ్యాక్ చాలా డార్క్ షేడ్స్ తో.. పూర్తి సెంటిమెంట్ టచ్ తో... మెలోడ్రామా గా మారి, విసిగించింది. ఆది ప్లాష్ బ్యాక్ లాగే.. సింపుల్ గా.. లక్ష్మి ప్రసన్న గతం కూడా ఎక్కువ గజిబిజి చెయ్యకుండా ఆవిష్కరించి ఉండి ఉంటే బావుండేది. అయితే తమిళంలోనూ రిలీజ్ చేస్తున్నాం కదా అనుకుని రాసామో ఏమో కానీ... మరీ అతి సెంటిమెంట్ తో సీన్స్ నడిపించారు. దానికి తోడు క్లైమాక్స్ అందరూ ఊహించిందే కావటం కూడా ఇబ్బంది కర అంశం.

మిగతా రివ్యూ స్లైడ్ షో లో...

గోదారే...  (‘గుండెల్లో గోదారి' రివ్యూ)

దర్శకుడు కుమార్ నాగేంద్ర.. తన తొలి చిత్రానికి ఎంచుకున్న కథ.. అద్బుతమైనదే. అలాగే పాత్రలు కూడా నిజ జీవితాన్ని ప్రతిబింబిస్తూ సాగాయి. అంతకుమించి గోదావరి నేటివిటీని సినిమాకు అద్దటంలో సఫలీకృతుడయ్యాడు.

గోదారే...  (‘గుండెల్లో గోదారి' రివ్యూ)

మృగం చిత్రంతో తానేంటో నిరూపించుకున్న ఆది... ఈ సినిమాలోనూ అద్బుతమైన ఫెరఫార్మెన్స్ ఇచ్చాడు. కాస్ట్యూమ్స్, మేకప్ దగ్గరనుంచి అంతా పల్లె మత్యకారుడుని దింపేసాడు.

గోదారే...  (‘గుండెల్లో గోదారి' రివ్యూ)

సెకండాఫ్ లో సందీప్ కిషన్ ఊహించని విధంగా తనలోని నటనా కౌసలాన్ని అవిష్కరించుకున్నాడు. స్లమ్ కుర్రాడిగా.. కోడి పందాలు పిచ్చి ఉన్నోడుగా జీవించాడనే చెప్పాలి.

గోదారే...  (‘గుండెల్లో గోదారి' రివ్యూ)

నిర్మాతగా, నటిగా మంచు లక్ష్మి ఎక్కడారాజీ పడలేదు. కాకపోతే సందీప్ వెనకపడే పాత్రలో ఆమె వయస్సు కాస్త ఎక్కువైదేమో అనిపిస్తుంది.

గోదారే...  (‘గుండెల్లో గోదారి' రివ్యూ)

తనకు నచ్చిన వాడితో జతకట్టేందుకు ఎంతకైనా తెగించే డబ్బున్న గ్రామీణ అమ్మాయిగా... తాప్సీ అదరకొట్టింది. సినిమాకు ఏకైక గ్లామర్ ఆమే. అలాగే ఈ సినిమాలో లాంటి పాత్ర ఒప్పుకోవటం కూడా గ్రేటే.

గోదారే...  (‘గుండెల్లో గోదారి' రివ్యూ)

దొరబాబుగా రవిబాబు, జీవా, గోదావరి జిల్లా స్లాంగ్ పలుకుతూ ప్రవీణ్ తమ తమ పాత్రలకు న్యాయం చేసారు. ముమైత్ ఖాన్ ఐటం సాంగ్ ఓకే.

గోదారే...  (‘గుండెల్లో గోదారి' రివ్యూ)

ఇళయారాజా సంగీతం థియోటర్ లో ఉన్నంత సేపు బాగుంది. పాటలు ఆయన పాత ట్యున్స్ ని గుర్తు చేస్తూ సాగాయి. అయితే ఆయనిచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది.

గోదారే...  (‘గుండెల్లో గోదారి' రివ్యూ)

ఎం.ఆర్.పళనికుమార్ కెమెరా వర్క్ ఈ సినిమాకు మరో ప్రత్యేకత. వరదలు, రొమాంటిక్ సీన్స్ ని ఆయన చాలా స్క్రీన్ పై ప్రెజెంట్ చేసారు. డైలాగ్స్ విషయానికి వస్తే... కొన్ని బాగా పేలాయి... ముఖ్యంగా గోదావరి జిల్లా యాసను బాగా ప్రెసెంట్ చేసారు.

గోదారే...  (‘గుండెల్లో గోదారి' రివ్యూ)

సినిమాకు సమకూర్చిన గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి. వరదలు సన్నివేశాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆర్ట్ డైరక్షన్ కూడా సినిమాకు నేపధ్య కాలానికి తీసుకు వెళ్లటానికి పనికివచ్చింది.

గోదారే...  (‘గుండెల్లో గోదారి' రివ్యూ)

గుండెల్లో గోదారి మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో తెరకెక్కిన చిత్రం. ఈ చిత్రంతో పరిచయమైన దర్శకుడు ఎంచుకున్న కథని బట్టి మంచి టేస్ట్ ఉందని, అలాగే నటీనటుల నుంచి ఫెరఫార్మె న్స్ తీసుకోవంటంలో నైపుణ్యం ప్రదర్శించటంతో పరిణితి ఉందని అర్దమవుతోంది.

గోదారే...  (‘గుండెల్లో గోదారి' రివ్యూ)

బ్యానర్: మంచు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవెట్ లిమిటెడ్
నటీనటులు: ఆది పనిశెట్టి, తాప్సీ, మంచు లక్ష్మి, సుదీప్ కిషన్, మురళీ మోహన్, రవిబాబు, జీవా, అన్నపూర్ణ, తదితరులు
పాటలు: చంద్రబోస్, అనంత్‌శ్రీరామ్, రాము,
ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ,
కెమెరా: ఎం.ఆర్.పళనికుమార్,
నిర్మాత: లక్ష్మీ మంచు,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కుమార్ నాగేంద్ర.
విడుదల తేదీ: 08 మార్చి, 2013.

ఏదైమైనా ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు తెలుగులో అరుదు..మైనస్ లను ప్రక్కన పెట్టి ఆదరిస్తే ఇలాంటివి మరిన్ని వచ్చేందుకు అవకాశం ఉంది. దివిసీమ ఉప్పెన చూద్దామనుకున్నా లేదా గుర్తు చేసుకుందామనుకున్నా ఈ సినిమా ఆ అవకాసం కల్పిస్తుంది. అలాగే గోదావరి అందాలు తనివి తీరా చూసే అవకాసం కల్పిస్తుంది... కాబట్టి ఆ యాంగిల్ లోనూ ఓ లుక్కు వెయ్యవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X