Don't Miss!
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
గురి..ప్రేక్షకులుబలి!
-జోశ్యుల సూర్యప్రకాష్
చిత్రం:చంటి
నటీనటులు:రవితేజ, చార్మి, అంజలి, అతుల్ కులకర్ణి, ఎమ్మెస్‌నారాయణ ధర్మవరపు సుబ్రమణ్యం,వేణుమాధవ్ తదితరులు
సంగీతం: శ్రీ
సాహిత్యం:వేటూరి, సిరివెన్నెల
దర్శకత్వం:శోభన్
నిర్మాత: కృష్ణకిషోర్
హీరో తండ్రినిచంపిన విలన్. హీరో కోసం పరితపించేఇద్దరు హీరోయిన్లు. అన్నగారి అనురాగంలోతడిసి ముద్దయ్యే హీరో గుడ్డి చెల్లెలు. ఇది మన తెలుగుసినిమాసాదాసీదా పాపులర్ ఫార్ములా. మళ్ళీ అదే ఫార్ములాను అటక మీదనుంచి తీసి దుమ్ముదులిపి తీసిన చిత్రం చంటి. వర్షంవంటి సూపర్‌హిట్ సినిమా తీసిన దర్శకుడు శోభన్, నా ఆటోగ్రాఫ్ తర్వాతమళ్ళీ మాస్ ఇమేజి సాధించాలనుకుంటున్నరవితేజ కాంబినేషన్లో వచ్చిన చిత్రమిది.
కథంటూపెద్దగా లేని ఈ సినిమాలో ఊపు తెప్పించే పాటలు,డ్యాన్సులకు కొదవలేదు. రిటైర్డ్మేజర్ మాధవరావు (రంగనాథ్)కొడుకు చంటి. చంటి కూడా తండ్రి బాటలోమిలిటరీలో చేరి రాష్ట్రపతి పతకం సాధిస్తాడు. తండ్రి మరణవార్త వినిపల్లెకు తిరిగివచ్చి తండ్రి అంత్యక్రియలుజరిపిస్తాడు. ఆ పల్లెలోనే అతని గుడ్డి చెల్లెలు, వసంతలక్ష్మి(చార్మి) అనేవాగుడు కాయ ఉంటారు. తండ్రికి ప్రభుత్వంఇచ్చిన ఐదెకరాల స్ధలంలో సమాధి కడతాడు.
సమాధే ఈ కథకు పునాది. ఆ ఊళ్ళోనేసర్వారాయుడు (అతుల్ కులకర్ణి) అనేఎమ్మెల్యే ఉంటాడు. ఎమ్మెల్యే కొనుక్కున్నఫ్యాక్టరీకి అడ్డదారిలో రోడ్డు నిర్మించడానికి చంటితండ్రి సమాధి ఉన్న స్ధలంఅవసరమవుతుంది. ఎమ్మెల్యే ఆ స్ధలాన్నిఅమ్మమంటే తండ్రి మీద ఉన్నసెంటిమెంట్తో చంటి ససేమిరా అంటాడు.ఎమ్మెల్యే సామ దాన దండోపాయాలుప్రయోగించినా చంటి లొంగడు. తన తండ్రిహార్ట్ ఎటాక్‌తో చనిపోలేదని, ఎమ్మెల్యే దురాగతానికిబలయ్యాడని తెలుసుకునివిలన్ని హీరో చంపేస్తాడు.
సాదాసీదాగా సాగిన ఈ కథలో విలన్ చెల్లెలు (అంజలి)పాత్రను సృష్టించి, ఆమెతో అసలు హీరోయిన్‌కు పోటీ పెట్టి , పాటలు పెట్టి రొమాన్సు నడిపాడు దర్శకుడు. ఈ చిత్రంలో కథ లక్ష్యం ఫ్యాక్టరీ తెరిపించి కార్మికులను ఆదుకోవడం. హీరో లక్ష్యం మరికటి ఉంది తన తండ్రి సమాధిని కాపాడు కోవడం. ఈ రెండు లక్ష్యాలు క్లాష్ కావడం వల్ల కథ సహజంగానే బలహీన పడింది.
హీరోయిన్లు ఇద్దరినీ చిన్న నాటి స్నేహితులుగా పరిచయం చేసి పెద్దయ్యాక వాళ్ళు స్నేహంగా ప్రవర్తించకుండా డైరెక్టుగా ప్రేమలో పడడం డైరెక్టరు తప్పు కాదు. మన మూస ఫార్ములాల ప్రభావం. చంటి తండ్రిని విలన్ చంపడం వసంత లక్ష్మి ప్రత్యక్షంగా చూస్తుంది కానీ ఏమాత్రం ఫీలింగ్ ఆమెలో కన్పించదు.
స్క్రిప్టులో అనేక వీక్ లింక్స్ కారణంగా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. రవితేజ మేక ప్ వైఫల్యం కారణంగా అతను తెర మీద గ్లామరస్‌గా కన్పించలేదు. విలన్ అతుల్ కులకర్ణి బాగా నటించాడు. వేణుమాధవ్ చేసింది ఒక్క సీన్ అయినా బాగా పండింది. మొత్తం మీద అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న సామెతను తలపించే సినిమా ఇది. లోపమంతా కథ, స్క్రీన్ ప్లేలోనే.