Gurram Paapi Reddy Movie Review: గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగి బాబు, ప్రభాస్ శ్రీను, రాజ్ కుమార్ కాసిరెడ్డి, జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్ తదితరులు
రచన, దర్శకత్వం: మురళీ మనోహర్
నిర్మాతలు: వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ)
సినిమాటోగ్రఫి: అర్జున్ రాజా
మ్యూజిక్: కృష్ణ సౌరభ్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
కథ: పూర్ణ ప్రజ్న
డైలాగ్స్: నిరంజన్ రామిరెడ్డి
సమర్పణ: డాక్టర్ సంధ్య గోలీ
బ్యానర్: ఎంజేఎం మోషన్ పిక్చర్స్, బురా, సద్ది క్రియేటివ్ వర్క్స్
రిలీజ్ డేట్: 2025-12-19

ఖమ్మం జిల్లాకు చెందిన గుర్రం పాపిరెడ్డి (నరేష్ అగస్త్య) ఓ విషయంలో మోసపోయి ఓ సమస్యలో ఇరుక్కొంటాడు. తనను మోసగించిన హయగ్రీవా, నీలాగ్రీవా (జాన్ విజయ్ బ్యాచ్)కు బుద్ది చెప్పడానికి ఓ దోపిడికి ప్లాన్ వేసి విఫలమవుతాడు. దాంతో జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. జైలులో మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఎర్రగడ్డ హాస్పిటల్‌కు తరలిస్తే.. అక్కడ నర్సుగా పనిచేసే సౌదామిని (ఫరియా అబ్దుల్లా) పరిచయమౌతుంది. తాను కూడా ఆర్థికంగా మోసానికి గురి కావడంతో పాపిరెడ్డితో సౌదామిని చేతులు కలుపుతుంది. ఈ క్రమంలో మిలటరీ (రాజ్ కుమార్ కాసిరెడ్డి) చిలిపి (వంశీధర్ కోసి), గొయ్యి (జీవన్) తో కలిసి జట్టుగా ఏర్పడుతారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం అడువుల్లో శవాన్ని దొంగతనం చేయడానికి ప్లాన్ వేస్తారు.

గుర్రం పాపిరెడ్డి ఎలాంటి మోసానికి గురై జైలుకు వెళ్లాల్సి వచ్చింది? ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌లో పేషెంట్‌గా ఎందుకు చేరాడు? శవాలను పూడ్చి పెట్టే వృత్తిని కొనసాగించే గొయ్యికి కళింగ వారసత్వంతో లింక్ ఏమిటి? చిల్లర దొంగతనాలు చేసే ఉండ్రాజు (యోగిబాబు) క్రిస్టియన్ పాస్టర్‌గా ఎందుకు మారాడు? గొయ్యి విషయంలో న్యాయమూర్తి (బ్రహ్మానందం) డీఎన్‌ఏ టెస్ట్‌కు ఎందుకు ఆదేశించారు? డీఎన్ఏ టెస్ట్ వ్యవహారం ఎలాంటి కథను ఎలాంటి మలుపులు తిప్పింది అనే ప్రశ్నలకు సమాధానమే గుర్రం పాపిరెడ్డి సినిమా కథ.

Gurram Paapi Reddy Movie Review

తెలుగు సినిమా పరిశ్రమలో కాన్సెప్ట్, కంటెంట్ ప్రధానంగా వచ్చే చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. చిన్న బడ్జెట్ సినిమానా? అగ్ర హీరో, హీరోయిన్లు ఉన్నా సినిమా? అనే తేడా లేకుండా విజయాన్ని అందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంచి కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే బలాన్ని ఆధారంగా చేసుకొని మురళీ మనోహర్ రాసుకొన్న వినోదభరితమైన క్రైమ్ కామెడీ బాగుంది. కానీ సినిమా నిడివి విషయంలో కొంత రాజీ పడి ఉంటే బెటర్‌గా ఉండేది. అలాగే ఫస్టాఫ్‌లో ఇంకా బెటర్ కంటెంట్ జొప్పించి ఉంటే ఫీల్ గుడ్ క్రైమ్ థ్రిల్లర్ అయి ఉండేది. అయినా సెకండాఫ్‌లో కథను అనేక మలుపులు, ట్విస్టులతో ఆసక్తికరమైన అంశాలతో సినిమాను పరుగులు పెట్టించిన విధానం ఆయన ప్రతిభకు అద్దం పట్టింది. స్టుపిడిటి అనే పాయింట్‌తో బ్రహ్మానందంతో హుందాతనమైన కామెడీ పండించిన విధానం చాలా బాగుంది. జీవన్ కుమార్, కసిరెడ్డి, యెగిబాబు, వంశీధర్ పాత్రలతో హిలేరియస్ కామెడీని వర్కవుట్ చేసిన తీరు ఈ సినిమాకు ప్లస్‌గా మారింది. సాధారణ ప్రజలు మోసాలకు గురయ్యే ఫైనాన్షియల్ క్రైమ్స్ చుట్టు అల్లుకొన్న కథ చాలా బాగుంది.

యువ హీరో, హీరోయిన్లు నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా సినిమా భారన్నంతా తమ భుజాలపై మోశారు. రకరకాల గెటప్స్‌లో కనిపించి కథకు కొత్తదనాన్ని తీసుకొచ్చారు. బ్రహ్మానందం, యోగి బాబు, ప్రభాస్ శ్రీను, రాజ్ కుమార్ కాసిరెడ్డి, జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి కామెడీ సీన్లు బాగున్నాయి. ముఖ్యంగా జీవన్ కుమార్ ఈ సినిమా యాక్టింగ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. యోగిబాబు కనిపించిన సీన్లు మాత్రం కడుపుబ్బ నవ్విస్తాయి. జాన్ విజయ్ విలనిజం డిఫరెంట్‌గా ఉంది. ఓవరాల్‌గా నటీనటుల టీమ్ వర్క్ ఈ సినిమాల కనిపిస్తుంది.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. అర్జున్ రాజా కెమెరా వర్క్, కృష్ణ సౌరబ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాలోని సన్నివేశాలను, కంటెంట్‌ను బాగా ఎలివేట్ చేశాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడాల్సింది. నిరంజన్ రామిరెడ్డి రాసిన డైలాగ్స్ కొన్ని చోట్ల బాగా పేలాయి. వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) అనుసరించిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్స్‌లో ఉండటమే కాకుండా సినిమాపై వారి అభురుచిని తెలియజేశాయి. క్రైమ్ కామెడీ సినిమాలను ఆదరించే వారికి, అలాగే కంటెంట్ బేస్ ఉంటే సినిమాలను ఇష్టపడే వారికి గుర్రం పాపిరెడ్డి తప్పకుండా నచ్చుతుంది. అంచనాలు లేకుండా వెళ్తే మంచి అనుభూతిని పంచుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X