Gurram Paapi Reddy Twitter Review: గుర్రం పాపిరెడ్డి ట్విట్టర్ రివ్యూ

ఫరియా అబ్దుల్లా, నరేష్ అగస్త్య జంటగా మురళీ మనోహర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుర్ర్ం పాపిరెడ్డి. ఎంజేఎం మోషన్ పిక్చర్స్, బురా అండ్ సద్ది క్రియేటివ్ ఆర్ట్స్‌ పతాకాలపై వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. యోగి బాబు, బ్రహ్మానందం, రాజ్‌కుమార్ కసిరెడ్డి, వంశీధర్ కోస్గి, జీవన్ కుమార్, జాన్ విజయ్, మోట్టా రాజేంద్రన్‌ తదితరులు కీలకపాత్ర పోషించారు.

గుర్రం పాపిరెడ్డి సినిమాకు కృష్ణ సౌరబ్ సూరంపల్లి సంగీత దర్శకత్వం వహించారు. అర్జున్ రాజా సినిమాటోగ్రాఫర్‌గా, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. పూర్ణ ప్రజ్ఞ కథను అందించగా.. నిరంజన్ రామిరెడ్డి డైలాగ్స్ రాశారు. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో గుర్రం పాపిరెడ్డి సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. డిసెంబర్ 19వ తేదీన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో నెటిజన్లు, క్రిటిక్స్, సినీ ప్రమఖుల అభిప్రాయాల్లోకి వెళితే...

Gurram Paapi Reddy Twitter Review in Telugu  will Faria Abdullah hits the bulls eye

మరో చిన్న సినిమాకు కూడా పెయిడ్ ప్రీమియర్స్ బాగా పనిచేశాయి. నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా నటించిన గుర్రం పాపిరెడ్డి చిత్రం.. ప్రీమియర్స్‌లో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఫన్, డార్క్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటోంది. అందరూ చూడదగ్గ చిత్రమని ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ రమేశ్ బాలా ట్వీట్ చేశారు.

నరేష్ అగస్త్య, ఫరియా అబ్ధుల్లాలు ఆన్ స్క్రీన్ యాక్టింగ్ సూపర్. మెయిన్‌గా ప్రతి ఆర్టిస్ట్ బాగా నటించారు. బీజీఎం స్కోర్ బ్లాస్టింగ్‌లా ఉంది. క్లైమాక్స్, ఇంటర్వెల్ బాగుంది. ఓవరాల్‌గా అందరూ చూడదగ్గ సినిమా అని ఓ యూజర్ రివ్యూ ఇచ్చాడు.

100 పర్సెంట్ ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్. ఫస్టాఫ్‌లో బాడీ ఎక్స్చేంజ్ కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది. అందరూ బాగా చేశారు.. రాజ్ కుమార్ కసిరెడ్డి హైలైట్‌గా నిలిచాడు. బీజీఎం ఎనర్జిటిక్‌గా ఉంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మొత్తం మీద సానుకూల వాతావరణంతో థియేటర్‌లో ఎంజాయ్ చేయొచ్చు అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.

గుర్రం పాపిరెడ్డి ఫస్టాఫ్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. ఫ్రెష్ కామెడీ ట్రాక్స్, సిట్యువేషన్‌కి తగ్గట్లుగా కామెడీ సూపర్‌గా ఉంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బ్లాస్టే. సెకండాఫ్‌లో కామెడీ ఫీస్ట్ నవ్వులు పూయించింది. బ్రహ్మానందం, యోగి బాబు, గుండు శ్యామ్‌ల కామెడీ హైలైట్‌గా నిలిచింది. గ్రేవ్‌యార్డ్, కోర్ట్ సీన్స్ బాగా క్లిక్ అయ్యాయి. ఓవరాల్‌గా ఫన్ ఫిల్డ్ ఎంటర్‌టైనర్ అని ఓ యూజర్ రివ్యూ ఇచ్చాడు.

నరేష్ అగస్త్య, ఫైరా పర్ఫార్మెన్స్ సూపర్. కామెడీ వర్కవుట్ అయ్యింది. క్లైమాక్స్ ట్విస్ట్ బ్లాస్టే. 100 పర్సెంట్ ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.

గుర్రం పాపిరెడ్డిలో లీడ్ క్యాస్ట్ పర్ఫార్మెన్స్ సూపర్‌గా చేశారు. కామెడీ చాలా బాగా వర్కవుట్ అయ్యింది. థియేటర్‌లో చూడటానికి మంచి సినిమా. మూవీ ప్లాట్ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

More from Filmibeat

Read more about: movie news Gurram Paapi Reddy
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X