twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాక్సింగ్ కోచ్‌గా వెంకటేష్ నాకౌట్ (గురు రివ్యూ)

    విక్టరీ వెంకటేష్ తన ఇమేజ్ దూరంగా నటిస్తున్న తాజా చిత్రం గురు. ఈ చిత్రం హిందీలో నిర్మితమైన సాలా ఖడూస్ అనే చిత్రానికి రీమేక్. టాలీవుడ్ కమర్షియల్ హంగులకు కొంచెం దూరంగా ఈ చిత్రం రూపొందింది.

    By Rajababu
    |

    Rating:
    2.5/5
    Star Cast: వెంకటేష్, రితికా సింగ్, నాజర్
    Director: సుధా కొంగర

    విక్టరీ వెంకటేష్ తన ఇమేజ్ దూరంగా నటిస్తున్న తాజా చిత్రం గురు. ఈ చిత్రం హిందీలో నిర్మితమైన సాలా ఖడూస్ అనే చిత్రానికి రీమేక్. బాక్సింగ్ క్రీడ నేపథ్యంగా దర్శకురాలు సుధ కొంగర రూపొందించిన చిత్రానికి బాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించుకున్నది. తమిళం (ఇరుది సుత్రు)లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లను సంపాదించింది. టాలీవుడ్ కమర్షియల్ హంగులకు కొంచెం దూరంగా రూపొందిన చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? విక్టరీ వెంకటేష్ తన ఇమేజ్‌ను పక్కన పెట్టి చేసిన సినిమా ఏ మేరకు ప్రేక్షకులను సంత‌ృప్తి పరిచిందో తెలుసుకోవాలంటే గురు కథంటే తెలుసుకోవాల్సిందే.

    బాక్సింగే జీవితం..

    బాక్సింగే జీవితం..

    ఆది (వెంకటేష్‌)కి బాక్సింగ్‌ అంటే ప్రాణం. ఆవేశం, దూకుడుతనం అతని నైజం. బాక్సింగ్‌ అకాడమీలో రాజకీయాల వల్ల తాను అనుకొన్న ఒలంపిక్ పతకం చేజారుతుంది. అకాడమీ ప్రెసిడెంట్ తీరు వల్ల కోచ్‌గా కూడా ఆదికి అనేక సమస్యలు ఎదురవుతాయి. బాక్సింగ్ క్రీడకు ఆదరణ లేని విశాఖపట్నానికి మహిళల బాక్సింగ్‌ కోచ్‌గా అకాడమీ ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. విశాఖలో రామేశ్వరి అలియాస్ రాముడు అలియాస్ రాముడు (రితికా సింగ్‌) ఆది ద‌ృష్టిని ఆకర్షిస్తుంది. రామేశ్వరి కూరగాయలు అమ్ముకొంటూ కుటుంబ భారాన్ని మోస్తుంది. అక్క లక్స్ పాప (ముంతాజ్ సర్కార్) బాక్సింగ్ క్రీడలో రాణించి పోలీసు ఉద్యోగం సంపాదించేందుకు తన శక్తి మేరకు సహాయపడుతుంటుంది.

    క్రీడలు.. రాజకీయాలు..

    క్రీడలు.. రాజకీయాలు..

    రామేశ్వరిలో ఉండే సహజసిద్ధమైన బాక్సింగ్ నైపుణ్యం ఆదిని కట్టిపడేస్తుంది. రామేశ్వరిని మంచి బాక్సర్ తీర్చిదిద్ది తాను సాధించలేని లక్ష్యాన్ని ఆమె ద్వారా కలను సాకారం చేసుకోవాలనుకుంటాడు. రామేశ్వరిని ఆది ఎలా ఛాంపియన్‌గా తయారు చేశాడు. ఆ నేపథ్యంలో ఆదికి ఎదురైన సవాళ్లు ఏంటి? అకాడమీ రాజకీయాలను ఎలా ఎదురించాడు. ఇంతకి రామేశ్వరి వరల్డ్ చాంఫియన్ అయిందా అనే ప్రశ్నలకు సమాధానం గురు చిత్రం.

    డిఫరెంట్‌గా విక్టరీ

    డిఫరెంట్‌గా విక్టరీ

    ఇటీవల దంగల్, సుల్తాన్ లాంటి క్రీడా నేపథ్యం ఉన్న చిత్రాలకు ముందే సాలా ఖడూస్ వచ్చినా వాటంతటి ప్రాచుర్యం పొందలేదు. కానీ విమర్శకులను ఆ చిత్రం ఆలోచింపజేసేలా చేసింది. సాలా ఖడూస్ చిత్రం ఓ వర్గం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. తమిళంలోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకొన్నది. ఈ క్రమంలో హీరోయిజంను పక్కన పెట్టి వయసుకు తగిన పాత్రను చేయాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో విక్టరీ వెంకటేస్ ధృష్టిని ఆకర్షించిన చిత్రం మిది.

    వెంకటేష్ పరకాయ ప్రవేశం

    వెంకటేష్ పరకాయ ప్రవేశం

    గత చిత్రాలకు భిన్నంగా తన లుక్స్, బాడీలాంగ్వేజ్‌ను ఆసాంతం మార్చుకొని వెంకటేష్ ఆది పాత్రలో పరకాయ ప్రవేశం చేసేలా దర్శకురాలు సుధా కొంగర చేసిన ప్రయత్నం సఫలమైందనే చెప్పవచ్చు. పాత్ర పరిధి మేరకు కనిపించాల్సిన కసి, ఆవేశం, దూకుడుతనాన్ని సమపాళ్లలో చూపించడం వల్ల చిత్రంపై ప్రేక్షకుడి ఆసక్తి మరింత పెంచింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎమోషన్‌కు గురిచేసేలా ఉన్నాయి.

    దర్శకురాలి ప్రతిభ

    దర్శకురాలి ప్రతిభ

    ఈ చిత్రంలో అమ్మాయిలపై కోచ్‌ల దౌర్జన్యం, లైంగిక వేధింపులు దర్శకురాలు సుధ కళ్లకు కట్టినట్టు చూపించారు. అలాంటి వ్యక్తులు క్రీడా రంగంలో ఉంటే ఇలాంటి చిత్రాలు రావడం వల్ల కొంత తమ ప్రవర్తను మార్చుకొనేందుకు సహాయపడుతాయి. కానీ ఎవరైనా తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో చేర్పించాలనుకుంటే వారిని భయపెట్టే విధంగా ఉన్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

    . రియల్ బాక్సర్ రితికా

    . రియల్ బాక్సర్ రితికా

    స్వతహాగా రితికాసింగ్ అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ క్రీడాకారిణి కావడం, సినిమా కోసం బాక్సింగ్‌లో తర్ఫీదు పొందడం వల్ల పాత్ర మరింత ఆకట్టుకునేందుకు దోహదపడింది. తెలుగులో క్రీడా నేపథ్యం ఉన్న చిత్రాలు రావడం చాలా అరుదు. ఒకవేళ వచ్చినా దానికి ఫ్యామిలీ, కమర్షియల్, కామేడి ఎలిమెంట్లను జోడించి కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేయడమే కాకుండా అసలు విషయాన్ని పక్కదారి పట్టించేలా రూపొందాయి.

    సింగిల్ ట్రాక్.. సక్సెస్ ఫార్మూలా

    సింగిల్ ట్రాక్.. సక్సెస్ ఫార్మూలా

    సింగిల్ ట్రాక్ మీద కథను నడిపించి ప్రేక్షకుడిని ఆకట్టుకోవడం ఈ సినిమా వందశాతం సఫలమైందని బలంగా చెప్పవచ్చు. గురు, శిష్యుల మధ్య ఉండే ఎమోషన్స్ అలానే అక్క (ముంతాజ్ సర్కార్) , చెల్లి మధ్య ఉండే అనురాగాన్ని దర్శకురాలు సుధ బాగా చూపించారు. సినిమా వినోదం, ఇతర ఎలిమెంట్ల జోలికి పోకుండా మొత్తం ఎమోషన్స్ మీదే నడిపించడం సుధ ప్రతిభకు అద్దం పట్టింది.

    ఆదిగా మాత్రమే వెంకటేష్

    ఆదిగా మాత్రమే వెంకటేష్

    ఈ సినిమాలో మనకు తెలిసిన వెంకటేష్ ఎక్కడ కనిపించడు. కోచ్ పాత్రలో ఆదిగా మాత్రమే కనిపించేలా ఒదిగిపోయాడు. వెంకటేష్ బాడీలాంగ్వేజ్ కొత్తగా ఉంది. క్లైమాక్స్ సన్నివేశాల్లో సహజసిద్ధమైన నటనను ప్రదర్శించాడు. ఎమోషన్స్ పండించడంలో తనకు తానే సాటి అని మరోసారి గురు చిత్రం ద్వారా వెంకటేష్ నిరూపించుకొన్నాడని చెప్పవచ్చు. దృశ్యం, గోపాల గోపాల లాంటి చిత్రాల తర్వాత తన వయసు తగ్గ పాత్రలను వెంకటేష్ ఎంచుకోవడం ద్వారా ఇతర నటులకు మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉంది.

    ఆకతాయి.. అల్లరి పిల్లగా

    ఆకతాయి.. అల్లరి పిల్లగా

    ఇక రితికాసింగ్ అల్లరి, ఆకతాయి పిల్లగా మెప్పించింది. అయితే రితికా బాడీలాంగ్వేజ్‌కు ఆమె ద్వారా చెప్పించిన భాష శైలి సరితూగకపోవడం మైనస్ పాయింట్‌గా చెప్పవచ్చు. నేచురాలిటి కోసం డిక్షన్ ప్రయత్నించకపోయి ఉంటే బాగుండేదేమో అనే భావన కలిగిస్తుంది. మార్కెట్లో కూరగాయలు అమ్మే అమ్మాయిలు చక్కటి భాషను మాట్లాడుతుండటం మనం చూస్తు ఉంటాం. ఇక పవన్ కల్యాణ్ ఫ్యాన్‌గా ఆయనను అనుకరిస్తూ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ఆడియన్స్‌ను ఆలరించడం ఖాయం.

    నాజర్, భరణి ఒకే..

    నాజర్, భరణి ఒకే..

    నాజర్, భరణిలు బాక్సింగ్ కోచ్‌లుగా, రఘుబాబు, అనితా చౌదరీ రితికాకు తల్లిదండ్రులుగా తమ పాత్ర పరిధి మేరకు పర్వాలేదనిపించారు. వీరి పాత్రలు సన్నివేశాల మార్పు కోసం ఉన్నట్టు ఉంటాయే కానీ సినిమాకు అదనంగా లాభం కలింగే అంశాలు చాలా తక్కువ. బాక్సింగ్ అకాడమీ అధ్యక్షుడు దేవ్ ఖాత్రి (జాకీర్ హుస్సేన్) పాత్ర విలనీ ఛాయలు ఉన్నప్పటికీ అంతగా ఎస్టాబ్లిష్ కాలేకపోయింది.

    ఆకట్టుకునేలా సాంకేతిక అంశాలు

    ఆకట్టుకునేలా సాంకేతిక అంశాలు

    కథతోపాటు ఈ సినిమాలో సాంకేతిక అంశాలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. శక్తివేల్ సినిమాటోగ్రఫీ బావుంది. బాక్సింగ్ రింగ్‌లో ఉండే ఎమోషన్స్‌ను, ఫైట్స్‌ను అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమాకు మరో హైలైట్ మ్యూజిక్. ‘ఏయ్ సక్కనోడ', ‘గుండెలోతులలో' అనే పాటలు ఆకట్టుకున్నాయి. వెంకటేష్ పాడిన జింగిడి.. జింగిడి' పాట కొరియోగ్రఫీ బాగుంది. సినిమాలో పాటలన్నీ సందర్భానుసారంగా ఉన్నాయి.

    వెంకీ జింగిడి.. జింగిడి

    వెంకీ జింగిడి.. జింగిడి

    వెంకటేష్ తొలిసారి జింగిడి జింగిడి పాట ఆడియోకు జోష్‌ను పెంచింది. పాట చిత్రీకరణ కూడా తెరపై హుషారుగా సాగింది. గాయకుడిగా, విలక్షణ నటనను ప్రదర్శించడంలో వెంకటేష్ పరిణతిని చూపించాడు. కుటుంబ కథా చిత్రాలతోపాటు, విభిన్నమైన చిత్రాలతో మహిళా ప్రేక్షకులకు దగ్గరైన వెంకటేష్ ఈ చిత్రం ద్వారా మరింత చేరువ కావడం గ్యారంటీ.

     హర్షవర్ధన్ అదనపు బలం

    హర్షవర్ధన్ అదనపు బలం

    హర్షవర్ధన్ రాసిన మాటలు కొన్ని సన్నివేశాల్లో షార్ప్‌గా ఉన్నాయి. వెంకటేష్ బాడీ లాంగ్వేజ్‌ డైలాగ్స్ అదనపు బలాన్ని ఇచ్చాయి. సంతోష్ నారాయణన్ సంగీతం ఒకే. నిర్మాత శశికాంత్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

    ప్రేక్షకులను ఆర్షించే అంశంపైనే..

    ప్రేక్షకులను ఆర్షించే అంశంపైనే..

    ఉద్వేగ భరితమైన కథ, ఆసక్తిని పెంచే కథనం, విలక్షణమైన పాత్రల మేలవింపుతో రూపొందిన చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే బీ, సీ సెంటర్లలో ఆడియెన్స్‌ను ఏ మొత్తంలో ఆకర్షిస్తుందనే అంశంపైనే సినిమా సక్సెస్, రేంజ్ ఆధారపడి ఉంటుంది.

     పాజిటివ్ పాయింట్స్

    పాజిటివ్ పాయింట్స్

    వెంకటేష్ లుక్స్, బాడీలాంగ్వేజ్, నటన
    రితికా ఫెర్ఫార్మెన్స్
    మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్

    మైనస్ పాయింట్స్
    మ్యూజిక్

    సినిమా వివరాలు..

    సినిమా వివరాలు..

    చిత్రం పేరు: గురు
    నటీనటులు: వెంకటేష్, రితికాసింగ్‌, జాకీర్ హుస్సేన్, ముంతాజ్‌ సర్కార్, నాజర్‌, తనికెళ్ల భరణి, రఘుబాబు, అనితా చౌదరి తదితరులు
    సంగీతం: సంతోష్‌ నారాయణన్‌
    ఛాయాగ్రహణం: శక్తివేల్‌
    మాటలు: హర్షవర్థన్‌
    నిర్మాత: ఎస్‌.శశికాంత్‌
    రచన, దర్శకత్వం: సుధ కొంగర
    రిలీజ్ డేట్: 31 మార్చి 2017

    English summary
    Victory Venkatesh, Ritika Singh starrer Guru Is intense sports drama. This kind films important for Tollywood. Well made sports drama in Telugu. It's more rare to find like Venkatesh as lead actor very gracious.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X