Hai Jawani To Ishq Hona Hai Hindi Movie Review: హై జవానీ తో ఇష్క్ హోనా హై మూవీ రివ్యూ అండ్ రేటింగ్
మూవీ: హై జవానీ తో ఇష్క్ హోనా హై
నటీనటులు: వరుణ్ ధావన్, పూజా హెగ్డే, మృణాల్ థాకూర్, మౌనీ రాయ్, కృతిసనన్, మనీష్ పాల్, చంకీ పాండే, జిమ్మి ష్రెగిల్, రాకేష్ బేడీ, అలీ అస్గర్ తదితరులు
దర్శకత్వం: వరుణ్ ధావన్
నిర్మాత: రమేష్ తౌరానీ
కథ: ఫర్హాద్ సమ్జీ
సినిమాటోగ్రాఫర్: ఆయాంక బోస్
ఎడిటర్: రితేష్ సోని
మ్యూజిక్: రాజు సింగ్, వైట్ నాయిస్ కలెక్టివ్, జావెద్ మోహిసిన్
బ్యానర్: టిప్స్ ఫిల్మ్స్, మాక్సీమిలియన్ ఫిల్మ్స్
రిలీజ్ డేట్: 2026-06-05
జస్విందర్ అహుజా అలియాస్ జాస్ (వరుణ్ ధావన్) ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. ఓ పెళ్లిలో బానీ (మృణాల్ థాకూర్)ను తొలి చూపులోనే ప్రేమించి పెళ్లి చేసుకొంటాడు. జాస్ అంటే కూడా బానీకి చెప్పలేనంత ఇష్టం. కొన్నేళ్ల దాంపత్య జీవితం తర్వాత వారి మధ్య అభిప్రాయబేధాలు తలెత్తడంతో విడాకులు తీసుకోవాలని అనుకొంటారు. భార్య బానీ నిర్ణయంతో బాధతో విదేశాలకు వెళ్లిన జాస్‌కు ప్రీత్ (పూజా హెగ్డే) పరిచయమై ప్రేమగా మారుతుంది. వారిద్దరూ శారీరకంగా ఒక్కటవ్వడంతో ప్రీత్ గర్భవతి అవుతుంది. ఈ పరిస్థితుల్లో జాస్‌ను వెతుక్కొంటూ వచ్చి తాను గర్భవతి అని బానీ చెబుతుంది. దాంతో జాస్ పెద్ద సమస్యలో ఇరుక్కొంటాడు.
జాస్, బానీ మధ్య పుట్టిన ప్రేమ ఎలా భార్యభర్తలుగా చేసింది? భర్త జాస్‌తో బానీకి ఉన్న సమస్య ఏమిటి? భర్త జాస్‌పై బానీ చేసే ఫిర్యాదు ఏమిటి? పీకల్లోతు ప్రేమలో ఉన్నప్పటికీ వారిద్దరు విడాకులు తీసుకోవాలని అనేంత నిర్ణయం ఎందుకు తీసుకొన్నారు? ప్రీత్, జాస్ మధ్య అఫైర్ ఎలా సాగింది? పెళ్లి కాకుండానే ప్రీత్ తల్లి కాబోతున్న విషయం తెలిసి జాస్ రియాక్షన్ ఏమిటి? ప్రెగ్నెన్సీతో తన వద్దకు వచ్చిన క్రమంలో జాస్ పరిస్థితి ఏమిటి? జాస్ ద్వారా ప్రీత్ గర్బవతి అయిందని తెలిసిన తర్వాత బానీ రియాక్షన్ ఏమిటి? జాస్‌కు అంతకు ముందే బానీతో పెళ్లి అయిందని తెలిసిన తర్వాత ప్రీత్ పరిస్థితి ఏమిటి? ఈ కథలో డ్యాన్సర్ (మౌనీ రాయ్) పాత్ర ఏమిటి? ప్రీత్, బానీ మధ్య నలుగుతుంటే తన లైఫ్‌లోకి వచ్చిన బాల్య స్నేహితురాలు (కృతి సనన్)తో జాస్ రిలేషన్‌షిప్ ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే హై జవానీ తో ఇష్క్ హోనా హై సినిమా కథ.

80, 90 దశకాల్లో బాలీవుడ్‌కు, అగ్ర నటులకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు డేవిడ్ ధావన్ తన కొడుకు వరుణ్ ధావన్ కోసం వండి వార్చిన రొమాంటిక్ లవ్, ఫ్యామిలీ డ్రామాను చూస్తే.. ఆయన ఇంకా 90 దశకంలోనే ఆగిపోయాడనేది ఫస్ట్ ఫ్రేమ్‌లో చూస్తే అర్ధమౌతుంది. కథలోకి ముందుకు వెళ్లిన కొద్ది ఆ ఫీలింగ్ బలంగా మారుతుంది. రొటీన్, రెగ్యులర్, బూజు పట్టిన కథ, కథనాలను దులిపి ముఖం మీద విసిరి కొట్టాడా? అనే ఫీలింగ్ కలుగుతుంటుంది. 40 ఏళ్ల క్రితం కూడా ఇంకా బెటర్‌గా తీసిన సందర్భాలు గుర్తుకు వస్తాయి. నాసిరకమైన సీన్లు, పేలవమైన డైలాగ్స్, అతిగా ప్రవర్తించే క్యారెక్టర్లు, ఏ క్షణంలోను ఆకట్టుకొని కథ సహనానికి పరీక్షగా మారుతాయి. బలవంతంగా రుద్దిన కామెడీ, శృంగారం, రొమాన్స్ పేరుతో అతితో దాదాపు రెండు గంటలపాటు వినోదం పేరుతో నరకాన్ని చూశామనే అనుభవంతో బయటకు రావడం జరుగుతుంది.
వరుణ్ ధావన్, పూజా హెగ్డే, మృణాల్ థాకూర్ యాక్టర్లుగా ఇంతకు ముందు పాత్రలు చేయడమే కాకుండా తమ పెర్ఫార్మెన్స్‌తో లక్షలాది మంది అభిమానుల సంపాదించుకొన్నారు. ఈ సినిమా విషయానికి వస్తే.. ఏ దశలోను బెస్ట్ ఇచ్చారనే ఫీలింగ్ కలుగదు. ఏ మాత్రం యాక్టింగ్‌కు స్కోప్ లేని పాత్రల్లో కనిపించారు. ఇక మౌనీ రాయ్ పాత్ర చాలా నీచంగా ఉంటుంది. వరుణ్ ధావన్‌కు తల్లి పాత్రలో జీర్ణించుకోలేని విషయం. చివర్లో గెస్టుగా వచ్చిన కృతి సనన్ పాత్ర చాలా అర్టిఫిషియల్‌గా ఉంటుంది. జిమ్మీ ష్రెగిల్, చంకీ పాండే, రాకేష్ బేడీ తమకున్న ఇమేజ్‌ను భ్రష్టుపట్టించే పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాలో యాక్టర్ల ప్రతిభ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదనే భావన కలుగుతుంది.
కథ, కథనాలు పేలవంగా ఉంటే సాంకేతిక నిపుణులు కూడా ఏం చేయగలరు? అనేది ఈ సినిమా చూస్తే అర్ధమవుతుంది. అందమైన లొకేషన్లు, భారీగా, విలాసవంతంగా ఖర్చు చేసినప్పటికీ.. దాని ఫలితం తెర మీద ఏ కోశాన కనిపించదు. మ్యూజిక్ విషయానికి వస్తే.. టైటిల్ సాంగ్ సినిమా మొత్తం అరిగిపోయిన రికార్డులా వినిపిస్తుంటుంది. టెక్నికల్‌గా కూడా పాత కంపే కొడుతుంది. పక్కా టెంప్లెట్‌తో పరమ రొటీన్ సినిమాగా రూపొందిన ఈ చిత్రానికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. స్టార్ వాల్యూ చూసి థియేటర్‌కు వెళితే ఆర్థిక, మానసిక, శారీరక భంగపాటు తప్పదు.


Click it and Unblock the Notifications