Hai Jawani To Ishq Hona Hai First Review: హై జవానీ తో ఇష్క్ హోనా హై మూవీ ఫస్ట్ రివ్యూ

బాలీవుడ్‌లో యంగ్ హీరో, హీరోయిన్లు వరుణ్ ధావన్, పూజా హెగ్డే, మృణాల్ థాకూర్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ డ్రామా హై జవానీ తో ఇష్క్ హోనా హై (Hai Jawani Toh Ishq Hona Hai). ఈ చిత్రానికి సీనియర్ డైరెక్టర్, వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ టిప్స్ ఫిల్మ్స్, మాక్సీమిలియన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రమేష్ తౌరానీ, గౌరవ్ బోస్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో మనీష్ పాల్, చంకీ పాండే, జిమ్మి ష్రెగిల్, రాకేష్ బేడీ, అలీ అస్గర్ కీలక పాత్రల్లో నటించారు. మౌనీ రాయ్ స్పెషల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. కథ: ఫర్హాద్ సమ్జీ, సినిమాటోగ్రాఫర్: ఆయాంక బోస్, ఎడిటర్: రితేష్ సోని, మ్యూజిక్: రాజు సింగ్, వైట్ నాయిస్ కలెక్టివ్, జావెద్ మోహిసిన్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం జూన్ 5వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాకు లభించిన సర్టిఫికెట్ ఏంటి? ఈ చిత్రం రన్ టైమ్ ఎంత? ఈ చిత్రం కథ ఏమిటి? సెన్సార్ రిపోర్ట్ తర్వాత ఈ మూవీపై వచ్చిన ఫీడ్ బ్యాక్ ఏమిటనే వివరాల్లోకి వెళితే..

Hai Jawani To Ishq Hona Hai First Review

జాస్ (వరుణ్ ధావన్), బణి (మృణాల్ థాకూర్) భార్యభర్తలు. వైవాహిక జీవితాన్ని ఐదేళ్లపాటు ఆస్వాదిస్తారు. రెండు కీలక విషయాల్లో వారిద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకొంటాయి. ఆ గొడవలు పరిష్కరించుకొలేనంతగా ఉండటంతో విడాకుల తీసుకోవాలని డిసైడ్ అవుతారు. ఈ క్రమంలో జాస్ విదేశాలకు షిఫ్ట్ అవుతాడు. అక్కడ ప్రీత్ (పూజా హెగ్డే)తో జరిగిన పరిచయం వారి మధ్య సన్నిహిత సంబంధాలకు దారి తీస్తుంది. ఈ నేపథ్యంలో బాణి, ప్రీత్ గర్బవతులు అవుతారు. ప్రీత్‌తో బంధం జాస్‌కు ఎలాంటి చిక్కుల తెచ్చిపెట్టింది? బణికి విడాకులు ఇచ్చారా? జాస్, బణి విడదీసేంతగా ఉన్న రెండు విషయాలు ఏమిటి? జాస్ బంధం బణితో కొనసాగిందా? బణికి విడాకులు ఇచ్చి ప్రీత్‌తో లైఫ్‌ను షేర్ చేసుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

దర్శకుడు వరుణ్ ధావన్ రూపొందించే సినిమాలు రొమాంటిక్ అంశాలతోపాటు కామెడీకి పెద్ద పీట వేస్తుంటాడు. అలాగే ఆయన ఎమోషనల్ పాయింట్స్‌ను చక్కగా డీల్ చేస్తారనే క్రెడిబిలిటీ కూడా ఉంది. అయితే తన కుమారుడికి హిట్ ఇచ్చే ప్రయత్నంలో తన ప్రతిభకు మరోసారి సానపట్టారనే విషయం సెన్సార్ తర్వాత టాక్ వచ్చింది. ఇలాంటి సినిమాను రివ్యూ చేసిన సెన్సార్ బోర్డు అధికారులు, ప్రతినిధులు స్వల్ప మార్పులు సూచించారు. కొన్ని డైలాగ్స్‌ను సవరించాలని కోరారు. చిత్ర యూనిట్ మార్పులు, చేర్పులు చేయడం.. అలాగే కొన్నింటికి వివరణలు ఇవ్వడంతో ఎలాంటి సమస్యలు లేకుండా రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ పడింది.

హై జవానీ తో ఇష్క్ హోనా హై (HJTIHH) సినిమా యూనిట్ మార్పులు, చేర్పుల తర్వాత సమర్పించిన మూవీని వీక్షించిన అనంతరం ఈ సినిమాకు యూఏ (UA16+) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. దాంతో 16 ఏళ్లకు పైబడిన వారు ఎలాంటి అభ్యంతరం లేకుండా ఈ సినిమాను చూడొచ్చు. 12 ఏళ్ల లోపు పిల్లలు తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో చూడాల్సి ఉంటుంది అని సెన్సార్ సర్టిఫికెట్‌లో స్పష్టం చేశారు. ఈ సినిమా కథను సాగదీయకుండా.. ఇంటెన్స్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా మిస్ కాకుండా క్రిస్పీగా ఈ సినిమాను సుమారుగా 2 గంటల 16 నిమిషాల నిడివితో ముగించారు. అంటే ఈ సినిమా రన్ టైమ్ 136 నిమిషాలు అని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఈ సినిమా రిలీజ్‌కు ముందు సోషల్ మీడియాలోను, ప్రమోషనల్ పరంగా హడావిడి సృష్టిస్తూ కొంత మేరకు బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో వరుణ్ ధావన్, పూజా హెగ్డే మధ్య వచ్చే సీన్లు క్రేజీగా ఉంటాయి. వరుణ్, మృణాల్ థాకూర్ మధ్య ఎమోషనల్ సీన్లు ఆకట్టుకొనేలా ఉంటాయి. పూజా, మృణాల్ కాంబినేషనల్ సీన్లు కామెడీతో సినిమాను డ్రైవ్ చేస్తాయి. జెన్ జీ, యూత్ ఆడియెన్స్‌కు ఈ సినిమా కనెక్ట్ అయితే బాక్సాఫీస్ వద్ద మంచి విజయానికి స్కోప్ ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రిలీజ్ తర్వాత ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుంది. సగటు సినీ అభిమానుల నుంచి ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తుంది అనేది వేచి చూడాలి. ఈ సినిమా గురించిన ఎక్స్‌క్లూజివ్ రివ్యూ, బాక్సాఫీస్ నంబర్ల గురించి ఫీల్మీబీట్‌ను ఫాలో అవ్వండి...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X