Hai Jawani Toh Ishq Hona Hai Twitter Review: హై జవానీ తో ఇష్క్ హోనా హై ట్విట్టర్ రివ్యూ
బాలీవుడ్‌లో యంగ్ హీరో, హీరోయిన్లు వరుణ్ ధావన్, పూజా హెగ్డే, మృణాల్ థాకూర్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ డ్రామా హై జవానీ తో ఇష్క్ హోనా హై (Hai Jawani Toh Ishq Hona Hai). ఈ చిత్రానికి సీనియర్ డైరెక్టర్, వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ టిప్స్ ఫిల్మ్స్, మాక్సీమిలియన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రమేష్ తౌరానీ, గౌరవ్ బోస్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో మనీష్ పాల్, చంకీ పాండే, జిమ్మి ష్రెగిల్, రాకేష్ బేడీ, అలీ అస్గర్ కీలక పాత్రల్లో నటించారు. మౌనీ రాయ్ స్పెషల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. కథ: ఫర్హాద్ సమ్జీ, సినిమాటోగ్రాఫర్: ఆయాంక బోస్, ఎడిటర్: రితేష్ సోని, మ్యూజిక్: రాజు సింగ్, వైట్ నాయిస్ కలెక్టివ్, జావెద్ మోహిసిన్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం జూన్ 5వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా గురించి నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉంది? క్రిటిక్స్ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో స్పందన ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

దర్శకుడు డేవిడ్ ధావన్ నమ్మే ఒకే ఒక మంత్రం ఎంటర్‌టైన్‌మెంట్. హై జవానీ తో ఇష్క్ హోనా హై సినిమా స్ట్రెస్ బస్టర్. ప్రతీ క్షణం సినిమా చూసినంత సేపు చిరునవ్వలు పెదాలపై ఉంటాయి. లాజిక్‌లు వెతక్కుండా.. సీట్లో వెనక్కి ఒరిగి రిలాక్స్‌గా సినిమాను ఎంజాయ్ చేయొచ్చు. వరుణ్ ధావన్ కామెడీ బాగా వర్కవుట్ అయింది. ముృణాల్ థాకూర్, పూజా హెగ్డే గ్లామర్ ఆకట్టుకొనేలా ఉంటుంది అని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.
అందరూ కోరుకొన్నట్టే.. సినిమా యూనిట్ చెప్పినట్టే.. నవ్వులు, రొమాన్స్, మ్యూజిక్, అన్ లిమిటెడ్ ఫన్‌ను ఈ బాలీవుడ్ ఎంటర్‌టైనర్ అందించింది. తనకు ఉండే కంఫర్ట్ జోన్‌లో డేవిడ్ ధావన్ ఈ సినిమాను హిలేరియస్‌గా అందించారు. మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు టైలర్ మేడ్ సినిమాగా అందించారు. వరుణ్ ధావన్ కామిక్ టైమింగ్ బాగుంది. మృణాల్ థాకూర్ తన క్యారెక్టర్‌కు చార్మ్ తెచ్చిపెట్టింది. పూపా హెగ్గే గ్లామర్‌తో స్టన్నింగ్‌గా ఉంది అని సుమిత్ కడేల్ అన్నారు.
వరుణ్ ధావన్ సినిమా రియల్ బాలీవుడ్ ఎంటర్‌టైనర్ అంటే ఏమిటో చూపించింది. డేవిడ్ ధావన్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని నిరూపించాడు. ఆయన తనకు ఉన్న బాప్ ఆఫ్ కామెడీ ట్యాగ్‌కు న్యాయం చేశారు. ఆయన స్టైల్ మేకింగ్‌ను చాలా మంది అనుకరించారు. కానీ దశాబ్దాలుగా ఆయనలా సినిమాలు తీయలేకపోయారు అని జోగిందర్ తనేజా ట్వీట్ చేశారు.
ఈ సినిమా కంప్లీట్ ఎంటర్‌టైనర్. ప్రేక్షకులకు ఏం కావాలో దానిని అందించారు. ఫన్, కలర్‌ఫుల్‌గా, మంచి ఎంటర్‌టైన్‌మెంట్, కామెడీ ప్యాక్డ్ సన్నివేశాలు. రొమాన్స్, క్యాచీ మ్యూజిక్, ఫీల్ గుడ్ మూమెంట్స్‌తో ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమా సెకండాఫ్ చాలా బాగుంది. విపరీతంగా నవ్వేలా సినిమా సన్నివేశాలు ఉంటాయి అని రోహిత్ జైస్వాల్ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications