హాయ్‌ కి బాయ్‌!

By Staff

Hai
- జలపతి
చిత్రం: హాయ్‌
నటీనటులు: ఆర్యన్‌ రాజేష్‌, నిఖిత, చంద్రమోహన్‌, ప్రకాష్‌ రాజ్‌, జయసుధ
సంగీతం: కోటి
నిర్మాత: డి.రామానాయుడు
కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: ఇవివి సత్యనారయణ

సెంటిమెంట్‌ చిత్రాలతో విజయాలకు దూరమైన ఇవివి సత్యనారయణ తన కుమారుడు ఆర్యన్‌ రాజేష్‌ ను హీరోగా లాంఛ్‌ చేస్తూ తీసిన చిత్రం ఇది. ఈ తరానికి అనుగుణంగా ప్రేమకథ రూపొందించడం పెద్ద దర్శకుల వల్ల కాదు అని ఎస్వీ కష్ణారెడ్డి నిరూపిస్తే...ఇవివి దాన్ని మరింత పక్కాగా రుజువు చేశారు. తొలి గంట సేపు సినిమాలోని సీన్స్‌...మాటలు..అన్ని సిగ్రేడ్‌ సినిమా చూస్తున్నట్లుగా అనిపిస్తాయి. ఇవివి స్టైల్‌ కు డిఫరెంట్‌ చిత్రం ఇది. ఒక అమెచ్యుర్‌ డైరక్టర్‌ తీసినట్లుగా ఒక్కో యూత్‌ సినిమాలో నుంచి ఒక్కో సీన్‌ ఏరినట్లుగా అసంబద్దంగా ఉంది.

తెలిసిన కథను తెలిసిన విధంగానే..ఆకట్టుకోకుండా తీయడం అనేది సాహసమే. అలాంటి సాహసానికి తెలుగు దర్శకులు ఎందుకు పూనుకుంటున్నారో అర్థం కాదు. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఇంటర్వెల్‌ లోనే బాయ్‌ అని చెప్పాలనిపిస్తుంది. హీరో ప్రేమలో పడడం ఎంత అసహజంగా ఉంటుందో...వాళ్ళ తల్లితండ్రులు పెట్టిన షరతు కూడా చాలా సిల్లీగా ఉంటుంది.

హీరో ఆర్యన్‌ రాజేష్‌ అమెరికా నుంచి ఎంబిఎ చేసి తిరిగి వస్తాడు. హీరోయిన్‌ నిఖితను చూడగానే ప్రేమిస్తాడు. ఆమె వెంటపడి ఎలాగో ఒప్పిస్తాడు. పెద్దలకు చెప్పుతారు. హీరోయిన్‌ తండ్రి ప్రకాష్‌ రాజ్‌ - ఓ షరతు మీద వీరి పెళ్ళికి అంగీకరిస్తానంటాడు. ఆ షరతు ఏమిటంటే..ఒక నెల విదేశాల్లో వీరిద్దరూ హాయిగా గడిపేసి...ఎటువంటి గొడవలు లేకుండా రావాలని. దీంతో వీళ్ళద్దరు వెళ్తారు. చిన్న అపార్థాల వల్ల ఇండియాకు తిరిగివస్తారు. అప్పుడు వీళ్ళ తల్లితండ్రులిద్దరు మళ్ళీ వీళ్ళను కలిపి పెళ్ళి చేస్తారు.

హాయ్‌ అనే సినిమా టైటిల్‌ కు, సినిమాకు సంబంధమేమిటో! ఈ రోజుల్లో ఎవరైనా హీరో కావచ్చు...హీరోకు నటన రావాల్సిన అవసరం లేదు కాబట్టి ...ఆ లెక్క ప్రకారం ఆర్యన్‌ రాజేష్‌ ఫర్వాలేదు. ఈ చిత్రంలోని పాటలు మరీ పేలవం. ఒక్క 'తంతే పడ్డాను ...' అనే పాట మెలోడియస్‌ గా ఉంది. కోటి నిరాశపర్చాడు. ఫోటోగ్రఫీ బాగుంది. ఇవివి సత్యనారయణలో క్రియేటివిటి మొత్తం పోయిందని ఈ సినిమా ద్వారా తనే నిరూపించుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X